Allu Arjun Pushpa 2 Movie Launch With Pooja Ceremony, Pics Viral - Sakshi
Sakshi News home page

Pushpa The Rule : పుష్ప-2 నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

Published Mon, Aug 22 2022 11:25 AM | Last Updated on Mon, Aug 22 2022 12:39 PM

Allu Arjuns Most Awaited Film Pushpa The Rule Pooja Ceremony Begins - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన సినిమా పుష్ప. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఎర్ర చందనం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు ఓ రేంజ్‌లో స్వాగ్‌ క్రియేట్‌ చేసింది. ఇక ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న పుష్ప-2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి నేడు(సోమవారం)పూజా కార్యక్రమాలు జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ కనిపించలేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండటంతొ కార్యక్రమానికి హాజరు కాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నానే హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఆమె పాత్ర నిడివి తగ్గనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement