భలేవాడివి బాసు! 97 కోట్లు లాస్‌.. హ్యాపీగా ఉందన్న సీఈవో | Lush CEO Happy with Huge Loss Over Delete All social Media Accounts | Sakshi
Sakshi News home page

బిజీ సీజన్‌లో 97 కోట్ల నష్టం.. అయినా చిరునవ్వు, నువ్వు సూపర్‌ బాసు

Published Sat, Nov 27 2021 5:04 PM | Last Updated on Sat, Nov 27 2021 6:08 PM

Lush CEO Happy with Huge Loss Over Delete All social Media Accounts - Sakshi

‘గెలిస్తే ఏముంటుంది? ఓడితేనే కదా.. అసలు కిక్కు ఉండేది’ అనే టైప్‌ కాదు ఈ బాస్‌. అలాంటప్పుడు అంత లాస్‌లో ఆనందమా? ఈయనేం మనిషిరా బాబూ! అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆయన సంతోషంలో ఒక పరమార్థం ఉంది కాబట్టి. 

యూకేకి చెందిన ప్రముఖ కాస్మోటిక్‌ కంపెనీ లష్‌ శుక్రవారం కీలక అడుగు వేసింది. లష్‌ తన ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌, స్నాప్‌ఛాట్‌ అకౌంట్‌లను పూర్తిగా డిలీట్‌ చేసి పారేసింది.  కేవలం ఒక్క ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేసినందుకే 10 మిలియన్‌ పౌండ్లు(13.3 మిలియన్‌ డాలర్లు.. మన కరెన్సీలో 97కోట్ల 50 లక్షలకు పైమాటే) నష్టం వాటిల్లిందని కంపెనీ సీఈవో మార్క్‌ కంస్టాన్‌టైన్‌ సంతోషంగా ప్రకటించుకున్నారు. మిగతావి కలిపితే ఆ నష్టం మరో మూడునాలుగు మిలియన్‌ పౌండ్ల మధ్య ఉండొచ్చని ఆయన చెప్తున్నారు.

‘‘ఇదేం పీఆర్‌స్టంట్‌ కాదు. దీనివల్ల మాకు పెద్ద దెబ్బే. అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణం ఉంది.  సోషల్‌ మీడియా వల్ల టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆరోపణల్ని లష్‌ కంపెనీ నమ్ముతోంది. ఓవైపు పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఆ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మేం ఎలా ప్రమోట్‌ చేసుకోగలం.  కస్టమర్ల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చేసే వ్యాపారం మాకెందుకు!. దీనికి తోడు దశాబ్దానికిపైగా క్లైమేట్‌ ఛేంజ్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నా.. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పట్టించుకోవట్లేదని, అందుకే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ ఆ అకౌంట్లను తొలగిస్తున్నాం ఒక ప్రకటనలో లష్‌ పేర్కొంది. 

అంతేకాదు కొవిడ్‌ సమయంలో కఠిన ఆంక్షల మధ్యే తమ వ్యాపారం ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలదొక్కుకుందని, అలాంటిది సోషల్‌ మీడియా ప్రమోషన్‌ దూరమైనంత మాత్రాన తామేం ఇబ్బందిగా భావించబోమని, తాము కస్టమర్లని నమ్ముకున్నామని మార్క్‌ కంస్టాన్‌టైన్‌ చిరునవ్వుతో ధీమాగా చెప్తున్నారు.  సోషల్‌ మీడియా ప్రమోషన్‌ ఎంత పవర్‌ఫుల్‌దో తెలియంది కాదు. ప్రస్తుతం ఇయర్‌ ఎండ్‌ సీజన్‌ నడుస్తోంది. సాధారణంగా షాపింగ్‌ బిజీ ఉంటుంది. ఈ తరుణంలో సోషల్‌ మీడియా అకౌంట్లను ప్రమోషన్‌ కోసం వాడుకుంటాయి కంపెనీలు. కానీ,  లక్షల మంది ఫాలోవర్స్‌ను దూరం చేసుకుంటూ లష్‌ ఇలా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదిలా ఉంటే లష్‌కు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి 11 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్‌ ఉండేవాళ్లు డిలీట్‌ చేసిన నాటికి(శుక్రవారం, 26 2021).

 

గతంలో 2019లోనూ లష్‌ ఆల్గారిథమ్‌ విషయంలో ఫేస్‌బుక్‌పై అసంతృప్తితో కొన్నాళ్లు దూరం పెట్టింది కూడా. ఇదిలా ఉంటే జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం తర్వాత ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లను చాలా కంపెనీలు తొలగించడం చేశాయి.

చదవండి: ది గ్రేట్‌ అలెగ్జాండర్‌ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement