వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకులే పట్టించుకోవడం లేదు. నిట్ట నిలువునా నడిరోడ్డు మీద వదిలిస్తున్నారు. కానీ లక్షల కోట్ల విలువైన ఓ దిగ్గజ కంపెనీ సీఈవో అలా చేయలేదు. తల్లిదండ్రుల కోసం సీఈవో జాబ్‌ను తృణ ప్రాయంగా వదిలేశారు. ప్రస్తుతం ఆయన తీసుకున్న నిర్ణయం తల్లిదండ్రుల పట్ల కాఠిన్యం ప్రదర్శించే కొడుకులకు కనువిప్పును కలిగిస్తుంటే..తోటి సీఈవోలగా ఆదర్శంగా నిలుస్తోంది.
బ్లూం బర్గ్ కథనం ప్రకారం..యూకేకి చెందిన జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ సీఈవోగా ఆండ్రూ ఫార్మికా విధులు నిర్వహిస్తున్నారు. జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ వ్యాల్యూ అక్షరాల 5లక్షల కోట్లు. ఆ సంస్థ సీఈవోగా ఉన్న ఆండ్రూ తన జాబ్‌కు రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రిజైన్ కార్పొరేట్ దిగ్గజాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుండగా.. సీఈవో పదవి నుంచి తప్పుకోవడంపై ఆండ్రూ బ్లూంబర్గ్‌కు వివరణిచ్చారు. బీచ్‌లో కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నా. నా రాజీనామాకు ఇంతకు మించిన కారణాలు ఏం లేవని అనుకుంటున్నట్లు చెప్పారు.
కంపెనీ బోర్డ్‌కు ఏం చెప్పారంటే
సీఈవో పదవి నుంచి వైదొలగడంపై ఇప్పటికే ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌లకు ఆండ్రూ స్పష్టత నిచ్చినట్లు (అంచనా మాత్రమే) పలు నివేదికలు చెబుతున్నాయి. వృద్దాప్యంలో ఉన్న తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, వారి కోసం ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆ నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు అతను చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వైదొలిగినప్పటికీ, ఆండ్రూ ఫార్మికా జూన్ 2023 వరకు వ్యాపారంలో కొనసాగుతారు. కొత్త నాయకత్వంలో వ‍్యాపార కార్యకలాపాలు సజావుగా ఉండేలా ఆసియా వ్యాపారానికి మద్దతు ఇవ్వడం, ఆస్ట్రేలియన్ మార్కెట్‌పై పట్టసాధించేలా నిర్దేశించిన వ్యూహాత్మక లక్ష్యాల్ని చేరుకునేందుకు సహాయ పడనున్నట్లు జూపిటర్ ఫండ్ మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు తెలిపారు.
ఆండ్రూ వారసుడిగా మాథ్యూ బిస్లీ
"మార్కెట్‌లో మనం చేస్తున్న వ్యాపారం నిలుపుకోవడం సవాలుతో కూడుకుంది. సీఈవో హోదాలో అదే పనిని నేను అద్భుతంగా,అంకితభావంతో చేసినందుకు గర్వపడుతున్నాను" అని ఆండ్రూ తెలిపారు. బోర్డు నా వారసుడిగా మాథ్యూ బీస్లీని నియమించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.
చదవండి👉 ఎలన్ మస్క్ కొంపముంచిన చైనా.. లక్షల కోట్లు హాంఫట్!
Comments
Please login to add a commentAdd a comment