UK woman hair had 100 proposals and offered more than 2 crore rupees to cut it - Sakshi
Sakshi News home page

ఆమెకు 4 అడుగుల 7 అంగుళాల కురులు.. 100 ప్రపోజల్స్‌, రూ.2.6 కోట్ల ఆఫర్‌!

Published Sat, Jul 22 2023 11:05 AM | Last Updated on Sat, Jul 22 2023 12:05 PM

woman hair had 100 proposals and offered more than 2 crore rupee - Sakshi

మన మధ్యలో కనిపించే కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఒకరికి స్కిన్‌ టోన్‌ బాగుంటే, మరొకరు మంచి ఎత్తులో ఉంటారు. ఈ కోవకు చెందినదే ఇంగ్లండ్‌కు చెందిన జాస్మిన్‌ లార్సన్‌. ఈమె నిజజీవితంలో డిస్నీప్రిన్సెస్‌. జనం ఆమె కురులకు ఫిదా అయిపోతుంటారు. ఈ నేపధ్యంలోనే ఆమెకు లెక్కలేనన్ని పెళ్లి ప్రపోజల్స్‌ వస్తుంటాయి. 

22 ఏళ్ల జాస్మిన్‌ 2017 నుంచి తన కురులను పెంచడం ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ఆకర్షణీయమైన కురుల పొడవు 4 అడుగుల 7 అంగుళాలు. ఈ పొడవైన కురులు ఆమె మోకాళ్ల వరకూ ఉంటాయి. తన కురులను చూసి ముచ్చటపడిన 100 మందికిపైగా కుర్రాళ్లు తనకు ఆన్‌లైన్‌లో ప్రపోజల్స్‌ పంపారని జాస్మిన్‌ ఆనందంతో పొంగిపోతూ చెప్పింది. 

తన కురులను కట్‌ చేయించుకుంటే £250,000 (రూ. 2.6 కోట్లు) ఇస్తామంటూ కూడా ఆఫర్లు వచ్చాయని ఆమె తెలిపారు. దీనికి తాను ఒప్పు కోలేదని, తన జట్టు కత్తిరించి, దానిని ఎవరికో పంపాలని అనుకోవడం లేదని, ఈ కురులను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.  

బ్రిస్టల్‌లో ఉంటున్న జాస్మిన్‌ సోషల్‌ మీడియాలో తన కురులకు చెందిన ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. ప్రపంచంలోని చాలామందిని ఇవి ఆకర్షిస్తుంటాయని, ముఖ్యంగా ధనవంతులు తన కురులకు ఆకర్షితులవుతున్నారని జాస్మిన్‌ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాస్మిన్‌కు 10వేల మందికిపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. పలు బ్రాండ్స్‌ ఆమెతో కొలాబ్రేషన్‌కు సంప్రదిస్తుంటాయి. కాగా జాస్మిన్‌ ఒక కంపెనీలో ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.  
ఇది కూడా చదవండి:11 రోజుల ప్రేమ.. 10 వేల కి.మీ. ప్రయాణం.. సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement