cosmotic
-
కొవ్వొత్తుల తయారీతో మొదలుపెట్టి కోట్ల సంపాదన వరకు..
కాస్మొటిక్స్ క్వీన్‌గా ఎదిగిన మీరా కులకర్ణి విజయగాథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. చదువును పక్కన పెట్టి 20 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టిపోయింది... ఆ బంధం వికటించి కొన్ని రోజులకే ఆమె ఒంటరి తల్లిగా తిరిగి వచ్చింది.. కొన్నాళ్లకే తల్లిదండ్రులూ మృతి చెందడంతో అనాథగా మారింది. కాలాన్ని నెట్టుకుంటూ వచ్చి 45 సంవత్సరాల వయస్సులో వ్యాపారాన్ని ప్రారంభించింది. దేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరిగా అవరించింది. మీరా కులకర్ణి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది దేశంలోని ప్రముఖ సహజ సౌందర్య సాధనాల బ్రాండ్లలో ఒకటి. ముఖ్యంగా ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. మార్కెట్ లీడర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించిన మీరా కులకర్ణి ప్రయాణం కొవ్వొత్తుల తయారు చేసే చిన్న కుటీర పరిశ్రమ నుంచి ప్రారంభమైంది. అది తర్వాత హ్యాండ్‌మేడ్ సబ్బుల పరిశ్రమగా మారింది. ఫలించని వైవాహిక బంధం మీరా కులకర్ణి వైవాహిక బంధం ఫలించకపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. 28 సంవత్సరాలు వయస్సులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. భర్తకు దూరమై.. తల్లిందండ్రులు మరణించడంతో ఒంటరిగా తల్లిగా మిలిగిపోయింది. తమ ఇంటిలో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి అలా వచ్చే డబ్బుతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత 45 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించింది మీరా. మొదట కొవ్వొత్తులను తయారు చేయడం ప్రారంభించిన ఆమె తర్వాత హ్యాండ్ మేడ్ సబ్బుల తయారీకి మారింది. యూఎస్‌లో చదువుతున్న తన కొడుకు వద్దకు వెళ్లినప్పుడు ఆమెకు వచ్చిన సలహాతో సబ్బుల తయారీలో శిక్షణ పొందింది. ఆమె కొడుకు సమర్థ్ బేడీ ఇప్పుడు ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రూ.2 లక్షల పెట్టుబడితో.. మీరా కులకర్ణి కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. నేడు ఆమె బ్రాండ్‌కు భారతదేశం అంతటా 110, విదేశాలలో డజనుకు పైగా స్టోర్లు ఉన్నాయి. తాజ్, హయత్ వంటి 300పైగా హోటళ్లు, దాదాపు 150 స్పాలు ఆమె కంపెనీ ఉత్పత్తులు వినియోగిస్తున్నాయి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కంపెనీ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.253 కోట్లు, 2021 ఆర్థిక ఏడాదిలో రూ.210 కోట్లు ఆర్జించింది. మీరా కులకర్ణి రూ. 1,290 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా కోటక్ వెల్త్ హురున్ – లీడింగ్ వెల్తీ ఉమెన్ 2020గా నిలిచారు. ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది! -
భలేవాడివి బాసు! 97 కోట్లు లాస్.. హ్యాపీగా ఉందన్న సీఈవో
‘గెలిస్తే ఏముంటుంది? ఓడితేనే కదా.. అసలు కిక్కు ఉండేది’ అనే టైప్ కాదు ఈ బాస్. అలాంటప్పుడు అంత లాస్లో ఆనందమా? ఈయనేం మనిషిరా బాబూ! అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆయన సంతోషంలో ఒక పరమార్థం ఉంది కాబట్టి. యూకేకి చెందిన ప్రముఖ కాస్మోటిక్ కంపెనీ లష్ శుక్రవారం కీలక అడుగు వేసింది. లష్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌ఛాట్ అకౌంట్లను పూర్తిగా డిలీట్ చేసి పారేసింది. కేవలం ఒక్క ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ చేసినందుకే 10 మిలియన్ పౌండ్లు(13.3 మిలియన్ డాలర్లు.. మన కరెన్సీలో 97కోట్ల 50 లక్షలకు పైమాటే) నష్టం వాటిల్లిందని కంపెనీ సీఈవో మార్క్ కంస్టాన్‌టైన్ సంతోషంగా ప్రకటించుకున్నారు. మిగతావి కలిపితే ఆ నష్టం మరో మూడునాలుగు మిలియన్ పౌండ్ల మధ్య ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ‘‘ఇదేం పీఆర్స్టంట్ కాదు. దీనివల్ల మాకు పెద్ద దెబ్బే. అయినా ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్టి కారణం ఉంది. సోషల్ మీడియా వల్ల టీనేజర్ల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆరోపణల్ని లష్ కంపెనీ నమ్ముతోంది. ఓవైపు పిల్లల ప్రాణాలు పోతుంటే.. ఆ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మేం ఎలా ప్రమోట్ చేసుకోగలం. కస్టమర్ల ప్రాణాలకు విలువ ఇవ్వకుండా చేసే వ్యాపారం మాకెందుకు!. దీనికి తోడు దశాబ్దానికిపైగా క్లైమేట్ ఛేంజ్‌పై ఆందోళన వ్యక్తం అవుతున్నా.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పట్టించుకోవట్లేదని, అందుకే వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని తృణప్రాయంగా వదిలేస్తూ ఆ అకౌంట్లను తొలగిస్తున్నాం ఒక ప్రకటనలో లష్ పేర్కొంది. అంతేకాదు కొవిడ్ సమయంలో కఠిన ఆంక్షల మధ్యే తమ వ్యాపారం ఆటుపోట్లను ఎదుర్కొంటూ నిలదొక్కుకుందని, అలాంటిది సోషల్ మీడియా ప్రమోషన్ దూరమైనంత మాత్రాన తామేం ఇబ్బందిగా భావించబోమని, తాము కస్టమర్లని నమ్ముకున్నామని మార్క్ కంస్టాన్‌టైన్ చిరునవ్వుతో ధీమాగా చెప్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్ ఎంత పవర్ఫుల్దో తెలియంది కాదు. ప్రస్తుతం ఇయర్ ఎండ్ సీజన్ నడుస్తోంది. సాధారణంగా షాపింగ్ బిజీ ఉంటుంది. ఈ తరుణంలో సోషల్ మీడియా అకౌంట్లను ప్రమోషన్ కోసం వాడుకుంటాయి కంపెనీలు. కానీ, లక్షల మంది ఫాలోవర్స్‌ను దూరం చేసుకుంటూ లష్ ఇలా నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదిలా ఉంటే లష్కు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కలిపి 11 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉండేవాళ్లు డిలీట్ చేసిన నాటికి(శుక్రవారం, 26 2021). గతంలో 2019లోనూ లష్ ఆల్గారిథమ్ విషయంలో ఫేస్‌బుక్‌పై అసంతృప్తితో కొన్నాళ్లు దూరం పెట్టింది కూడా. ఇదిలా ఉంటే జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తర్వాత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను చాలా కంపెనీలు తొలగించడం చేశాయి. చదవండి: ది గ్రేట్ అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం.. వందల కోట్ల వ్యాపారానికి నాంది -
వయసు తగ్గుతుందేమో కానీ..
న్యూయార్క్: ఫేస్‌లిఫ్ట్ ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పోందుతున్న కాస్మొటిక్ సర్జరీ. వయసు మీద పడుతున్నవారు యవ్వనంగా కన్పించాలనే తాపత్రయంతో ఎక్కువగా ఈ సర్జరీ మీద ఆధారపడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ సర్జరీని ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. ఫేస్‌లిఫ్ట్ సర్జరీ చేయించుకోవడం వల్ల వాస్తవానికి ఉన్న వయసు కంటే 10 సంవత్సరాలు తక్కువగా కన్పిస్తారని ప్రచారంలో ఉంది. ఫేస్‌లిఫ్ట్ సర్జరీ వలన ముఖంలో వయసు తాలూకు చాయలు తగ్గుతాయేమో కానీ.. వారి ఆత్మవిశ్వాసం మాత్రం మెరుగుపడడం లేదని తాజాగా నిర్వహించిన సర్వేలో తేలింది. న్యూయార్క్‌కు చెందిన 'ఆండ్రూ జుకానో ఫేసియల్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ' అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సర్వేలో భాగంగా ఫేస్ లిఫ్టింగ్ సర్జరీ చేయించుకున్న పలువురి అభిప్రాయాలను సేకరించగా, వారిలో ఈ చికిత్స తర్వాత ఆత్మవిశ్వాసంలో ఎలాంటి పురోగతి కన్పించలేదని తెలిపింది. అంతే కాకుండా సర్జరీతో ప్రస్తుత వయసుకు దాదాపు 10 సంవత్సరాలు తక్కువగా కన్పిస్తున్నామని తెలిపిన వారు.. ఆ వయసులోని వారిలా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడంలో మాత్రం వెనుకబడుతున్నామని తెలిపారు.