ఎలన్ మస్క్ (ఫైల్ ఫోటో)
డేటా బ్రీచ్ సెగ ఫేస్‌బుక్‌ను పట్టి పీడిస్తోంది. కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించిందన్న ఆరోపణలు దుమారం మరింత ముదురుతోంది. ఇప్పటికే డిలిట్ ఫేస్‌బుక్ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం సోషల్ మీడియాలో కాకపుట్టిస్తోంటే.. తాజాగా టాప్ కంపెనీలు ఈ కోవలోకి చేరడం ఫేస్‌బుక్‌ను మరింత సంకోభం లోకి నెట్టివేస్తోంది. తాజాగా మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌ను గుడ్ బై చెపుతున్నాయి. ముఖ్యంగా లక్షలాది ఫాలోవర్లు ఉన్న టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల ఫేస్‌బుక్ అకౌంట్లను తొలగించినట్టు ఎలన్ మస్క్ ప్రకటించడం కలకలం రేపింది. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో తన అభిప్రాయాలను ట్విట్ చేశారు.
ఫేస్‌బుక్‌పై ఎలన్ మస్క్ వ‍్యంగ్యాస్త్రాలు
ఫేస్‌బుక్ అనేది ఒకటుందనేది తనకు తెలియందంటూ వ్యంగ్యంగా కమెంట్ చేశారు. తను గానీ, తన కంపెనీలుగానీ ఫేక్ ఎండార్స్‌లు చేయమన్నారు. మరోవైపు ఇనస్టాగ్రామ్ ఒక మేరకు పరవాలేదంటూ అభిప్రాయంగా చెప్పారు. నిజాయితీగా ఉన్నంతకాలం ఇన్‌స్ట్రాగ్రామ్ ఒకే అన్నారు. ఫేస్‌బుక్ ఏంటి? నేను అసలు ఫేస్‌బుక్ వాడను.. ఎప్పటికీ వాడనంటూ ఆయన ట్వీట్ చేశారు. . సో..ఇది తనను, తన కంపెనీలను పెద‍్ద దెబ్బ తీస్తుందని భావించడంలేని పేర్కొన్నారు. దీంతో గత ఏడాది రోబోల విషయంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ..ఎలన్‌మస్క్, మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని టెక్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.
పొరబాటు జరిగింది క్షమించండంటూ ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ విజ్ఞప్తి చేసినప్పటికీ 5కోట్ల వినియోగదారుల సమాచారం లీక్ అంశం రేపిన ఆగ్రహం చల్లారడంలేదు.ఫేస్‌బుక్‌పై ఆరోపణలు వెల్లువెత్తగానే స్పేస్‌ఎక్స్, టెస్లా ఖాతాలను తొలగించాలంటూ ట్విటర్‌లో ఎలన్‌మస్క్‌ను ఆయన ఫాలోవర్లు కోరారు. దీంతో ఖాతాలను తీసేస్తున్నట్లు ఎలన్ తెలిపారు. ఫేస్‌బుక్‌లో టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీల ఖాతాలను తొలగించినట్లు అధినేత ఎలన్ మస్క్ ప్రకటించారు. అటు ప్రముఖ సెర్చ్ ఇంజీన్ మొజిల్లా ఫైర్‌ఫాక్స్ కూడా తాము ఫేస్‌బుక్ నుంచి తాత్కాలికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అయితే మొజిల్లా తన ఖాతాను తొలగించనప్పటికీ.. ఇకపై ఈ ఖాతా నుంచి ఎలాంటి పోస్టులు చేయబోమని తెలిపింది. ‘ఫేస్‌బుక్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ ఆక్టన్ కూడా ‘ఇది ఫేస్‌బుక్‌ను డిలిట్ చేయాల్సిన సమయం’ ట్వీట్‌తో డిలీట్ ఫేస్‌బుక్ ఉద్యమాన్ని రగిలించిన సంగతి తెలిసిందే. కాగా 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్ అనలిటికాకు 5కోట్ల మంది ఫేస్‌బుక్ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీక్ ఆరోపణలతో ఫేస్‌బుక్‌కు చిక్కులు ఎదురయ్యాయి. మరోవైపు కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థలో రెగ్యులేటరీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment