![Mahanati Donga Ramudu Song Deleted Scene - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/26/Mahanati-Dongaramudu-Song-D.jpg.webp?itok=XCLv6W4i)
తొలగించిన సన్నివేశంలోని దృశ్యం
మహానటి చిత్రం నుంచి తొలగించిన మరో సన్నివేశాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఏఎన్నార్, సావిత్రి, జమున నటించిన దొంగరాముడు(1955) చిత్రంలోని రావోయి మా ఇంటికి.. మావోయ్.. మాటున్నది మంచి మాటున్నది... పాట వీడియోను రిలీజ్ చేశారు. సావిత్రి.. ఆర్.నాగేశ్వర రావులపై చిత్రీకరించిన పాట ఇది. కీర్తి సురేష్ అచ్చు సావిత్రిలానే హావభావాలు పలికిస్తూ ఆకట్టుకుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన మహానటికి నాగ్ అశ్విన్ దర్శకుడు. కీర్తీ సురేష్ లీడ్ రోల్‌లో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment