హీరోయిన్ హన్సిక (Hansika Motwani) వేధింపులు తాళలేకపోతున్నానంటూ బుల్లితెర నటి ముస్కాన్ నాన్సీ పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రశాంత్ మోత్వానీ, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సిక మోత్వానీలు తనను మానసికంగా హింసిస్తున్నారని వాపోయింది. ఈ మానసిక ఒత్తిడి వల్ల తన ముఖంలో కొంతభాగం పక్షవాతానికి గురైందని పేర్కొంది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 18న నటి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఖరీదైన గిఫ్టులు తెమ్మని..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముస్కాన్ (Muskaan Nancy James), ప్రశాంత్ 2020లో పెళ్లి చేసుకున్నారు. వివాహమైన కొంతకాలానికే డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని నటి అత్త, ఆడపడుచు హన్సిక డిమాండ్ చేశారట! అంతేకాకుండా ఆస్తిలోనూ ఏవో కుట్రలకు పాల్పడ్డారని నటి ఆరోపించింది. తన వైవాహిక బంధంలోనూ హన్సిక పదేపదే జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యేదని పేర్కొంది. వీరు పెట్టిన టార్చర్ వల్ల తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై హన్సిక, ప్రశాంత్ ఇంతవరకు స్పందించలేదు. కాగా ముస్కాన్ దంపతులు 2022 నుంచి విడివిడిగానే జీవిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: అప్పట్లో ఐరన్ లెగ్ అని పేరొస్తుందని భయపడ్డా: చిరంజీవి
పాక్షిక పక్షవాతం
2022లో నటి తన ముఖం పాక్షిక పక్షవాతానికి గురైనట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. కొంతకాలంగా నేనేమైపోయానని అనుకుంటున్నారా? నా జీవితంలో ఏం జరుగుతుందనేది కొందరికి మాత్రమే తెలుసు. నేను ముఖ పక్షవాతంతో బాధపడుతున్నాను. అధిక ఒత్తిడి వల్ల నాకీ పరిస్థితి వచ్చింది. గతంలో ఈ వ్యాధి బారిన పడ్డప్పుడు కోలుకున్నాను. కానీ ఇప్పుడు మరోసారి ఆ వ్యాధి నా జీవితంలోకి ప్రవేశించింది.
ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది?
గత కొద్ది నెలలనుంచి నేను, నా తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాం. ముఖం ఉబ్బిపోయి ఆ బాధ భరించరాకుండా ఉంది. ఒక నటికి ఇంతకంటే దుర్భరమైన పరిస్థితి ఇంకేముంటుంది? నాముందున్న సమస్యలతో పోరాడే శక్తినిచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు సపోర్ట్‌గా నిలబడే పేరెంట్స్ ఉండటం నా అదృష్టం. జీవితం అంత ఈజీ కాదు.. కానీ ఏదో ఒకరోజు తప్పకుండా అన్నీ మారిపోతాయి అని రాసుకొచ్చింది.
సీరియల్స్..
ముస్కాన్ నాన్సీ.. తొడి ఖుషి తొడె ఘమ్ సీరియల్‌లో సహాయక నటిగా యాక్ట్ చేసింది. ఈ ధారావాహికతో విశేష గుర్తింపు తెచ్చుకున్న నాన్సీకి మాతా కీ చౌకి సీరియల్ ఆఫర్ వచ్చింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. అదాలత్, ఫియర్ ఫైల్స్, క్రైమ్ పెట్రోల్ షోలలో కొన్ని ఎపిసోడ్స్‌లో మెరిసింది. భారత్ కా వీర్ పుత్ర: మహారాణ ప్రతాప్, ఏజెంట్ రాఘవ్- క్రైమ్ బ్రాంచ్ షోలలో నటించింది. గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటోంది.
చదవండి: అన్నీ ఒకేసారి.. నా వల్ల కావట్లేదంటూ ఏడ్చేసిన మాధవీలత
Comments
Please login to add a commentAdd a comment