ప్రముఖ నటి కూతురి ఫొటోలు వైరల్! | Shweta Tiwari Daughter Palak is become internet sensation | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటి కూతురి ఫొటోలు వైరల్!

Published Fri, Jul 7 2017 12:18 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

ప్రముఖ నటి కూతురి ఫొటోలు వైరల్!

ప్రముఖ నటి కూతురి ఫొటోలు వైరల్!

న్యూఢిల్లీ: ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో కనిపించిన యువతి ఇంటర్‌నెట్ సెన్సేషన్‌గా మారారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె బాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె మరెవరో కాదు.. బుల్లితెర ప్రముఖ నటి శ్వేతా తివారీ ముద్దుల తనయ పలక్ తివారీ. సొంతంగా కష్టపడి ఎదిగిన శ్వేతా తివారీ.. పలు హిందీ సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే గత మంగళవారం జీ గోల్డ్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో శ్వేతా తివారీ పాల్గొనగా అందరి దృష్టిని ఓ యువతి ఆకర్షించారు. బ్లాక్ డ్రెస్సులో దర్శనమిచ్చిన ఆమె తొలుత ఎవరై ఉంటుందోనని అందరూ భావించారు.

నా వెంట వచ్చి, మా దంపతులతో పాటు ఫొటోలకు ఫోజులిచ్చింది నా కన్నకూతురు పలక్ తివారీ అంటూ శ్వేత పరిచయం చేశారు. కూతురు అందానికి ఆ ఈవెంట్లో మార్కులు పడటంతో ఆమె హ్యాపీగా ఉన్నారు. పలక్ మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందని శ్వేతా ధీమాగా ఉన్నారు. మరికొందరు నటీమణులతో కలిసి వర్ధమాన తార పలక్ రెడ్ కార్పెట్‌ షేర్ చేసుకున్నారు. ఈవెంట్లో పలక్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పలక్‌కు సినిమా అవకాశాలు క్యూ కడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-4లో విజేతగా నిలిచిన శ్వేతా తివారీ.. తన కూతురును వెండితెరకు పరిచయం చేసేందుకు యత్నిస్తున్నారు. మరో తారే జమీన్ పర్ ఫేమ్ దర్శీల్ సఫారీకి జోడీగా జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. శ్వేతా తివారీ, ఆమె మొదటి భర్త రాజా చౌదరీల కూతురు పలక్. కాగా, రాజా చౌదరీతో విడాకులు తీసుకున్న అనంతరం నటుడు అభినవ్ కోహ్లీని శ్వేతా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement