palak Tiwari
-
స్టార్ హీరో కుమారుడితో హీరోయిన్.. దివాళీ బాష్‌లో మెరిసిన ప్రేమజంట..!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ ఇప్పుడిప్పుడే సినిమాలతో బిజీ అవుతోంది. గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ అనే మూవీతో అభిమానలను అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించింది. బాలీవుడ్ నటి శ్వేత తివారీ వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ కొన్ని నెలలుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ బీటౌన్లోనే వినిపిస్తూనే ఉన్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు బీటౌన్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాకుడా వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపించడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి. గతంలో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఓసారి అతని ఇంటి వద్ద కూడా కనిపించింది.తాజాగా ఈ జంట ప్రముఖ డిజైనర్ అబు జానీ సందీప్ ఖోస్లా దీపావళి పార్టీలో మెరిశారు. వీరిద్దరు కలిసి పార్టీకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఇబ్రహీం అలీ ఖాన్ తన ప్రియురాలు పాలక్ తివారీని కలిసి వెళ్లడం కనిపించింది. అయితే వీరిద్దరి డేటింగ్‌పై ఇప్పటివరకు స్పందించలేదు.కాగా.. సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన పాలక్ తివారీ మరో చిత్రంలో నటిస్తోంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న రోసీ: ది సాఫ్రాన్ చిత్రంలో కనిపించనుంది. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం అలీ ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కాస్ట్ లీ కారు కొన్న యువ హీరో.. గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి పార్టీ?
రీసెంట్ టైంలో బాలీవుడ్‌లోకి వారసులు వరసగా ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. గతేడాది రిలీజైన ఓ మూవీతో ఖుషీ కపూర్, అగస్త్య నంద, సుహానా ఖాన్ తదితర నటులుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులోకి ఇబ్రహీం అలీ ఖాన్ కూడా త్వరలో చేరబోతున్నాడు. ఇంకా హీరోగా తొలి మూవీ రిలీజ్ కాలేదు. కానీ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఆ కారు ఖరీదుతో పాటు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ వల్ల ఆగిపోయిన అభిమాని పెళ్లి)సైఫ్ అలీ ఖాన్ తొలి భార్యకు కలిగిన సంతానం సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. వీళ్లలో సారా ఇప్పటికే హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు ఇబ్రహీం హీరోగా లాంచ్ కాబోతున్నాడు. 'సర్జమీన్' అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నటిస్తున్నందుకు గానూ మంచి రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బులుతోనే బీఎండబ్ల్యూ ఎక్స్5 అనే లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు టాక్. మార్కెట్లో దీని ధర రూ.1.13 కోట్లు అని సమాచారం.తాజాగా ఈ కారులో బయట కనిపించిన ఇబ్రహీం.. దీన్ని కొన్న సందర్భంగా పార్టీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే ఇతడి రూమర్ గర్ల్‌ఫ్రెండ్, నటి పాలక్ తివారీ కూడా పాల్గొంది. ఇబ్రహీం ఇంటి నుంచి బయటకొస్తూ కనిపించడంతో ఇదే నిజమేనని మాట్లాడుకుంటున్నారు. (ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
స్టార్ హీరో కుమారుడితో నటి డేటింగ్.. వీడియో వైరల్!
బాలీవుడ్ భామ పాలక్ తివారీ గతేడాది కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ చిత్రంతో అలరించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీలో పూజా హెగ్డే లీడ్రోల్లో కనిపించింది. నటి శ్వేత తివారీ వారసులరాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ముద్దుగుమ్మపై డేటింగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి.బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. గత ఏప్రిల్‌లో ఇబ్రహీం, పాలక్ తివారీ గోవా నుంచి తిరిగివస్తూ విమాశ్రయంలో కనిపించారు. అప్పటి డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాలక్ తివారీ తాజాగా ప్రియుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఇంటివద్ద కనిపించింది. అతని ఇంటి నుంచి కారులో వెళ్తుండగా కెమెరాలకు చిక్కింది.ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పాలక్, ఇబ్రహీం డేటింగ్లో ఉన్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు కరణ్ జోహార్ రాబోయే చిత్రం 'సర్జమీన్'చిత్రం ద్వారా ఇబ్రహీం బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ చిత్రంలో కాజోల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
లోయర్ పరేల్‌లోని కాజీ బాక్స్‌లో నటి పాలక్ తివారీ బీ బ్యూటీని ప్రారంభించారు
-
సలార్ నటి స్టన్నింగ్ వర్కవుట్స్.. బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
►స్టన్నింగ్ లుక్‌లో యంగ్ బ్యూటీ దివి పోజులు ►వయసు పెరిగినా గ్లామర్‌లో తగ్గేదేలే అంటోన్న రవీనా టాండన్ ►కలర్‌పుల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న తేజస్వి ప్రకాశ్ ►సలార్ రాధారమ శ్రీరెడ్డి స్టన్నింగ్ వర్కవుట్స్ ►రెడ్ డ్రెస్‌లో సన్ని లియోన్ హోయలు ►స్మైలీ లుక్స్‌తో మతి పోగోడుతున్న పాలక్ తివారి ►బీచ్‌లో ఫుల్‌గా చిల్ అవుతోన్న కంచె భామ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
అత్యంత చెత్త ఫ్యాషన్ వీళ్లదే.. ఆ లిస్ట్‌లో ఎవరెవరంటే?
బాలీవుడ్ అంటే ఓ ఫ్యాషన్ ప్రపంచం. ఈవెంట్ ఏదైనా సినీ తారలు తమ ఫ్యాషన్‌ను వేదికపైనే పరిచయం చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తమ ఫ్యాషన్ డ్రెస్సులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంటారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) తాజాగా జరిగిన కేన్స్, ఐఫా లాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఊర్వశి రౌతేలా, ఐశ్వర్యరాయ్, పాలక్ తివారీ, కాజోల్, నోరా ఫతేహి, చాహత్ ఖన్నా వేదికలపై తళుక్కున మెరిశారు. కొందరు తమ డ్రెస్సులతో అభిమానులను మెప్పించగా.. మరికొందరు తారలు విచిత్రమైన ఫ్యాషన్‌తో దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. View this post on Instagram A post shared by Urvashi Rautela❤️ (@asliurvashians) అలా ఇటీవల జరిగిన ఐఫా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అత్యంత చెత్త ఫ్యాషన్‌తో దారుణంగా ట్రోల్స్‌కు గురయ్యారు. వారిలో ప్రధానంగా ఊర్వశి రౌతేలా, పాలక్ తివారీ, చాహత్ ఖన్నా, కాజోల్, దివ్యాంక త్రిపాఠి, నోరా ఫతేహీ ఉన్నారు. ఈ వారంలో అత్యంత చెత్త ఫ్యాషన్ దుస్తులతో ముందు వరుసలో నిలిచారు. నోరా ఫతేహీ మొదటి రోజే ఎరుపు రంగు దుస్తులు ధరించి ట్రోల్స్‌కు గురైంది. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) ఐఫా వేడుకల్లో ఊర్వశి రౌతేలా గౌనులో గోధుమ రంగు ఈకలు ఉన్న డ్రెస్సుతో మెరిసింది. ఇది చూసిన నెటిజన్స్ ఆమె ఘోరమైన సెలక్షన్ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక చాహత్ ఖన్నా బ్లాక్ గౌనులో ఉర్ఫీ జావెద్‌ను తలపించింటూ కామెంట్స్ చేశారు. కాజోల్ కాషాయ రంగులో డ్రెస్సులో కనిపించగా.. ఆమెదీ పనికిమాలిన ఫ్యాషన్ అంటూ కామెంట్ చేశారు. ఇక మరో నటి పాలక్ తివారీ డ్రెస్ బెడ్‌షీట్, కర్టెన్ క్లాత్‌ను తలపించేలా ఉందంటూ ట్రోల్ చేశారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
సల్మాన్ ఖాన్ సెట్స్‌లో అలాంటి బట్టలేసుకోవాలంటాడు: నటి
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘కిసీకా భాయ్ కిసీకీ జాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలో నటించిన నటి పాలక్ తివారీ సల్మాన్ ఖాన్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''సల్మాన్‌తో పనిచేయడం ఆనందంగా ఉంది. ఆయన సెట్లో అమ్మాయిలు పద్దతిగా బట్టలు వేసుకోవాలని రూల్ పెట్టారు. డీప్ నెక్ ఉండే డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు. సల్మాన్ ఇలాంటి రూల్ పెట్టడానికి కారణం ఏమిటంటే.. ఆయన సంప్రదాయాలకు ఎక్కువగా విలువిస్తారు. తన చుట్టూ ఉండే మహిళలు సేఫ్‌గా ఉండాలని కోరుకుంటాడు.ఇకక సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ అనగానే నా తల్లి చాలా సంతోషపడింది.ఎందుకంటే ఆమెకు నా డ్రెస్సింగ్ విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉండేవి. కానీ సల్మాన్ రూల్స్ నేపథ్యంలో నేను నిండుగా కప్పుకొని షూటింగ్‌కి వెళ్తుంటే చూసి అమ్మ మురిసిపోయేది'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాలో సల్మాన్‌కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమా ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. -
యంగ్ నటిపై దారుణమైన ట్రోల్స్.. చివరికి ఏం చేసిందంటే?
బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేత తివారీ ముద్దుల కూతురు పాలక్ తివారి. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది ముద్దుగుమ్మ. అయితే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫోటోలను పంచుకున్నారు. అవీ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ ఆమెపై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. పాలక్ తివారీ తాజాగా ఇన్‌స్టాలో కాస్తా బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. ఇవీ చూసిన కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కొందరేమో మీరు చాలా అందంగా ఉన్నారంటూ పోస్ట్ చేయగా.. మరికొందరు మాత్రం చాలా దారుణంగా కామెంట్స్ పెట్టారు. దీంతో నెటిజన్స్ చేసిన పనికి పాలక్ తివారీ కొపమొచ్చింది. వెంటనే కామెంట్స్‌ను ఆఫ్ చేసేసింది. విషయమేమిటంటే పాలక్ తివారీ తాజాగా తన ఇన్‌స్టాలో కొన్ని హాట్ ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు వైరలయ్యాయి. వాటిని చూసిన కొందరు యూజర్లు అందంగా ఉన్నావంటూ పొగడగా.. మరికొందరు మాత్రం దారుణంగా నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. దీంతో ఆమె కొంతసేపటికే కామెంట్స్‌ను ఆఫ్ చేసింది. ఇక ఈ విషయంపై నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. దీనిపై కూడా ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాగా.. బిజ్లీ బిజ్లీ మ్యూజిక్ వీడియోతో ఫేమ్ సంపాదించకుంది పాలక్ తివారీ. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ కనిపించనుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వెంకటేష్, జగపతిబాబు, పూజా హెగ్డే, షెహ్నాజ్ గిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) -
అలాంటి నిర్ణయాలను అమ్మ నాకే వదిలేస్తుంది: ఫలక్ తివారి
బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేత తివారి ముద్దుల తనయ ఫలక్ తివారి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన కొత్త సినిమా కబుర్లతో పాటు, మూవీస్ ఎంపిక విషయంలో తన తల్లి ప్రమేయం ఎంతో వివరించింది. తాజాగా ఫలక్ ఓ వెబ్‌సైట్‌కి ఇంటర్వూలో.. "మీరు ఇంటిమేట్ సీన్స్‌లో నటిస్తే శ్వేత తివారి ఎలా ఫీల్ అవుతారు. ఆమె మీ సినిమాల ఎంపికలో జోక్యం చేసుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. మా అమ్మ ప్రతిసారి నీ కెరీర్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు నువ్వే తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. అందుకే ఆమె అలాంటి విషయాల్లో అసలు జోక్యం చేసుకోదు. కానీ ఏదైనా విషయమై సలహా కోసం వెళితే మాత్రం తన వరకూ ఏది మంచిదో వివరిస్తుంది" అంటూ బదులిచ్చింది. కాగా, ఈ బ్యూటీ రోసీ: ది సప్రోన్ ఛాఫ్టర్ అనే హార్రర్ చిత్రంలో నటిస్తుంది. ఇక ఆమె తల్లి శ్వేత తివారి ప్రస్తుతం ఖాత్రోంకె ఖిలాడీ 11 సీజన్లో పాల్గొననున్నారు. -
‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’
ముంబై : భర్త అభినవ్ కోహ్లి తనను మానసికంగా వేధిస్తున్నాడు అంటూ టీవీ సీరియల్ నటి శ్వేతా తివారి గృహహింస కేసును నమోదు చేయడంపై కూతురు పాలక్ తివారి స్పందించారు. తండ్రి తనను శారీరకంగా వేధించాడంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. కాగా భర్త తనను వేధిస్తున్నాడంటూ శ్వేతా తివారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలసిందే. ఈ క్రమంలో అభినవ్ తన కూతురిని కూడా కొట్టాడంటూ ఆమె ఆరోపించినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ వార్తలపై శ్వేత కూతురు పాలక్ తివారి సోషల్ మీడియాలో స్పందించారు. కఠిన సమయంలో తన తల్లికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మీడియా వెల్లడించిన విషయాలన్నీ వాస్తవాలు కావని కొట్టిపారేశారు. మీడియా ఏదైనా విషయం గురించి ప్రచురించే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని, అబద్దాలను ప్రచారం చేయకూడదని సూచించారు. తన తల్లి అనేక సార్లు గృహహింసకు గురైన విషయం వాస్తవమే కానీ కేసు నమోదు చేసిన రోజు తప్ప ఏ రోజు అభినవ్ కోహ్లి తన తల్లిని కొట్టలేదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ లేఖ రాశారు. చదవండి : భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి అదే విధంగా సవతి తండ్రి(అభినవ్) తనను ఎప్పుడు శారీరకంగా వేధించలేదని.. కనీసం అసభ్యంగా తాకలేదని పాలక్ పేర్కొన్నారు. అభినవ్ ప్రతీసారి అసభ్యకర వ్యాఖ్యలతో తల్లిని దూషించేవాడని, దానికి ప్రత్యక్ష సాక్షురాలు తనేనని తెలిపారు. ఒక కుటుంబానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో తప్పుగా ప్రచురిస్తే ఆ కుటుంబానికి ఎంతో బాధగా ఉంటుందని వాపోయారు. ‘మీరు(మీడియాను ఉద్దేశించి) రాసే వార్తలు ఒకరి జీవితానికి సంబంధించినవని గుర్తుంచుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా పాలక్ తివారీ.. శ్వేతా తివారికి మొదటి భర్త రాజా చౌదరి ద్వారా కలిగిన సంతానం. రాజా చౌదరితో విడాకులు తీసుకున్న అనంతరం శ్వేతా తివారి 2013లో అభినవ్ కోహ్లిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఓ కుమారుడు ఉన్నాడు. -
ప్రముఖ నటి కూతురి ఫొటోలు వైరల్!
న్యూఢిల్లీ: ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో కనిపించిన యువతి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. ప్రస్తుతం ఇప్పుడు ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె మరెవరో కాదు.. బుల్లితెర ప్రముఖ నటి శ్వేతా తివారీ ముద్దుల తనయ పలక్ తివారీ. సొంతంగా కష్టపడి ఎదిగిన శ్వేతా తివారీ.. పలు హిందీ సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే గత మంగళవారం జీ గోల్డ్ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో శ్వేతా తివారీ పాల్గొనగా అందరి దృష్టిని ఓ యువతి ఆకర్షించారు. బ్లాక్ డ్రెస్సులో దర్శనమిచ్చిన ఆమె తొలుత ఎవరై ఉంటుందోనని అందరూ భావించారు. నా వెంట వచ్చి, మా దంపతులతో పాటు ఫొటోలకు ఫోజులిచ్చింది నా కన్నకూతురు పలక్ తివారీ అంటూ శ్వేత పరిచయం చేశారు. కూతురు అందానికి ఆ ఈవెంట్లో మార్కులు పడటంతో ఆమె హ్యాపీగా ఉన్నారు. పలక్ మంచి నటిగా పేరు తెచ్చుకుంటుందని శ్వేతా ధీమాగా ఉన్నారు. మరికొందరు నటీమణులతో కలిసి వర్ధమాన తార పలక్ రెడ్ కార్పెట్ షేర్ చేసుకున్నారు. ఈవెంట్లో పలక్ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పలక్కు సినిమా అవకాశాలు క్యూ కడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్-4లో విజేతగా నిలిచిన శ్వేతా తివారీ.. తన కూతురును వెండితెరకు పరిచయం చేసేందుకు యత్నిస్తున్నారు. మరో తారే జమీన్ పర్ ఫేమ్ దర్శీల్ సఫారీకి జోడీగా జతకట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. శ్వేతా తివారీ, ఆమె మొదటి భర్త రాజా చౌదరీల కూతురు పలక్. కాగా, రాజా చౌదరీతో విడాకులు తీసుకున్న అనంతరం నటుడు అభినవ్ కోహ్లీని శ్వేతా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
మరో స్టార్ వారసురాలు రెడీ అవుతోంది!
భారతదేశంలో స్టార్ వారసులకు కొదవ లేదు. ఇటు టాలీవుడ్లో, అటు బాలీవుడ్లో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున స్టార్ వారసులు వెండితెరకు పరిచయమై.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇదే కోవలోకి చేరేందుకు మరో స్టార్ వారసురాలు సిద్ధమవుతోంది. ప్రముఖ టీవీ నటి శ్వేత తివారీ కూతురు పాలక్ తివారీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పాలక్ తివారీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. మూగ్ధమోహనమైన రూపం.. కూల్ అటిట్యూడ్ తో ఉన్న పాలక్ పలు ఈవెంట్లకు తల్లి వెంట వెళ్లి మీడియా దృష్టిలో పడింది. తర్వలో ఆమె బాలీవుడ్‌కు పరిచయమయ్యే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె ఫొటోలు ఇవి..