బాలీవుడ్ టెలివిజన్ స్టార్ శ్వేత తివారి ముద్దుల తనయ ఫలక్ తివారి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ తన కొత్త సినిమా కబుర్లతో పాటు, మూవీస్ ఎంపిక విషయంలో తన తల్లి ప్రమేయం ఎంతో వివరించింది.
తాజాగా ఫలక్ ఓ వెబ్‌సైట్‌కి ఇంటర్వూలో.. "మీరు ఇంటిమేట్ సీన్స్‌లో నటిస్తే శ్వేత తివారి ఎలా ఫీల్ అవుతారు. ఆమె మీ సినిమాల ఎంపికలో జోక్యం చేసుకుంటారా? అనే ప్రశ్నకు సమాధానం చెబుతూ.. మా అమ్మ ప్రతిసారి నీ కెరీర్ సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు నువ్వే తీసుకోవాలని చెబుతూ ఉంటుంది. అందుకే ఆమె అలాంటి విషయాల్లో అసలు జోక్యం చేసుకోదు. కానీ ఏదైనా విషయమై సలహా కోసం వెళితే మాత్రం తన వరకూ ఏది మంచిదో వివరిస్తుంది" అంటూ బదులిచ్చింది. కాగా, ఈ బ్యూటీ రోసీ: ది సప్రోన్ ఛాఫ్టర్ అనే హార్రర్ చిత్రంలో నటిస్తుంది. ఇక ఆమె తల్లి శ్వేత తివారి ప్రస్తుతం ఖాత్రోంకె ఖిలాడీ 11 సీజన్‌లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment