లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఉంటూ బోరింగ్‌గా ఫీల్ అవుతున్న వారి కోసం సోషల్ మీడియా వేదికగా అనేక కొత్త ఛాలెంజ్‌లు రూపొందుతున్నాయి. ఇటీవల ‘హిట్ మీ ఛాలెంజ్’ అనే ఛాలెంజ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. కొంతమంది కలిసి ఒకరినొకరు కొట్టుకున్నట్లు నటించడమే ఈ ఛాలెంజ్ ప్రత్యేకత. ప్రస్తుతం ఈ సవాల్‌ను బాలీవుడ్ బుల్లితెర నటులు స్వీకరించారు. టెలివిజన్ స్టార్స్ శ్వేతా తివారీ, కరణ్ వీర్, వికాస్ కలంత్రి, షరద్ మల్హోత్రా, డెబినా బోనెన్నర్జీతో సహా పలువురు నటులు కలిసి హిట్ మీ ఛాలెంజ్ వీడియో రూపొందించారు. ఈ వీడియోలో ముందుగా శ్వేతా.. ఒకరిని కొట్టడంతో మొదలవ్వగా, అలా ఒకరినొకరు కొట్టుకుంటూ పోతారు. ఎవరి చేతికి దొరికిన వస్తువులను వాళ్లు ఉపయోగిస్తూ ఎదుటి వారిపై దాడికి యత్నిస్తారు. (నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్ )
ఈ క్రమంలో టీవీ రిమోట్, చీపురు, క్రికెట్ బ్యాట్, యాపిల్ ఇలా ఒక్కొ వస్తువును ఆయుధంగా ఉపయోగిస్తూ చివరికి డోనాల్ బిష్ట్.. క్రిప్ కపూర్ కంటిపై ఎటాక్ చేస్తుంది. అయితే తిరిగి ఆమెను ఎదుర్కొలేని అతను తన గిలార్ ట్యూన్ ప్లే చేస్తూ ఈ పోరాటానికి ముగింపు పలికాడు. అయితే ప్రతి ఒక్కరు తమ ఇంట్లోనే ఉంటూ ఈ వీడియోను రూపొందించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోను శ్వేతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘ఇది చాలా సరదాగా ఉంది. ఈ ఛాలెంజ్ గురించి నాకు ఎవరో చెప్పినప్పుడు నేను దీన్ని చేయాలని అనుకున్నాను’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరలవ్వడంతో టీవీ నటుల తీరుపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనన లభిస్తోంది. ‘ఫన్నీగా ఉంది. కానీ ఇలా కొట్టుకోవడం ఎందుకు ఏదైనా నిర్మాణాత్మకంగా చేయండి’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ‘ఇది మాకు నచ్చలేదు. మీరు గృహహింసను ప్రోత్సహిస్తున్నారు’ అంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. (బాహుబలి-2 నా జీవితాన్ని మార్చిన సినిమా)
Comments
Please login to add a commentAdd a comment