రెండు పెళ్లిళ్లు చేసుకుని తప్పు చేశా: నటి | Shweta Tiwari Opens Up On Her Abusive Marriages Impact On Her Children | Sakshi
Sakshi News home page

నా మొదటి భర్త నన్ను కొట్టడం నా కూతురు చూసింది: నటి

Published Tue, Mar 30 2021 8:52 PM | Last Updated on Tue, Mar 30 2021 9:00 PM

Shweta Tiwari Opens Up On Her Abusive Marriages Impact On Her Children - Sakshi

నటీనటుల జీవితాలు తెరపై కనిపించినంత అందంగా ఉండవు.  స్రీన్‌పై రంగుల మయంగా కనిపించే వారు వ్యక్తిగతంగా ఎన్నో చికటి రోజులను గడుపుతారు. అలాగే టీవీ నటి శ్వేతా తివారి జీవితం కూడా. శ్వేతా రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పెళ్లిళ్లు కూడా విడాకులకు దారి తీయడంతో తన ఇద్దరు పిల్లలని ఒంటరిగా పోషించుకుంటోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. తన విడాకులు పిల్లలపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో వివరించారు. ‘నేను జీవితంలో రెండు సార్లు మోసం పోయాను. ఆ ప్రభావం నాకంటే ఎక్కువగా పిల్లలపై పడింది. నేను చేసిన పెద్ద తప్పు నా జీవితంలోకి ఇద్దరు తప్పుడు పురుషులను ఆహ్వానించడం. దాని ఫలితం ఇప్పుడు నా ఇద్దరూ పిల్లలు అనుభవిస్తున్నారు.

వారికి ఈ విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పుడు గందరగోళంగా కనిపిస్తారు. అంతేగాక బాధను బయటకు కనిపించకుండా దాచుకోవడం అలవాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారు సంతోషంగా ఎలా నవ్వుతున్నారో అర్థం కావడం లేదు. అందుకే కొన్ని సార్లు వారిద్దరిని మానసిక నిపుణుడి దగ్గరికి తీసుకువెళ్లి వారి మనసులో ఎముందో తెలుసుకోవాలను ప్రయత్నిస్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన మొదటి భర్త రాజా చౌదరి తనని మానసికంగా, భౌతికంగా హంసించేవాడని, అందుకే అతడిపై గృహహింస కేసు పెట్టానని చెప్పింది. ‘పాలక్(మొదటి భర్త కూతురు)‌ 6 సంవత్సరాల నుంచి నా భర్త రాజా చౌదరి నన్ను కొట్టడం, తిట్టడం చూసింది.  తనకు చిన్నప్పటిక నుంచే పోలీసులు, లాయర్లు కేసులు తెలుసు.

వారు రోజు ఇంటికి వచ్చి విచారించడం అవన్ని తన చిన్న వయసులోనే చూసింది. అందుకే నేను రాజాతో విడిపోవాలని నిర్ణయించుకున్న’ అని అన్నారు. ఇక శ్వేతా 2013లో అభినవ్‌ కోహ్లీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి రియాన్ష్‌ అనే కుమారుడు జన్మించాడు. ఇక రియాన్ష్(కుమారుడు)‌ గురించి చెబుతూ అతడికి ప్రస్తుతం 4 ఏళ్లు. ఈ వయసులోనే అతడు కూడా కోర్టు, పోలీసులు అంటే తెలుసు. ఇదంతా నావల్లే. నేను తప్పుడు వ్యక్తులను ఎంచుకోవడం వల్లే ఇలా జరిగింది. ఇందులో పూర్తిగా నా పొరపాటే ఉంది. వారిది కాదు. కానీ వారు ఎప్పుడు నాతో హ్యాపీ ఉంటారు. నన్ను నిందించరు’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా పాలక్‌ శ్వేతా మొదట్టి భర్త రాజా చౌదరిల కూతురు, రియాన్ష్‌ రెండవ భర్త అభినవ్‌ కోహ్లిల కుమారుడు. 

చదవండి: ఏడాది కూడా ఆగలేకపోయావా అంకితా!
అందుకే అవార్డు ఫంక్షన్‌కు నాన్న దుస్తుల్లో వెళ్లా: బాబిల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement