టీవీ నటి, హిందీ బిగ్‌బాస్ నాల్గవ సీజన్ విజేత శ్వేతా తివారీ కరోనా బారిన పడినట్లు వార్తలు ఊపందుకున్నాయి. దీంతో ఇదెంత వరకు నిజమని అభిమానులు గందరగోళంలో పడ్డారు. వారందరికీ శ్వేతా తివారీ క్లారిటీ ఇచ్చేశారు. అవును, నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అని వెల్లడించారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. "సెప్టెంబర్ 16 నుంచి దగ్గడం ప్రారంభమైంది. ఎందుకైనా మంచిదని పరీక్ష చేయించుకుంటే ఆ తర్వాతి రోజే పాజిటివ్ అని తేలింది. దీంతో నా ఇంట్లోని గదిలోనే క్వారంటైన్‌లో ఉంటున్నాను. నా కూతురు పాలక్ కూడా భౌతిక దూరాన్ని స్ట్రిక్ట్‌గా పాటిస్తోంది. కొడుకు రేయాన్ష్‌ను నా తండ్రి అభినవ్ శుక్లా దగ్గరకు పంపించాను." (టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు)
"కరోనాతో ఫైట్ చేసేందుకు ప్రతిరోజూ వేడినీళ్లను గుటగుటా తాగేస్తున్నాను. ఇంకా నా క్వారంటైన్ గడువు అక్టోబర్ 1 వరకు ఉంది. సెప్టెంబర్ 27న మళ్లీ ఓసారి టెస్ట్ చేయించుకుంటాను. కానీ నిజంగానే ఇది కష్ట సమయం. నాకే కాదు. అక్కడ షూటింగ్స్‌కు కూడా ఇబ్బందే. ఈ వైరస్ విలయతాండవం నుంచి ఇంకా ఎప్పుడు బయటపడతామో" అని చెప్పుకొచ్చారు. కాగా శ్వేతా తివారీకి కసౌటీ జిందగీ కే(జీవితం పెట్టే పరీక్షలు) సీరియల్ మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్న ఆమె ప్రస్తుతం మేరే డాడ్ కీ దుల్హాన్‌లో నటిస్తున్నారు. అయితే ఆమెకు కరోనా సోకిన కారణంగా కొంతకాలం వరకు ఆమె లేని ఎపిసోడ్‌లను మాత్రమే చూడగలం. (భర్తపై ప్రముఖ నటి ఫిర్యాదు, అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment