
హేమ కమిటీ నివేదిక బహిర్గతం అయ్యాక ఒక్కొక్కరూ స్పందిస్తున్నారు. పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన నటీమణులు తాము ఎదుర్కొన్న చేదు సంఘటనలను బయటకు చెబుతున్నారు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న క్యాస్టింగ్ కౌచ్ అన్ని చోట్లా ఉందంటూ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరో బుల్లితెర నటి తనకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనను తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది.
తన కెరీర్ తొలినాళ్లలో ఓ హిందీ చిత్ర నిర్మాత వేధింపులకు గురి చేశాడని బుల్లితెర నటి శిల్పా షిండే ఆరోపించింది. ఆడిషన్ సమయంలో తనపై బలవంతం చేశాడని ఆమె పంచుకుంది. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చేదు సంఘటనను పంచుకుంది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. మహిళలపై లైంగిక వేధింపులు అన్ని రంగాల్లో జరుగుతున్నాయని నటి శిల్పా షిండే అన్నారు.
శిల్పా షిండే మాట్లాడుతూ..' నేను 1998-99లో రోజుల్లో ఇండస్ట్రీలో కష్టపడుతున్నా. ఇప్పుడు నేను వారి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ఈ దుస్తులు ధరించండి. మీరు ఒక సీన్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. కానీ నేను అతను ఇచ్చిన దుస్తులు ధరించలేదు. అంతేకాదు.. ఆ సీన్‌లో అతనే నా బాస్ అని చెప్పాడు. అప్పుడే చాలా అమాయకురాలిని.. అందుకే ఆ సీన్‌కు ఒప్పుకున్నా. కానీ ఆ వ్యక్తి నా మీదికి వచ్చే ప్రయత్నం చేశాడు. దీంతో నేను భయంతో అతన్ని పక్కకు తోసి బయటకు పరుగెత్తా. అక్కడే ఉన్న సెక్యూరిటీ స్టాఫ్ అంతా నన్ను చూశారు. వెంటనే అక్కడి నుంచి వెళ్లమన్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా.. భాబీజీ ఘర్ పర్ హైన్ అనే సిట్‌కామ్‌తో శిల్పా షిండే ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఖత్రోన్ కీ కిలాడీ రియాలిటీ షో సీజన్-14లో పాల్గొంటొంది.
Comments
Please login to add a commentAdd a comment