
ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు. ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి పాటకు ఇన్నేళ్ల తరువాత ఓ రిమిక్స్ వర్సణ్ వచ్చింది. అయితే రిమిక్స్ సినిమా కోసం చేసింది కాదు ఓ వీడియో ఆల్బమ్‌కోసం ఆ పాటను రిమిక్స్ చేశారు.
పాటలోని ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి మెయిన్ లైన్స్ మాత్రమే తీసుకొని మిగతా అంతా కొత్త లిరిక్స్ తో ఈ పాటను రూపొదించారు. సెన్సేషనల్ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్ స్వయంగా ఈ పాటను కంపోజ్ చేసి ఆలపించారు. ఈ ఆల్బమ్‌లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో జంటగా నటిస్తున్న షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment