టేక్‌ ఇట్‌ ఈజీ | Shahid Kapoor And Kiara Advani Recreate Prabhudheva's Song Urvashi | Sakshi
Sakshi News home page

టేక్‌ ఇట్‌ ఈజీ

Published Sat, Sep 29 2018 3:43 AM | Last Updated on Sat, Sep 29 2018 3:43 AM

Shahid Kapoor And Kiara Advani Recreate Prabhudheva's Song Urvashi - Sakshi

కియారా అద్వానీ

‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఊర్వశి ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’ పాట ఎంత పాపులరో తెలిసిందే. ప్రభుదేవా, నగ్మా జంటగా శంకర్‌ దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ  చిత్రంలోని ఆ పాట కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ పాటలో ప్రభుదేవా వేసిన నృత్యాలను అంత సులభంగా మరచిపోలేరు ప్రేక్షకులు. ఎంతో క్రేజ్‌ ఉన్న ఈ పాటను తాజాగా హిందీలో షాహిద్‌ కపూర్, కియారా అద్వానీలపై రీమిక్స్‌ చేశారు. డైరెక్టర్‌ గిఫ్టీ ఈ పాటకు దర్శకత్వం వహించగా, నిర్మాత భూషణ్‌ కుమార్‌ నిర్మించారు.

ప్రముఖ గాయకుడు యోయో హనీ సింగ్‌ ఈ పాటను కంపోజ్‌ చేసి, పాడటం విశేషం. అయితే పాటలోని లిరిక్స్‌ని మార్చి కేవలం ‘ఊర్వశి ఊర్వశి టేక్‌ ఇట్‌ ఈజీ ఊర్వశి’ని మాత్రమే తీసుకున్నారు. నైట్‌ క్లబ్‌లో చిత్రీకరించిన ఈ పాటలో షాహిద్‌ కపూర్‌ తన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఈ పాటలో మరింత అందంగా కనిపించారు. ప్రస్తుతం షాహిద్, కియారా తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాటను ఆ సినిమా కోసం రీమిక్స్‌ చేయలేదట. ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసమట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement