Song Remix
-
కేజీఎఫ్ 2లో ఆ వింటేజ్ సాంగ్ రీమిక్స్.. హీరోయిన్ ?
KGF 2 Movie Team Remixed A Super Hit Song With Yash: కేజీఎఫ్ సినిమా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరలం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. రికార్డులను తిరగరాసిన సినిమా అది. ఈ ఒక్క సినిమాతో కన్నడ హీరో యశ్.. పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి తగినట్లుగా ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఉన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ చక్కర్లు కొడుతుంది. సినిమా మొదటి భాగం హిందీ వెర్షన్లో 'త్రిదేవ్' చిత్రంలోని జాకీ ష్రాఫ్, సోనమ్ నర్తించిన 'గలీ గలీ మే' పాటను రీమిక్స్ చేశారు మేకర్స్. ఈ సాంగ్‌లో బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్ నర్తించి ఆకట్టకుంది. తెలుగులో మాత్రం 'దోచెయ్' అంటూ తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాగే ఇప్పుడు కేజీఎఫ్ 2 చిత్రానికి ఒక వింటేజ్ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేశారని సమాచారం. అదేంటంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని 'మెహబూబా.. మెహబూబా' సాంగ్. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా హైదరాబాద్‌లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఒక ఊపు ఊపిన ఈ పాటను కేజీఎఫ్ 2 సినిమాలో యశ్ చేత రీమిక్స్ చేయించాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ పాటలో ఆడిపాడిన బ్యూటీ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సాంగ్ కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితమా.. లేక అన్ని భాషల్లో ఉంటుందా అని చూడాలి. ఇదీ చదవండి: ఈ ఏడాది 'ఊ'పేసిన ఐటమ్ సాంగ్‌లు ఇవే.. -
టేక్ ఇట్ ఈజీ
‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ పాట ఎంత పాపులరో తెలిసిందే. ప్రభుదేవా, నగ్మా జంటగా శంకర్ దర్శకత్వంలో 1994లో వచ్చిన ఈ చిత్రంలోని ఆ పాట కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ పాటలో ప్రభుదేవా వేసిన నృత్యాలను అంత సులభంగా మరచిపోలేరు ప్రేక్షకులు. ఎంతో క్రేజ్ ఉన్న ఈ పాటను తాజాగా హిందీలో షాహిద్ కపూర్, కియారా అద్వానీలపై రీమిక్స్ చేశారు. డైరెక్టర్ గిఫ్టీ ఈ పాటకు దర్శకత్వం వహించగా, నిర్మాత భూషణ్ కుమార్ నిర్మించారు. ప్రముఖ గాయకుడు యోయో హనీ సింగ్ ఈ పాటను కంపోజ్ చేసి, పాడటం విశేషం. అయితే పాటలోని లిరిక్స్‌ని మార్చి కేవలం ‘ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి’ని మాత్రమే తీసుకున్నారు. నైట్ క్లబ్లో చిత్రీకరించిన ఈ పాటలో షాహిద్ కపూర్ తన నృత్యాలతో ఆకట్టుకున్నారు. ‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ పాటలో మరింత అందంగా కనిపించారు. ప్రస్తుతం షాహిద్, కియారా తెలుగులో ఘన విజయం సాధించిన ‘అర్జున్‌రెడ్డి’ సినిమా హిందీ రీమేక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పాటను ఆ సినిమా కోసం రీమిక్స్ చేయలేదట. ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసమట. -
నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు
ఈలలు.. కేకలు.. చప్పట్లతో థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే. ఎందుకంటే... ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణల ఊర మాస్ సాంగ్ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు.. నేను రోమియోగ మారినది లగాయితు....’ రీమిక్స్‌లో నాగచైతన్య, నిధి అగర్వాల్ చిందేయనున్నారు. అవును.. ‘సవ్యసాచి’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. తొంభై శాతం చిత్రీకరణ పూరై్తంది. ఒక సాంగ్‌తో పాటు మూడు సీన్లను చిత్రీకరించేందుకు చిత్రబృందం యూఎస్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. మే 3 నుంచి 15వరకు ఈ షెడ్యూల్ సాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’ సాంగ్ రీమిక్స్‌ని చిత్రీకరించనున్నారు. అప్పుడు ‘అల్లరి అల్లుడు’కి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘సవ్యసాచి’కి మణిశర్మ స్వరకర్త. ఈ రీమిక్స్ సాంగ్ మణిశర్మ స్టైల్లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో నాగ్–రమ్యల స్టెప్స్ అదుర్స్. ఇప్పుడు చైతూ–నిధి కూడా అదిరిపోయేలా స్టెప్స్ వేస్తారని ఊహించవచ్చు. -
మరో సాంగ్ రీమిక్స్ చేయనున్న మెగా హీరో
సంగీత ప్రియులను అలరించే పాత పాటలను రీమిక్స్ చేయడం టాలీవుడ్లో కొత్తేం కాదు. సమయానుకూలంగా చాలా మంది హీరోలు పాత సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో కొన్నింటిని సందర్భానుసారం వాడుకుంటుంటే, మరికొంత మంది సెంటిమెంట్ కోసం రీమిక్స్ చేస్తారు. మెగా మేనళ్లుడు సైతం ఇప్పటికే రెండు సూపర్‌డూపర్ హిట్ పాటలను తన సినిమాల్లో వాడేశాడు. వరుసగా రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో సాయి ధరమ్ తేజ్ మళ్లీ రీమిక్స్ మార్గం ఎంచుకున్నాడు. మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో మామయ్య మెగాస్టార్ పాటలను తిరిగి రీమిక్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు సాయి. ఇందుకోసం కొండవీటి దొంగ సినిమాలోని ఛమకు ఛమకు ఛామ్ అనే పాటను రీమిక్స్ చేయాలనీ డిసైడ్ అయ్యాడు. మరి మామయ్య సాంగ్ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో చూడాలి. -
ఎన్టీఆర్ రభస మూవీ స్టిల్స్
-
అత్తమడుగు వాగులోనా.. అత్త కొడుకో...
మహానటుడు ఎన్టీఆర్ సాధించిన ఘనవిజయాలలో ‘కొండవీటి సింహం’ సినిమా ఒకటి. అందులో ఎన్టీఆర్, శ్రీదేవిపై చిత్రీకరించిన ‘అత్తమడుగు వాగులోనా... అత్త కొడుకో...’ పాట అప్పట్లో మాస్‌ని ఉర్రూతలూగించింది. ఇప్పుడా పాటని రీమిక్స్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలో ఈ పాట పెట్టాలని ఎన్టీఆర్ అనుకుంటున్నారట. ఈ రీమిక్స్‌ని ఎన్టీఆర్, అక్షపై ప్రత్యేక గీతంగా చిత్రీకరించే అవకాశం ఉందనేది యూనిట్ వర్గాల సమాచారం. ఇలా తాతయ్య ఎన్టీఆర్ పాటలను రీమిక్స్ చేసి ఉపయోగించుకోవడం ఎన్టీఆర్‌కి కొత్త కాదు. ఇంతకు ముందు ‘వేటగాడు’లోని ‘ఆకు చాటు పిందె తడిసె’ పాటను ‘అల్లరి రాముడు’లోనూ, ‘యమగోల’లోని ‘ఓలమ్మీ తిక్కరేగిందా’ పాటను ‘యమదొంగ’లోనూ రీమిక్స్ చేశారు. ‘రభస’గా ప్రచారం జరుగుతున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ నెల మూడోవారం నుంచి హైదరాబాద్‌లో కీలకమైన షెడ్యూలు జరుగనుంది. అతి ముఖ్య సన్నివేశాలను ఈ షెడ్యూలులో చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత జైపూర్‌లో మరో షెడ్యూలు జరగనుంది. ఇందులో సమంత, ప్రణీత నాయికలు. -
అటు అమలాపురం...ఇటు పెద్దాపురం
‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం.. మధ్య గోదావరీ..’ ఈ పాట వినగానే.. ‘ఖైదీ నంబర్ 786’ సినిమా కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. చిరంజీవి కథానాయకునిగా 1988లో విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌గా ఓ సెన్సేషన్. సిల్క్‌స్మిత, కోట శ్రీనివాసరావులపై దర్శకుడు విజయబాపినీడు ఈ పాట తీశారు. ఆ రోజుల్లో మాస్‌ని విపరీతంగా ఆకట్టుకుందీ పాట. ప్రస్తుతం రీమిక్స్‌ల కాలం నడుస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన పాత పాటల్ని రీమిక్స్ చేసేసి తేలిగ్గా సక్సెస్ కొట్టేస్తున్నారు దర్శక, నిర్మాతలు. ఈ పదిహేనేళ్లలో దాదాపు ఓ పాతిక పాత పాటలైనా రీమిక్స్ అయి వుంటాయి. ‘అటు అమలాపురం..’ పాట మాత్రం వారెవరికీ గుర్తు రాకపోవడం నిజంగా విచిత్రమే. ఆ అవకాశాన్ని మారుతి అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన అల్లు శిరీష్ హీరోగా ‘కొత్తజంట’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకోసం ‘అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం’ పాటను రీమిక్స్ చేయనున్నారు మారుతి. పాతికేళ్ల క్రితం సిల్క్‌స్మిత అదరహో అనిపించిన ఈ పాటలో ఇప్పుడు మధురిమ నర్తించబోతున్నారు. మధురిమకు ఈ పాట ఓ ఛాలెంజే అని చెప్పాలి. కృష్ణ ‘పండంటికాపురం’లోని ‘వెన్నెలైనా..చీకటైనా..’ పాటను చాలా అందంగా, అభినందనీయంగా రీమిక్స్ చేయించారు మారుతి. ‘ప్రేమకథా చిత్రమ్’ చిత్రానికి ఆ పాట నిజంగా ఓ ఆభరణమే. మరి ‘కొత్తజంట’లో ఆయన రీమిక్స్ చేయనున్న ఈ పాట మరి ఆ స్థాయి అభినందనల్ని అందుకుంటుందో లేదో, చూడాలి. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.