నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు | Chaitu to Remix Nag super hit song | Sakshi
Sakshi News home page

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు

Published Thu, Apr 12 2018 12:07 AM | Last Updated on Thu, Apr 12 2018 12:07 AM

Chaitu to Remix Nag super hit song - Sakshi

నాగచైతన్య

ఈలలు.. కేకలు.. చప్పట్లతో థియేటర్‌ దద్దరిల్లిపోవాల్సిందే. ఎందుకంటే... ‘అల్లరి అల్లుడు’ సినిమాలో నాగార్జున, రమ్యకృష్ణల ఊర మాస్‌ సాంగ్‌ ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు.. నేను రోమియోగ మారినది లగాయితు....’ రీమిక్స్‌లో నాగచైతన్య, నిధి అగర్వాల్‌ చిందేయనున్నారు. అవును.. ‘సవ్యసాచి’ సినిమా కోసం ఈ పాటను రీమిక్స్‌ చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న సినిమా ‘సవ్యసాచి’. ఇందులో నిధి అగర్వాల్‌ కథానాయిక. తొంభై శాతం చిత్రీకరణ పూరై్తంది.

ఒక సాంగ్‌తో పాటు మూడు సీన్లను చిత్రీకరించేందుకు చిత్రబృందం యూఎస్‌ షెడ్యూల్‌ ప్లాన్‌ చేసింది. మే 3 నుంచి 15వరకు ఈ షెడ్యూల్‌ సాగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్‌లో ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయితు’ సాంగ్‌ రీమిక్స్‌ని చిత్రీకరించనున్నారు. అప్పుడు ‘అల్లరి అల్లుడు’కి ఎం.ఎం. కీరవాణి స్వరకర్త. ‘సవ్యసాచి’కి మణిశర్మ స్వరకర్త. ఈ రీమిక్స్‌ సాంగ్‌ మణిశర్మ స్టైల్‌లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో నాగ్‌–రమ్యల స్టెప్స్‌ అదుర్స్‌. ఇప్పుడు చైతూ–నిధి కూడా అదిరిపోయేలా స్టెప్స్‌ వేస్తారని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement