కేజీఎఫ్‌ 2లో ఆ వింటేజ్‌ సాంగ్‌ రీమిక్స్‌.. హీరోయిన్‌ ? | KGF 2 Movie Team Remixed A Super Hit Song With Yash | Sakshi
Sakshi News home page

KGF 2 Movie: కేజీఎఫ్‌ 2లో ఆ వింటేజ్‌ సాంగ్‌ రీమిక్స్‌.. హీరోయిన్‌ ?

Published Sun, Jan 2 2022 8:47 PM | Last Updated on Sun, Jan 2 2022 8:55 PM

KGF 2 Movie Team Remixed A Super Hit Song With Yash - Sakshi

KGF 2 Movie Team Remixed A Super Hit Song With Yash: కేజీఎఫ్‌ సినిమా గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరలం లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై.. రికార్డులను తిరగరాసిన సినిమా అది. ఈ ఒక్క సినిమాతో కన్నడ హీరో యశ్‌.. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2.  ఈ  చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. వాటికి తగినట్లుగా ఇప్పటికే  విడుదలైన టీజర్, పోస్టర్స్ ఉన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్‌ రూమర్‌ చక్కర్లు కొడుతుంది. సినిమా మొదటి భాగం హిందీ వెర్షన్‌లో 'త్రిదేవ్‌' చిత్రంలోని జాకీ ష్రాఫ్‌, సోనమ్‌ నర్తించిన 'గలీ గలీ మే' పాటను రీమిక్స్‌ చేశారు మేకర్స్‌. ఈ  సాంగ్‌లో బుల్లితెర హాట్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ నర్తించి ఆకట్టకుంది. తెలుగులో మాత్రం 'దోచెయ్‌' అంటూ తమన్నాతో ఐటమ్‌ సాంగ్‌ చేయించాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

అలాగే ఇప్పుడు కేజీఎఫ్‌ 2 చిత్రానికి ఒక వింటేజ్‌ సూపర్‌ హిట్‌ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారని సమాచారం. అదేంటంటే బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని 'మెహబూబా.. మెహబూబా' సాంగ్‌. ఈ సాంగ్‌ చిత్రీకరణ కూడా హైదరాబాద్‌లో జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో ఒక ఊపు ఊపిన ఈ పాటను కేజీఎఫ్‌ 2 సినిమాలో యశ్‌ చేత రీమిక్స్‌ చేయించాడట దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. అయితే ఈ పాటలో ఆడిపాడిన బ్యూటీ ఎవరూ అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా ఈ సాంగ్‌ కేవలం హిందీ వెర్షన్‌కే పరిమితమా.. లేక అన్ని భాషల్లో ఉంటుందా అని చూడాలి. 



ఇదీ చదవండి: ఈ ఏడాది 'ఊ'పేసిన ఐటమ్‌ సాంగ్‌లు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement