అర్జున్‌ రెడ్డి ఈజ్‌ కబీర్‌ సింగ్‌ | Shahid Kapoor reveals title of Arjun Reddy Hindi remake | Sakshi
Sakshi News home page

అర్జున్‌ రెడ్డి ఈజ్‌ కబీర్‌ సింగ్‌

Published Sat, Oct 27 2018 2:22 AM | Last Updated on Sat, Oct 27 2018 2:22 AM

Shahid Kapoor reveals title of Arjun Reddy Hindi remake - Sakshi

షాహిద్‌ కపూర్

‘అర్జున్‌ రెడ్డి’ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్‌లో రీమేక్‌ అవుతోంది. షాహిద్‌ కపూర్, కియారా అద్వానీ జంటగా తెలుగు వెర్షన్‌ని డైరెక్ట్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగా ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘కబీర్‌ సింగ్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. బిగించి ఉన్న పిడికిలిని లవ్‌ సింబల్‌గా చేసి ఉన్న గుర్తుతో ఉన్న టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. వచ్చే ఏడాది జూన్‌ 21న విడుదల కానున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. ‘‘అర్జున్‌రెడ్డి’ ని ప్రేమించారు, అభినందించారు. ఇప్పుడు ‘కబీర్‌ సింగ్‌’ వంతు వచ్చింది. వేచి చూడండి’’ అని షాహిద్‌ కపూర్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement