Shahid Kapoor Confirms Kiara Advani and Sidharth Malhotra Marriage, Deets Inside - Sakshi
Sakshi News home page

Kiara-Sidharth Malhotra Marriage: ఈ ఏడాదే పెళ్లి పీటలు ఎక్కబోతున్న కియారా-సిద్ధార్థ్‌, స్టార్‌ హీరో క్లారిటీ

Published Tue, Aug 23 2022 5:24 PM | Last Updated on Tue, Aug 23 2022 6:17 PM

Shahid Kapoor Confirms Kiara Advani and Sidharth Malhotra Marriage - Sakshi

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ కియారా అద్వానీ-సిద్దార్థ్‌ మల్హోత్రాలు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో వార్తలు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి రిలేషన్‌పై ఈ జంట ఎప్పుడూ స్పందించలేదు. తమ ప్రేమను గొప్యంగా ఉంచుతూ వస్తున్నారు. కానీ వీళ్లిద్దరూ కలిసి హాలీడే వెకేషన్స్‌కి వెళ్లడం, ముంబై రోడ్లపై చెట్టాపట్టాలేసుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కుతుండటంతో వీరద్దరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ నడుస్తోందని అంతా ఫిక్స్‌ అయ్యారు. ఈ క్రమంలో దర్శక-నిర్మాత కరణ్‌ జోహార్‌ టాక్ షో కాఫీ విత్‌ కరణ్‌ తమ ప్రేమ గురించి చెప్పకనే చెప్పింది ఈ జంట. ఇటీవల షోకు వచ్చిన సిద్ధార్థ్‌ మల్హోత్రా కియారాతో డేటింగ్‌పై పరోక్షంగా క్లారిటీ ఇచ్చాడు.

చదవండి: అప్పట్లోనే బిగ్‌బి కంటే అధిక పారితోషికం అందుకున్న చిరు, వైరల్‌గా కవర్‌ ఫొటో

కెరీర్‌ ప్లాన్‌ ఏంటని సిద్ధార్థ్‌ను కరణ్‌ ప్రశ్నించగా.. తాను సంతోషకరమైన, ప్రకాశవంతమైన జీవితాన్ని కోరుకుంటున్నానని చెప్పాడు సిద్ధార్థ్‌. ఆ వెంటనే కియారాతోనా? అని కరణ్‌ అనడంతో.. ఆమె అయితే ఇంకా బాగుంటుందంటూ తమ ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పాడు సిద్ధార్థ్‌. తాజాగా హీరో షాహిద్‌ కపూర్‌తో కలిసి కియారా ఈ షోలో సందడి చేసింది. ఈ సందర్భంగా తనకు పరిశ్రమలో అంత్యంత క్లోజ్‌ ఎవరని అడగ్గా షాహిద్‌ పేరు చెప్పింది కియారా. అనంతరం సిద్ధార్థ్‌తో ఉన్న బంధం ఏంటని అడగ్గా. అతడు ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అంటూ ముసిముసిగా నవ్వింది ఆమె.

చదవండి: హీరోగా పరిచయమవుతున్న కమెడియన్‌ గౌతమ్‌ రాజు కుమారుడు

ఇంతలో షాహిద్‌ కల్పించుకుని ‘ఈ ఏడాది చివర్లో ఎప్పుడైన బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ రావోచ్చు సిద్ధంగా ఉండండి. కానీ అది సినిమాకు సంబంధించినది మాత్రం కాకపోవచ్చు!’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో సిద్ధార్థ్‌, కియారాలు త్వరలోనే గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారని, ఈ ఏడాది చివర్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ బాలీవుడ్‌ మీడియాల్లో కథనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎట్టకేలక తమ లవ్వీ లవ్‌బర్డ్స్‌ పెళ్లి ఒక్కటికాబోతున్నారా? వీరిద్దరు క్యూట్‌ కపుల్‌, ఎట్టకేలకు కియార-సిద్ధార్థ్‌ బిగ్‌ అనౌన్స్‌మెంట్‌ ఇవ్వబోతున్నారన్నమాట’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా కియారా, సిద్ధార్థ్‌లు ‘షేర్షా’ చిత్రంలో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్ల తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement