కియారా- సిద్ధార్థ్ పెళ్లి.. బిగ్ న్యూస్ చెబుతానన్న నటి..! | Kiara Advani hints Big Announcement at a shares pic in a from makeup room | Sakshi
Sakshi News home page

Kiara Advani:కియారా- సిద్ధార్థ్ పెళ్లి.. త్వరలోనే బిగ్ న్యూస్..!

Mar 4 2023 12:09 AM | Updated on Mar 4 2023 3:25 AM

Kiara Advani hints Big Announcement at a shares pic in a from makeup room  - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇటీవలే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రియుడు  సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో ఘనంగా పెళ్లి జరిగింది. ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో బాయ్‌ఫ్రెండ్‌-గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న సిద్‌-కియారాలు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ముంబైలో గ్రాండ్‌ రిసెప్షన్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సరదాగా ఎంజయ్‌ చేసిన ఈ కొత్తజంట ఇప్పుడు పనిలో బిజీగా గడుపుతున్నారు. అయితే తాజాగా కియారా పోస్ట్ చేసిన ఓ మెసేజ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. పెళ్లి తర్వాత వచ్చే బిగ్ న్యూస్ ప్రెగ్నెన్సీ అయి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

కియారా తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది. మీకు త్వరలోనే బిగ్ న్యూస్ చెబుతానంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఆమె తన రూమ్‌లో కూర్చుని, ప్లేట్ నిండా మామిడికాయ ముక్కలు తింటూ ఫోటోలో కనిపించింది. అయితే కియారా అభిమానులు ఆ బిగ్ న్యూస్ ఏంటా అని ఎదురు చూస్తున్నారు.  కాగా.. ప్రస్తుతం కియారా శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఆర్సీ15 పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి కోసం సుమారు 20రోజులు బ్రేక్‌ తీసుకున్న కియారా ఇప్పుడు బ్యాక్‌ టూ వర్క్‌ అంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement