Is Dhanush Move To New House With Aishwarya And Children After Divorce Take Off - Sakshi
Sakshi News home page

Dhanush-Aishwarya Rajinikanth: విడాకులు రద్దు? కొత్త ఇంట్లోకి మారనున్న ధనుశ్‌-ఐశ్వర్యలు!

Published Tue, Oct 18 2022 1:12 PM | Last Updated on Tue, Oct 18 2022 1:48 PM

Is Danush Move to New House With Aishwarya and Children after Divorce Take Off - Sakshi

కోలీవుడ్‌ మాజీ దంపతులు ధనుశ్‌-ఐశ్వర్య రజనీకాంత్‌లు మళ్లీ కలుస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో విడిపోయామని ధనుశ్‌-ఐశ్వర్యలు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమ విడాకులను ఈ మాజీ దంపతులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సోషల్‌ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. పిల్లల కోసం వీరిద్దరు వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి: మోహన్‌ లాల్‌కు షాక్‌, అక్కడ ‘మాన్‌స్టర్‌’పై నిషేధం

అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో ధనుశ్‌ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుశ్‌కు తన పిల్లల సంతోషమే ముఖ్యమంటూ విడాకులు ఈ వార్తలపై స్పందించాడు. దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట ఫాలోవర్స్‌ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుశ్‌ ఓ కొత్త ఇంటిని కొనుగొలు చేస్తున్నాడని, విడాకులు రద్దు ప్రకటన ఆనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: ఈ వారం థియేటర్‌, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే

ధనుశ్‌ ఖరీదు చేయబోయే ఆ ఇంటి విలువ రూ. 100 కోట్లని, వచ్చే ఏడాది జనవరిలో భార్య, పిల్లలతో గృహ ప్రవేశం కూడా చేయబోతున్నాడంటూ తమిళ మీడియా, వెబ్‌సైట్లలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ వార్తలు నిజమైతే బాగుండని, మళ్లీ వారిద్దరు కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా 2004 నవంబర్‌ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ధనుశ్‌-ఐశ్వర్యలకు యాత్రా రాజా (15 ), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement