సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట | sakshi photographers have 24 awards in the national photo salon in spap | Sakshi
Sakshi News home page

సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట

Published Mon, Oct 16 2017 2:23 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

sakshi photographers have 24 awards in the national photo salon in spap - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇండియన్‌ ప్రెస్‌ ఫోటో అవార్డ్స్‌–2017 పేరిట స్టేట్‌ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ నిర్వహించిన సలోన్‌ కాంపిటీషన్‌లో సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డుల పంట పండింది. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో 24 అవార్డులు దక్కించుకున్నారు. హిందూస్థాన్‌ టైమ్స్‌ నేషనల్‌ ఫొటో ఎడిటర్‌ టి.నారాయణ్, ‘సాక్షి’ ఫొటో ఎడిటర్‌ కె.రవికాంత్‌రెడ్డి, ద హిందూ స్పెషల్‌ న్యూస్‌ ఫొటోగ్రాఫర్‌ విజయభాస్కరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నవంబర్‌ 1న ప్రపంచ ఫొటో జర్నలిజం దినోత్సవం సందర్భంగా విజయవాడలో అవార్డులను బహుకరిస్తామని చైర్మన్‌ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

స్పాట్‌ న్యూస్‌ ఫొటోల కవరేజ్‌: ఫస్ట్‌ ప్రైజ్‌–నోముల రాజేశ్‌రెడ్డి (హైదరాబాద్‌); కన్సోలేషన్‌ ప్రైజులు– మోహన్‌ కృష్ణ కేతారి (తిరుమల), కె.భజరంగ్‌ ప్రసాద్‌(నల్లగొండ), పి.మోహనాచారి (హైదరాబాద్‌), పి.సతీశ్‌కుమార్‌ (కాకినాడ)

సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌: డి.హుస్సేన్‌ (కర్నూల్‌), జి.దత్తు (హైదరాబాద్‌), రియాజుద్దీన్‌ షేక్‌ (ఏలూరు), కందుల రమేశ్‌బాబు (హైదరాబాద్‌), గుంటపల్లి స్వామి (కరీంనగర్‌)

జనరల్‌ న్యూస్‌ ఫొటో కవరేజ్‌: మూడో బహుమతి–వీర భగవాన్‌ (విజయవాడ); కన్సోలేషన్‌ ప్రైజులు– జి.వీరేశ్‌ (అనంతపూర్‌), కె.భజరంగ్‌ ప్రసాద్‌ (నల్లగొండ), ఐ.సుబ్రహ్మణ్యం (తిరుపతి)

స్పోర్ట్స్‌ న్యూస్‌ ఫొటో కవరేజ్‌: రుబిన్‌ బెసాలియల్‌ వన్జా (విజయవాడ–సర్టిఫికెట్‌ ఫర్‌ మెరిట్‌), ఎం.అనిల్‌కుమార్‌ (హైదరాబాద్‌–మారుతీరాజ్‌ మెమోరియల్‌ అవార్డు), జి.బాలస్వామి (హైదరాబాద్‌–తమ్మ సుబ్బారెడ్డి మెమోరియల్‌ అవార్డు)

స్పాప్‌ అచీవ్‌మెంట్‌ కేటగిరీ: సురేశ్‌కుమార్‌ (హైదరాబాద్‌), జి.ప్రసాద్‌ (రాజమండ్రి), పి.మనూ విశాల్‌ (విజయవాడ), అరుణ్‌రెడ్డి (ఆదిలాబాద్‌), పి.మోహన్‌రావు (విశాఖ), ప్రసాద్‌ మోరబోయిన (ఒంగోలు), వీర భగవాన్‌ (విజయవాడ) 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement