Watch Video: Pushpa Actress Rashmika Mandanna Uncomfortable In Red Hot Dress - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక.. మరోసారి టార్గెట్‌ కానుందా ?

Published Sat, Jul 16 2022 5:58 PM | Last Updated on Sat, Jul 16 2022 9:05 PM

Rashmika Mandanna Uncomfortable In Red Hot Dress - Sakshi

Rashmika Mandanna Uncomfortable In Red Hot Dress: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది ఈ నేషనల్‌ క్రష్‌. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్‌ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్‌ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉండే రష్మికకు అభిమానులు ఎక్కువే. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీగా దుస్తులు ధరిస్తూ ఔరా అనిపిస్తుంది ఈ నేషనల్‌ క్రష్‌.

అయితే ఇదివరకు పొట్టి దుస్తులు ధరించి ఇబ్బందిపడిన ఈ భామ తాజాగా మరోసారి షార్ట్ వేర్‌లో పాట్లు పడింది. శుక్రవారం (జులై 15) రాత్రి ముంబైలో జరిగిన ఓ అవార్డ్‌ ప్రోగ్రామ్‌కు హాజరైంది రష్మికా. ఈ ఫంక్షన్‌లో రష్మిక రెడ్ కలర్ షార్ట్‌ డ్రెస్‌లో సందడి చేసింది. సాధారణంగా సెలబ్రిటీలను క్లిక్‌మనిపించే ఫొటోగ్రాఫర్లు ఆ వేడుకలో రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రష్మికను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగారు. అయితే రష్మిక పైకి నవ్వుతున్నప్పటికీ.. కొంచెం ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ డ్రెస్‌ ఆమె మోకాలి పై వరకు ఉంది. దీంతో తన కాళ్లు కవర్‌ చేసుకునేందుకు రష్మికా ప్రయత్నించడం చూడొచ్చు. 

చదవండి: చోర్ బజార్‌లో రూ.100 పెట్టి జాకెట్‌ కొన్నా: స్టార్‌ హీరో
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
అన్నదమ్ములతో డేటింగ్‌ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్‌

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఇది వరకు బాలీవుడ్‌ దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్‌ షార్ట్ డ్రెస్‌ ధరించి దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్‌లో నడవడానికి ఇబ్బంది పడిన రష్మికను నెటిజన్లు ట్రోల్‌ చేశారు. తాజాగా ఈ రెడ్ షార్ట్ డ్రెస్‌తో మరోసారి రష్మిక నెటిజన్లకు టార్గెట్‌ అయ్యేలా ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement