short dress
-
మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్
Rashmika Mandanna Uncomfortable In Red Hot Dress: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రష్మికకు అభిమానులు ఎక్కువే. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీగా దుస్తులు ధరిస్తూ ఔరా అనిపిస్తుంది ఈ నేషనల్ క్రష్. అయితే ఇదివరకు పొట్టి దుస్తులు ధరించి ఇబ్బందిపడిన ఈ భామ తాజాగా మరోసారి షార్ట్ వేర్లో పాట్లు పడింది. శుక్రవారం (జులై 15) రాత్రి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రోగ్రామ్‌కు హాజరైంది రష్మికా. ఈ ఫంక్షన్లో రష్మిక రెడ్ కలర్ షార్ట్ డ్రెస్‌లో సందడి చేసింది. సాధారణంగా సెలబ్రిటీలను క్లిక్‌మనిపించే ఫొటోగ్రాఫర్లు ఆ వేడుకలో రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రష్మికను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగారు. అయితే రష్మిక పైకి నవ్వుతున్నప్పటికీ.. కొంచెం ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ డ్రెస్ ఆమె మోకాలి పై వరకు ఉంది. దీంతో తన కాళ్లు కవర్ చేసుకునేందుకు రష్మికా ప్రయత్నించడం చూడొచ్చు. చదవండి: చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Filmi United (@filmi_united) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇది వరకు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్ షార్ట్ డ్రెస్ ధరించి దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్‌లో నడవడానికి ఇబ్బంది పడిన రష్మికను నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా ఈ రెడ్ షార్ట్ డ్రెస్‌తో మరోసారి రష్మిక నెటిజన్లకు టార్గెట్ అయ్యేలా ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by rasmika 😎😋🌹 (@jaydeep_.creation) -
విద్యార్థినికి ఘోర అవమానం.. పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా?
డిస్పూర్: ఉద్యోగ, ప్రవేశ ఏవైనా పరీక్షలకు అడ్డమైన నిబంధనలు విధిస్తున్నారు. రోజుకు పరీక్ష నిర్వాహకులు దారుణమైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో పరీక్ష రాసేందుకు వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, బాలికలకు అయితే తలలో పిన్ను, బొట్టు మొదలుకుని కాలి మెట్టెల వరకు.. అబ్బాయిలకైతే బెల్ట్, షూస్, ఫుల్ షర్ట్స్ వేసుకోరాదు వంటి వాటితోపాటు చివరకు జీన్స్ ప్యాంట్లకు ఉండే బటన్లు కూడా ఉండొద్దనే నిర్ణయాలు పరీక్షలకు వచ్చేవారికి తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి విధానంతోనే ఓ విద్యార్థి ఘోర అవమానం ఎదుర్కొంది. చదవండి: నిర్మల్ సభలో ‘ఈటల’ స్పెషల్ అట్రాక్షన్: చప్పట్లు మోగించిన అమిత్ షా అసోంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరీక్షలు మొదలయ్యాయి. సోనిత్పూర్ జిల్లా తేజ్‌పూర్‌లో ఉన్న గిరిజానంద చౌదరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (జీసీఐఎంటీ)లో జరిగిన పరీక్ష రాసేందుకు విద్యార్థిని జూబ్లీ తములి (19) వచ్చింది. తనిఖీలు చేసిన అనంతరం ఆమెను లోపలికి అనుమతిచ్చారు. అయితే పరీక్ష హాల్లోకి వెళ్తుండగా పర్యవేక్షకులు తములిని ఆపివేశారు. పరీక్షకు అందరినీ పంపించినా తనను ఆపడంపై తములి ప్రశ్నించింది. నువ్వు షార్ట్ వేసుకురావడంతో పరీక్షకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో ఆ అమ్మాయి షాక్‌కు గురయ్యింది. వస్త్రధారణ గురించి ఎక్కడా పేర్కొనలేదు.. పాలన డ్రెస్ వేసుకురావాలని ఎవరూ చెప్పలేదని తములి తెలిపింది. అడ్మిట్, ఆధార్ కార్డు తదితర అన్నీ ఉన్నా కేవలం వస్త్రధారణ సరిగ్గా లేదని అనుమతించకపోవడంపై విద్యార్థిని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో ఆమె తన తండ్రికి సమాచారం అందించింది. కంగారుపడుతూ తండ్రి ఒక డ్రెస్ తీసుకువచ్చేందుకు మార్కెట్‌కు పరుగెత్తాడు. పరీక్షకు ఆలస్యమవుతుండడంతో ఇదంతా గమనిస్తున్న తోటి విద్యార్థినులు కళాశాలలోని ఓ కర్టెన్ తీసుకొచ్చారు. హాల్లోకి వెళ్లిన విద్యార్థిని కర్టెన్ కప్పుకునే పరీక్ష రాసింది. బయటకు వచ్చిన అనంతరం తములి కళాశాల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇలాంటి ఘోర అవమాన ఘటన నా జీవితంలో ఎప్పుడూ ఎదుర్కొలేదు’ అని ఆవేదన చెందింది. ‘షార్ట్స్ వేసుకోవడం ఏమైనా నేరమా?’ అని నిలదీసింది. ‘కళాశాల ఒకవేళ పొట్టి దుస్తులు అనుమతించిందని అనుకుంటే ముందే హాల్ టికెట్లలో పేర్కొనాలి’ అని పేర్కొంది. -
‘వామ్మో ఏంటా బట్టలు.. ముందు ఫ్లైట్ దిగు’
ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ.. దెనిజ్ సెపినర్(26).. టర్కీ ఫిట్నెస్ మోడల్. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్నెస్ మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్ కాంపిటీషన్లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట. కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్ చేసింది దెనిజ్. ట్విస్ట్ అయితే దెనిజ్ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్ ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్ కామెంట్లు వస్తుండడంతో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె. -
ఢిల్లీ ఆంటీ క్షమాపణలు చెప్పింది!
న్యూఢిల్లీ : ‘హలో గాయిస్.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్.. షార్ట్ డ్రెస్సెస్ ధరిస్తున్నారు. ఇలాంటి దుస్తులు వేసుకున్న వీరిని అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయండి’ అంటూ హల్చల్ చేసిన ఢీల్లి ఆంటీ ఎట్టకేలకు తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరింది. తన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, చాలా తప్పుగా మాట్లాడనని తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పేర్కొంది. అనంతరం ఆమె తన సోషల్‌మీడియా ఖాతాలన్నిటినీ తొలగించింది. ఢిల్లీలో కొందరు యువతులను ఉద్దేశించి ఓ మధ్యవయస్కురాలైన మహిళ.. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ.. దేశంలో నెలకొన్న అత్యాచారాల సంస్కృతిని సమర్థించే కిరాతక మనస్తత్వానికి అద్దం పట్టేలా చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలోహల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పదేపదే ఆ యువతులు కోరినా.. సదరు మహిళ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె తన తప్పును తెలుసుకొని క్షమాపణలు కోరింది. చదవండి: అవి ధరించిన వారిని రేప్ చేయండి: ఢిల్లీ ఆంటీ -
పొట్టి దుస్తులు ధరించిన యువతులపై షాకింగ్ వ్యాఖ్యలు
-
అవి ధరించిన వారిని రేప్ చేయండి: ఢిల్లీ ఆంటీ
న్యూఢిల్లీ: నువ్వు రికార్డు చేస్తున్నావా? హాలో గాయిస్.. అంతా మమ్మల్నే చూడాలనే ఉద్దేశంతో ఈ యువతులు అత్యంత పొట్టి (షార్ట్) దుస్తులు ధరించారు. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్ షార్ట్ డ్రెస్సెస్ ధరిస్తున్నారు.. ఢిల్లీలో కొందరు యువతులను ఉద్దేశించి ఓ మధ్యవయస్కురాలైన మహిళ పేర్కొన్న వ్యాఖ్యలివి. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హింసకు వారి వేషధారణే కారణమంటూ.. దేశంలో నెలకొన్న అత్యాచారాల సంస్కృతిని సమర్థించే కిరాతక మనస్తత్వానికి అద్దం పడుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘నేను, నా స్నేహితులు ఒక రెస్టారెంట్లో స్నాక్స్ తింటుండగా.. ఓ మహిళ నా వద్దకు వచ్చి.. పొట్టిగా ఉన్న దుస్తులు వేసుకున్నందుకు సిగ్గుపడు అంటూ పేర్కొంది. నేను, నా స్నేహితులు ఆమెతో వాదనకు దిగాం. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది. ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలను అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయాలంటూ రెస్టారెంట్లో ఉన్న పురుషులకు ఆమె చెప్పింది. దీంతో షాక్ తిన్న మేం సమీపంలో ఉన షాపింగ్‌మాల్ వరకు ఆమెను వెంటాడుతూ.. ఆమె వికృత మనస్తత్వాన్ని ప్రశ్నిస్తూ.. వీడియో తీశాం’ అని ఓ యువతి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని పదేపదే యువతులు కోరినా.. సదరు మధ్య వయస్కురాలైన మహిళ పెద్దగా పట్టించుకోలేదు. అమ్మాయిల దుస్తుల గురించి మాట్లాడే హక్కు లేదని, వారు ఎలాంటి దుస్తులు వేసుకున్నా ప్రశ్నించడానికి నువ్వు ఎవరని ఓ మహిళ ఆమెతో వాదనకు దిగారు. పసిపాపల నుంచి 80 ఏళ్ల వృద్ధురాళ్ల వరకు దేశంలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని, అలాంటి సమయంలో ఇలా దుస్తులు, వేషాధారణ గురించిన నీచమైన వ్యాఖ్యలు చేయడం, ఇలాంటివారిని పురుషులు రేప్ చేయాలని పేర్కొనడం దారుణమని ఆ మహిళ మండిపడ్డారు. అయినా ఏ మాత్రం వెనుకకు తగ్గని ఆమె.. నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకే ఇలాంటి దుస్తులు వేసుకుంటున్నారని వీడియో చివరలో పేర్కొనడం గమనార్హం. పది నిమిషాల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియో తీసిన యువతి వివరాలు పెద్దగా తెలియరాలేదు. -
ఆ వార్తలకు అంత అర్హత లేదు
చెల్లిని ఏమైనా అంటే అన్నయ్య రెస్పాండ్ అవ్వకుండా గమ్మునుంటాడా? తప్పకుండా గుస్సా అవుతాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా తన చెల్లెలి మీద కామెంట్లు విసిరినందుకు గుస్సా అయ్యారు. రీసెంట్గా జాన్వీ కపూర్ వేసుకున్న షార్ట్ డ్రెస్‌పై కొందరు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వీటిని ఓ వార్తాపత్రికకు చెందిన (‘సాక్షి’ కాదు) వెబ్సైట్ పోస్ట్ చేసింది. ఈ న్యూస్‌ను అర్జున్‌కపూర్ ట్వీటర్లో ట్యాగ్ చేసి, –‘‘ఎవరో ఇద్దరు చేసిన కామెంట్స్‌ని హైలైట్ చేశారు. ఇది చాలు.. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే నెటిజన్లకు మీడియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసుకోవడానికి’’ అని పేర్కొన్నారు. అర్జున్ అభిప్రాయాన్ని మరో మీడియా ట్యాగ్ చేసి, అతను ఫలానావాళ్లపై మండిపడ్డారని పేర్కొంది. అప్పుడు మళ్లీ అర్జున్ రెస్పాండ్ అయ్యారు. ‘‘ఇది నేను కేవలం ఒక మీడియా గురించి చెప్పడం లేదు. సోషల్ మీడియా కామెంట్స్ న్యూస్‌గా మారుతున్నాయి. వాస్తవానికి వీటికి అంత అర్హత లేదు. క్లిక్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి ఇలాంటి స్టోరీలను రాయకండి’’ అని పేర్కొన్నారు అర్జున్ కపూర్. కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ డ్రెస్ గురించి వినిపించిన అసభ్యమైన కామెంట్స్ గురించి అర్జున్ ఇలానే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి చెల్లిని ప్రొటెక్ట్ చేస్తూ, మాట్లాడారు. చూస్తుంటే అన్నాచెల్లెళ్ల మధ్య మంచి బంధం ఏర్పడిందనిపిస్తోంది కదూ. -
పొట్టి డ్రస్సు వేసుకుందని.. నర్సు ఉద్యోగం మటాష్
సినిమాల్లో నర్సు పాత్రలు చూపించేటపుడు పొట్టి పొట్టి డ్రస్సులతో వయ్యారంగా వస్తున్నట్లు చూపిస్తారు. వాస్తవానికి ఆస్పత్రులలో నర్సులెవరూ అలా మరీ పొట్టి దుస్తులు వేసుకుని తిరగరు. కానీ థాయ్‌లాండ్‌లో మాత్రం ఒక నర్సు ఇలా బాగా కురచగా కుండే దుస్తులు వేసుకుని రావడమే కాక, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. పరిచత్ పాంగ్ చత్‌స్రి (26) అనే ఈ నర్సు ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఫలితంగా ఆమె ఉద్యోగం కోల్పోయింది. థాయ్‌లాండ్‌లోని ఇసాన్ నగరంలోగల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె పనిచేస్తోంది. బాగా టైట్ ఫిట్ ఉండి, తొడలు కూడా కనిపించేలా ఆమె పొట్టి స్కర్టుతో కూడిన లిలాక్ యూనిఫాం ధరించింది. పాశ్చాత్య ప్రమాణాల ప్రకారం అయితే పర్వాలేదు గానీ, థాయ్‌లాండ్‌లో మాత్రం దాన్ని రెచ్చగొట్టే డ్రస్సుగానే భావిస్తారు. పరిచత్ సరిగా డ్రస్సు వేసుకోకపోవడమే కాక నర్సింగ్ వృత్తిని కూడా అవమానించిందని విమర్శకులు మండిపడ్డారు. 'థాయ్ నర్స్ లవర్స్ అసోసియేషన్' అనే పేజిలో ఈ ఫొటో విపరీతంగా షేర్ అయింది. దాంతో ఆమెను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. జరిగిన విషయాన్ని తాను ఆస్పత్రి వర్గాలకు వివరించానని, అయితే వాళ్లకు ఆస్పత్రి పరువు మర్యాదలే బాగా ముఖ్యమని ఆమె చెప్పింది. వాళ్ల పరిస్థితిని అర్థం చేసుకుని తాను రాజీనామా చేసినట్లు తెలిపింది. తాను కావాలంటే థాయ్‌లాండ్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్‌కు, ఆస్పత్రికి క్షమాపణలు చెబుతాను గానీ, తన పేరు చెప్పి నర్సులందరినీ ప్రజలు అవమానిస్తామంటే మాత్రం ఒప్పుకొనేది లేదని స్పష్టం చేసింది. -
'పొట్టి దుస్తులు వేసుకున్నదని నో ఎంట్రీ'
న్యూఢిల్లీ: ఓ మహిళా ప్రయాణికురాలికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సరైన దుస్తులు వేసుకోలేదంటూ ఆమెను సిబ్బంది విమానాన్ని ఎక్కనివ్వలేదు. ఫ్రాక్ ధరించిన ఆమె ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో దోహా నుంచి ముంబై వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ముంబైలో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన గురించి సహచర ప్రయాణికురాలైన పురబి దాస్ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఇండిగో పురుష సిబ్బంది ఆ యువతిని ఈ విధంగా వేధించడం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. 'మోకాళ్ల వరకు ఉన్న ఫ్రాక్ను ధరించినప్పటికీ ఆమెను విమానంలో ఎక్కనివ్వలేదు. ఆమె దుస్తులు వారికి అభ్యంతరకరంగా కనిపించాయి. కానీ ఆ సంస్థ ఎయిర్‌హోస్టెస్ మాత్రం అదే తరహా ఫ్రాక్‌లు ధరిస్తారు' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆమె ఎక్కాల్సిన విమానం మిస్సయింది. అనంతరం వేరే వస్త్రాలు ధరించిన తర్వాత ఆమె మరో విమానంలో వెళ్లేందుకు అనుమతించారని తెలిసింది. నిజానికి ఆ ప్రయాణికురాలు ఇండిగో సంస్థకు చెందిన ఉద్యోగి సోదరి. అయితే తమ డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగానే ఆమెను అడ్డుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది. ఈ విషయమై పురబి దాస్ ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. ఫ్రాక్ వేసుకొని విమానంలో ప్రయాణించడం అనుమతించరని వారు పేర్కొన్నారు.