జాన్వీ కపూర్, అర్జున్ కపూర్
చెల్లిని ఏమైనా అంటే అన్నయ్య రెస్పాండ్ అవ్వకుండా గమ్మునుంటాడా? తప్పకుండా గుస్సా అవుతాడు. బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా తన చెల్లెలి మీద కామెంట్లు విసిరినందుకు గుస్సా అయ్యారు. రీసెంట్‌గా జాన్వీ కపూర్ వేసుకున్న షార్ట్ డ్రెస్‌పై కొందరు నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వీటిని ఓ వార్తాపత్రికకు చెందిన (‘సాక్షి’ కాదు) వెబ్‌సైట్ పోస్ట్ చేసింది. ఈ న్యూస్‌ను అర్జున్‌కపూర్ ట్వీటర్‌లో ట్యాగ్ చేసి, –‘‘ఎవరో ఇద్దరు చేసిన కామెంట్స్‌ని హైలైట్ చేశారు. ఇది చాలు.. సోషల్ మీడియాలో ట్రోల్ చేసే నెటిజన్లకు మీడియా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో తెలుసుకోవడానికి’’ అని పేర్కొన్నారు.
అర్జున్ అభిప్రాయాన్ని మరో మీడియా ట్యాగ్ చేసి, అతను ఫలానావాళ్లపై మండిపడ్డారని పేర్కొంది. అప్పుడు మళ్లీ అర్జున్ రెస్పాండ్ అయ్యారు. ‘‘ఇది నేను కేవలం ఒక మీడియా గురించి చెప్పడం లేదు. సోషల్ మీడియా కామెంట్స్ న్యూస్‌గా మారుతున్నాయి. వాస్తవానికి వీటికి అంత అర్హత లేదు. క్లిక్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ హెడ్డింగ్స్ పెట్టి ఇలాంటి స్టోరీలను రాయకండి’’ అని పేర్కొన్నారు అర్జున్ కపూర్. కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ డ్రెస్ గురించి వినిపించిన అసభ్యమైన కామెంట్స్ గురించి అర్జున్ ఇలానే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మరోసారి చెల్లిని ప్రొటెక్ట్ చేస్తూ, మాట్లాడారు. చూస్తుంటే అన్నాచెల్లెళ్ల మధ్య మంచి బంధం ఏర్పడిందనిపిస్తోంది కదూ.
Comments
Please login to add a commentAdd a comment