
అర్జున్ కపూర్,జాన్వీ కపూర్
ఇంటి నుంచి బయటకు వెళ్తేనే బోలెడు జాగ్రత్తలు చెబుతారు అన్నయ్యలు. కొత్త ఉద్యోగంలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా చాలా టిప్స్ చెబుతారు. హీరోయిన్‌గా తన టాలెంట్‌ని ఫ్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జాన్వీకి కూడా అలాంటి సూచనలే ఇస్తున్నారు అర్జున్ కపూర్. జాన్వీ పరిచయం కానున్న ‘ధడక్’ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. షూటింగ్‌లో భాగంగా వేరే దేశంలో ఉన్న అర్జున్ కపూర్ తన సలహాలను, శుభాకాంక్షాలను ట్వీటర్ ద్వారా పంచుకున్నారు.
‘‘సారీ.. ముంబైలో లేనందున ఈవెంట్‌కి రాలేకపోతున్నాను. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పటికీ ఆడియన్స్‌లో నువ్వో భాగం అయిపోతావు. నీకో విషయం చెప్పదలుచుకున్నాను.. బాగా కష్టపడుతూ,నిజాయితీగా ఉంటూ, ప్రసంశలను తలకెక్కించుకోకుండా, అందరి ఒపీనియన్ తీసుకుంటూనే నీకంటూ ఓ దారిని సృష్టించుకోగలిగితే ఈ ఇండస్ట్రీకి మించిన గొప్ప చోటు లేదు. వాట్టన్నింటిని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అర్జున్.
Comments
Please login to add a commentAdd a comment