all the best
-
గొప్పగా చదవాలి, ప్రపంచంతో పోటీ పడాలి..ఆల్ ది వెరీ బెస్ట్: సీఎం వైఎస్ జగన్
-
సారీ జాన్వీ
ఇంటి నుంచి బయటకు వెళ్తేనే బోలెడు జాగ్రత్తలు చెబుతారు అన్నయ్యలు. కొత్త ఉద్యోగంలోకి అడుగుపెడుతున్నప్పుడు కూడా చాలా టిప్స్ చెబుతారు. హీరోయిన్గా తన టాలెంట్‌ని ఫ్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జాన్వీకి కూడా అలాంటి సూచనలే ఇస్తున్నారు అర్జున్ కపూర్. జాన్వీ పరిచయం కానున్న ‘ధడక్’ ట్రైలర్ సోమవారం రిలీజ్ అయింది. షూటింగ్లో భాగంగా వేరే దేశంలో ఉన్న అర్జున్ కపూర్ తన సలహాలను, శుభాకాంక్షాలను ట్వీటర్ ద్వారా పంచుకున్నారు. ‘‘సారీ.. ముంబైలో లేనందున ఈవెంట్‌కి రాలేకపోతున్నాను. ఒక్కసారి ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎప్పటికీ ఆడియన్స్‌లో నువ్వో భాగం అయిపోతావు. నీకో విషయం చెప్పదలుచుకున్నాను.. బాగా కష్టపడుతూ,నిజాయితీగా ఉంటూ, ప్రసంశలను తలకెక్కించుకోకుండా, అందరి ఒపీనియన్ తీసుకుంటూనే నీకంటూ ఓ దారిని సృష్టించుకోగలిగితే ఈ ఇండస్ట్రీకి మించిన గొప్ప చోటు లేదు. వాట్టన్నింటిని నేర్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్’’ అని పేర్కొన్నారు అర్జున్. -
స్పీడ్ పెంచిన హీరోలు
రెండు మూడేళ్ల క్రితంతో పోల్చితే ఇప్పుడు హీరోలు స్పీడ్ పెంచారు. ఒకేసారి రెండు సినిమాలు లేదా ఒకే సినిమాని త్వరగా పూర్తి చేయడం చేస్తున్నారు. దానివల్ల థియేటర్ల కొరత ఏర్పడుతోంది. ఇదే విషయాన్ని ఇటీవల ‘దిల్’ రాజు ప్రస్తావించారు. ఎన్ని ఎక్కువ సినిమాలు వస్తే అంత మంచిదే కానీ, రిలీజ్ విషయంలో అండర్‌స్టాండింగ్‌తో వెళ్లాలి. నిర్మాతలందరూ దాదాపు అలానే వెళుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 9 గురించి మాట్లాడుకోవాలి. ఒకటి కాదు.. రెండు కాదు. ఏకంగా ఐదు సినిమాలు ఫిబ్రవరి 9న బాక్సాఫీస్ వార్‌కు రెడీ అయ్యాయి. మోహన్‌బాబు ‘గాయత్రి’, వరుణ్‌తేజ్ ‘తొలిప్రేమ’, సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’, నిఖిల్ ‘కిర్రిక్ పార్టీ’, నాగశౌర్య ‘కణం’ అదే రోజున రిలీజ్ కావాల్సింది. కానీ.. గాయత్రి, ఇంటిలిజెంట్ మాత్రమే ఫిబ్రవరి 9న థియేటర్లోకి వచ్చాయి. ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్ ప్రసాద్, ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్ ‘దిల్’ రాజు తమ ‘తొలిప్రేమ’ సినిమాను ఒక్క రోజు వాయిదా వేశారు. అంటే.. ఫిబ్రవరి 10న వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ రిలీజైంది. ‘ఇంటిలిజెంట్’ నిర్మాత సి. కల్యాణ్, ‘తొలిప్రేమ’ నిర్మాత బీవీయస్‌యన్, డిస్ట్రిబ్యూటర్ రాజు.. ముగ్గురూ చర్చించుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు ఒకేరోజు సినిమాలు రిలీజ్ అవుతుంటే.. ఒక సినిమా హీరో, ఇంకో సినిమా హీరోకు సోషల్ మీడియాలో ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. అఖిల్ హీరోగా నాగార్జున నిర్మాణంలో వచ్చిన ‘హలో’, ‘దిల్’ రాజు నిర్మాతగా నాని హీరోగా వచ్చిన ‘ఎమ్సీఏ’ విషయం అప్పుడు ఇలానే పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఇటీవల ‘మనసుకు నచ్చింది’ రిలీజ్ అప్పుడు చిత్రకథానాయకుడు సందీప్ కిషన్.. నాని నిర్మించిన ‘అ!’కి శుభాకాంక్షలు చెబితే.. నాని టీమ్ వీళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సాయిధరమ్ తేజ్, లావణ్యా త్రిపాఠి -
జయహో భారత్
రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్ష ఇస్రో శాస్త్రవేత్తలకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ప్రదర్శన పుష్కర్‌ఘాట్ వద్ద విద్యార్థుల సందడి కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విశేష అభివృద్ధి సాధిస్తున్న మన దేశం వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఒకేసారి 103 స్వదేశీ, విదేశీ రాకెట్లను నింగిలోకి తీసుకెళ్లేందుకు మన శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి మద్దతు పలుకుతూ విద్యార్థులు జయహోభారత్ అంటూ ముక్తకంఠంతో నినదించారు. ఇస్రో ప్రయోగించనున్న 103 రాకెట్లు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ జయహో అంటూ విద్యార్థుల నినాదాలతో రాజమహేంద్రవరంలోని పుష్కర్‌ఘాట్ మార్మోగింది. సారథి స్వచ్ఛంద సంస్థ, ఆదిత్య డిగ్రీ కళాశాల, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ సంయుక్తాధ్వర్యంలో శనివారం ఇస్రో నమూనా రాకెట్ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులంతా రాకెట్ నమూనాలో కూర్చుని అందర్నీ అలరించారు. ముఖ్యఅతిథిగా రాజమహేంద్రవరం ఎంపీ ఎం.మురళీమోహ¯ŒS మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూస్తున్నాయన్నారు. ఇప్పటికే ఎన్నో ఘన విజయాలు సాధించిన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగంలోనూ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మేయర్ పంతం రజనీశేషసాయి మాట్లాడుతూ విద్యార్థులంతా అబ్దుల్æకలాం జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయనలా గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశానికి పేరుప్రతిష్ఠలు తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో ఎవరినైనా నీ లక్ష్యం ఏమిటంటే ఇంజనీర్, డాక్టర్ అని చెప్పేవారని ఇప్పుడు అబ్దుల్‌కలాం అవుతామని గర్వంగా చెబుతున్నారన్నారు. అనంతరం ఇస్రోకు పంపేందుకు ఏర్పాటు చేసిన బ్యానర్ క్లాత్‌పై ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్, విద్యార్థులు, ప్రజలు సంతకాలు చేశారు. కార్యక్రమంలో కుడుపూడి పార్థసారథి, ఎస్.పి.గంగిరెడ్డి, బాలాత్రిపురసుందరి, కోసూరి చండీప్రియ, టి.కె.విశ్వేశ్వరరెడ్డి, ఆదిత్య కళాశాల, రాజమహేంద్రి డిగ్రీ కళాశాల, చున్నీలాల్జాజు మున్సిపల్ హైస్కూలు, ట్రిప్స్ స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు. -
టీమిండియా పై మరో పాట
-
దిల్ జిగేల్..
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేముందు దాని సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. మనతో అవుతుందనుకుంటే పాటించాలి. కొంచెం కష్టమైనా పర్వాలేదనుకుంటే ట్రైచెయ్యాలి. కానీ సాధ్యం కాని దానిని ఎన్నుకుని తర్వాత మధ్యలోనే వదిలిపెట్టేయడం మంచిది కాదంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. కష్టతరమైనదైనా క్రమం తప్పకుండా చేస్తే అది అలవాటుగా మారుతుందనేది వారి అభిప్రాయం. ఇక ఈ సంవత్సరంలో తప్పకుండా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దామా.. సమయ పాలన మనలో బోల్డంత నైపుణ్యం ఉండొచ్చు. చేయి తిరిగిన వ్యాపారి అయి ఉండొచ్చు. కానీ సమయపాలన లేకపోతే ఆయా రంగాల్లో రాణించడం కష్టం. సమయం మనకు ఎంత ముఖ్యమో.. మిగతా వారికీ అంతే అన్న సంగతి మర్చిపోకూడదు. పనులను వాయిదా వేసే విధానాన్ని వెంటనే విడనాడాలి. సమయాన్ని ఎంతబాగా ఉపయోగించుకుంటే అంత మేలు. ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాంగా.. సమస్య వచ్చినప్పుడు చూద్దాం.. అని చాలామంది ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ తర్వాత సమస్య వచ్చినప్పుడు బెంబేలెత్తిపోతుంటారు. దీనిని తప్పించుకునేందుకు రోజుకు ఒక అరగంటైనా వ్యాయామం చేయాలి. మరి ఆలస్యమెందుకు ఈరోజు నుంచే ప్రారంభించేద్దాం. కొత్త ఏడాదిలో దీనిని అలవాటుగా మార్చుకుందాం. పొదుపు వచ్చింది ఖర్చులకే సరిపోవడం లేదు.. ఇక పొదుపా.. అని చాలామంది కొట్టి పారేస్తుంటారు. జీతం వచ్చిందా.. ఖర్చు చేశామా.. ఇదీ కొందరి ధోరణి. కానీ అవసరాలు చెప్పిరావు. కాబట్టి నెలకు కొంతయినా పొదుపు కోసం తీసేసి మిగతా సొమ్మును ఖర్చులకోసం వాడుకోవాలి. పొదుపు ఏరకంగా ఉండాలో మొదటే నిర్ణయం తీసుకోవాలి. వచ్చిన జీతంలో వీలైనంతగా పొదుపు కోసం కేటాయిస్తే భవిష్యత్ బంగారుమయమే. సానుకూల దృక్పథం చిన్నపాటి సమస్యలకే కుంగిపోవడం మంచి లక్షణం కాదు. సమస్య వచ్చినప్పుడు సానకూల దృక్పథంతో ఆలోచించాలి. ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా మార్గాలు అన్వేషించాలి. ఆత్మీయులతో చర్చిస్తే పరిష్కారం సులభంగా దొరకొచ్చు. కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకుసాగితే విజయం కళ్లముందు సాక్షాత్కారమవుతుంది. ఒత్తిడిని జయించాలి వేగం సంతరించుకున్న జీవితాలలో ఒత్తిడి ఒక భాగమైపోయింది. దీనికి తలొగ్గామో ఇక అంతే. ఒత్తిడిని ఎదుర్కొనే వ్యూహాలు రచించాలి. దానిపై పైచేయి సాధిస్తే విజయం సొంతమవుతుంది. ఇది చెప్పినంత సులభం కాకపోయినా సంకల్ప బలముంటే పెద్ద కష్టమేమీ కాదు. మంచివారితో స్నేహం చేయడం, నలుగురిలో కలిసిపోవడం, పుస్తక పఠనం, యోగా.. ఇలాంటి వాటితో ఒత్తిడిని తరిమికొట్టొచ్చు. నిరంతర విద్యార్థిగా.. ప్రపంచం వేగంగా మారిపోతోంది. ఆ వేగాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. కంప్యూటర్‌తో పోటీపడాలి. నేర్చుకునే ధోరణి పెరగాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. సమ యం లేదని, వీలుకాలేదనే సాకులను కట్టిపెట్టాలి. విషయాలు తెలుసుకోవడంలో నిరంతర విద్యార్థిగా ఉంటేనే సక్సెస్ సొంతమవుతుంది. కుటుంబంతో సరదాగా.. వ్యక్తి విజయంలో కుటుంబం పాత్ర ఎంతో ఉంటుం ది. విధుల్లో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ సభ్యులతో గడిపేందుకు కొంత సమయం కేటాయించాలి. వారానికోసారైనా కలిసి సినిమాకో, షికార్లకో వెళ్లాలి. అప్పుడే వారితో అనుబంధం మరింత పెనవేసుకుపోతుంది. సాయంతో తృప్తి ప్రపంచీకరణతో జీవన విధానంలో వేగం పెరిగింది. అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చాక ఎవరికి వారే అన్న ధోరణి పెరిగిపోయింది. సంవత్సరాల తరబడి ఒకదగ్గరే ఉంటున్నా పక్కంటి వారి పేర్లు కూడా తెలియని స్థితి. ఆ.. మనకెందుకులే అన్న ధోరణి. మొదట దీనిని విడనాడాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. బాధలో ఉన్నవారికి బాసటగా నిలవాలి. చేతనైనంత సాయం చేయాలి. సేవలో దొరికే తృప్తి మరెందులోనూ ఉండదు. మనిషిని చెడు ఆకర్షించినంత వేగంగా మంచి ఆకర్షించదు. కాబట్టి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒక్కసారే కదా.. అని పొరపాటున కూడా వాటి జోలికి వెళ్లకూడదు. దురలవాట్లకు ఒకసారి దగ్గరైతే వాటిని నుంచి బయటపడడం అంత తేలిక కాదు. కాబట్టి కొత్త ఏడాదిలో వాటి జోలికెళ్లనని ఒట్టుపెట్టుకోవాలి. మనసును అదుపులో ఉంచుకుంటే అదేమీ అసాధ్యం కాదు. ఇవన్నీ పాటిస్తే విజయం మీ సొంతమవుతుంది. ఆల్ ది బెస్ట్ -
పవన్ కళ్యాణ్ ను కలిసిన పవనిజం టీమ్
-
ఆల్ ద బెస్ట్
నేడే ఎంసెట్ ఏర్పాట్లు పూర్తి 325 స్పెషల్ బస్సుల ఏర్పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిల్ సాక్షి, సిటీబ్యూరో: మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న ‘ఇంజనీరింగ్, మెడికల్ అండ్ అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎంసెట్)-2014’కు సర్వం సిద్ధమైంది. నగరంలోని ఎంపిక చేసిన అన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నగరాన్ని ఎనిమిది జోన్లుగా విభజించారు. అభ్యర్థుల నివాసాలకు ఐదు కి లోమీటర్ల రేడియస్‌లో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. ఈ కేంద్రాలుండే మార్గంలో ఆర్టీసీ 325 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎంసెట్ రాయనున్న అభ్యర్థులు చేయాల్సిందల్లా.. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరడమే. నిర్దేశిత సమయం కన్నా నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించమని అధికారులు ముందే హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఓఎంఆర్ షీట్‌ను నింపేటపుడు ఇన్విజిలేటర్ సూచనలు పాటించాలి. సెల్ఫోన్లు, గాగుల్స్, డిజిటల్ వాచీలను లోనికి అనుమతించరు. అభ్యర్థులు వెంట హాల్‌టికెట్, బాల్‌పాయింట్ పెన్నులు, ఆన్లైన్ దరఖాస్తు ఫారం ఉన్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. ఎంసెట్‌కు హాజరవుతున్న అభ్యర్థులందరికీ ‘ఆల్ ది బెస్ట్’ మరి. ఏ జోన్ పరిధిలో ఏఏ ప్రాంతాలంటే.. కూకట్పల్లిః ప్రగతినగర్, నిజాంపేట్, బాచుపల్లి, చందానగర్, బీహెచ్ఈఎల్, పటాన్చెరు కుత్బుల్లాపూర్: బోరంపేట్, కండ్లకోయ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, దుండిగల్ మెహదీపట్నం: టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, ఇబ్రహీంబాగ్, గండిపేట, రాయదుర్గం, షేక్‌పేట, గచ్చిబౌలి మాసబ్‌ట్యాంక్: ఖెరతాబాద్, లక్డీకాపూల్, సైఫాబాద్, నాంపల్లి, సోమాజిగూడ, బేగంపేట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ఓయూః విద్యానగర్, రామాంతపూర్, అంబర్‌పేట, హబ్సిగూడ, నాచారం, తార్నాక, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ సికింద్రాబాద్ : రాణిగంజ్, ఎస్పీరోడ్, ఆర్పీరోడ్, ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్ మారేడ్‌పల్లి, జూబ్లీ బస్టాండ్, ప్యారడైజ్, ప్యాట్నీ సెంటర్ ముషీరాబాద్: గగన్‌మహల్, నారాయణగూడ, బషీర్‌బాగ్, బర్కత్‌పుర, చిక్కడపల్లి, హిమయత్ నగర్, హనుమాన్ తెక్డీ రాజేంద్రనగర్: బండ్లగూడ, అప్పా జంక్షన్, మొయినాబాద్ ఆరు గంటలకు సెట్‌కోడ్ విడుదల ఎంసెట్-2014 ఇంజనీరింగ్ పరీక్ష ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను గురువారం ఉదయం ఆరు గంటలకు, మెడికల్ అండ్ అగ్రికల్చర్ పరీక్ష ప్రశ్నపత్రం సెట్ కోడ్‌ను ఉదయం 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ఎన్వీ రమణరావు బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. జేఎన్టీయూహెచ్లోని అకడమిక్ స్టాఫ్ కళాశాల ఆడిటోరియంలో జరగనున్న ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి, ఎంసెట్-2014 చైర్మన్, జేఎన్టీయూహెచ్ ఉపకులపతి డాక్టర్ రామేశ్వరరావు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.