
అర్జున్ నివాసం వద్ద జాన్వీ కపూర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, ముంబై: తన సోదరి జాన్వీ కపూర్ ఫొటోలను అభ్యంతరకరరీతిలో ప్రచురించిన వెబ్‌సైట్‌పై బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ మండిపడ్డాడు. ఎక్స్‌పోజింగ్ చేసేలా జాన్వీ కపూర్ ‘సెక్సీ దుస్తులను’ ధరించిందంటూ ఓ బాలీవుడ్ సినిమా వెబ్‌సైట్ అసభ్య కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై అర్జున్ కపూర్ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు.
ఇటీవల అర్జున్ కపూర్ నివాసం వద్ద జాన్వీ, ఆమె సోదరి ఖుషీ ఉన్న సమయంలో తీసిన ఫొటోలు.. పోస్టు చేస్తూ అభ్యంతరకరమైన రీతిలో కథనాన్ని ప్రచురించడంతో ఆ వెబ్‌సైట్‌ను అర్జున్ చీల్చిచెండాడాడు. ‘నీచమైన వెబ్‌సైట్.. అలాంటి సమయంలోనూ నీ కళ్లు అలా దుర్బుధ్దితో అన్వేషించడం సిగ్గుచేటు. మన దేశంలో అమ్మాయిలను ఇలాగే చూస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం. ఇందుకు సిగ్గుపడుతున్నా’ అని అర్జున్ ఆవేదనగా ట్వీట్ చేశాడు. సదరు వెబ్‌సైట్ వెంటనే కథనాన్ని తొలగించింది.
గతంలోనూ జాన్వీ, ఖుషీలను ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు కించపరిస్తే.. వారికి మద్దతుగా అర్జున్ నిలిచాడు. శ్రీదేవి కూతుళ్లు అయిన జాన్వీ, ఖుషీ అర్జున్‌కు సవతి చెల్లెళ్లు అవుతారు. బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ సంతానం అర్జున్, అన్షులా. ఇటీవల శ్రీదేవి ఆకస్మికంగా మృతిచెందడంతో తీవ్ర బాధలో ఉన్న జాన్వీ, ఖుషీకి అర్జున్, అన్షులా అండగా నిలిచారు. ఈ క్రమంలో ఇటీవల బోనీ తన కూతుళ్లు జాన్వీ, ఖుషీలను తీసుకొని అర్జున్, అన్షులా ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment