అమ్మ కోరిక అదే : హీరో | Arjun Kapoor Emotional Words About His Mother Mona Shourie Kapoor | Sakshi
Sakshi News home page

అమ్మ కోరిక అదే : హీరో

Published Wed, Jun 6 2018 10:36 AM | Last Updated on Wed, Jun 6 2018 11:37 AM

Arjun Kapoor Emotional Words About His Mother Mona Shourie Kapoor - Sakshi

తండ్రి, సోదరిలతో అర్జున్‌ కపూర్‌ (ఫైల్‌ ఫొటో)

లెజెండరీ నటి శ్రీదేవి మరణానంతరం తొలిసారి అర్జున్‌ కపూర్‌ తన తల్లి మోనా శౌరీ కపూర్‌ గురించి స్పందించారు. సవతి తల్లి మరణానంతరం.. ఆ బాధ నుంచి కోలుకునేందుకు అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌లు తమ తండ్రి బోనీకపూర్‌, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు ప్రతీ విషయంలో అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీదేవి చనిపోయినపుడు షూటింగ్స్‌ క్యాన్సిల్‌ చేసుకొని మరీ కొడుకుగా, అన్నగా బాధ్యతలు నిర్వర్తించారు అర్జున్‌ కపూర్‌. ప్రస్తుతం బోనీ కపూర్ పిల్లలు నలుగురు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్‌ కూడా ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్‌ కపూర్‌, సోదరి అన్షులా కపూర్‌ తమని చాలా బాగా చూసుకుంటున్నారని’ చెప్పారు.

అయితే అర్జున్‌, అన్షులా గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్‌.. ‘ అర్జున్‌, అన్షులా తల్లి మోనా శౌరీ పెంపకం చాలా గొప్పది. అందుకే వారు కష్టకాలంలో తమ తండ్రికి, సోదరిలకు అండగా నిలిచారు’ అంటూ ట్వీట్‌ చేశారు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన అర్జున్‌ కపూర్‌.. ‘నేను, నా సోదరి అన్షులా మా జీవితంలోని ప్రతీ క్షణంలో మా అమ్మ మాతో ఉన్నట్టుగానే భావిస్తాం. మేము ఎల్లప్పుడూ మా తండ్రి పక్కనే ఉండాలని ఆమె కోరుకునేది. అలాగే జాన్వీ, ఖుషీలకు తోడుగా ఉండడం మరీ అంత గొప్ప విషయమేమీ కాదు. మా అమ్మ గురించి ఇంత మంచిగా మాట్లాడిన మీకు కృతఙ్ఞతలు. ఆమె మిమ్మల్ని దీవిస్తుంది’ అంటూ ఉద్వేగపూరిత ట్వీట్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement