Boni Kapoor
-
Birthday Special: 'దేవర' బ్యూటీ జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్.. రేర్ (ఫొటోలు)
-
'హైదరాబాద్‌తో ఎన్నో జ్ఞాపకాలు.. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తా'
అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు ఆమె.. అమ్మతో పోటీ పడే సౌందర్యం..అమ్మలాగే రాణించాలనే తపన.. అందుకు తగ్గట్టు అంకితభావం.. బాలివుడ్లో అరంగేట్రం చేసిన దగ్గర్నుంచీ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్న స్టార్ డాటర్... ‘జాన్వీ కపూర్’..నగరం వేదికగా నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ సందర్భంగా జాన్వీ ‘సాక్షి’తో ముచ్చటించింది. బాలీవుడ్లో చేస్తున్నప్పటికీ నేనెప్పుడూ దక్షిణాది అమ్మాయినేనంటూ తను పంచుకున్న కబుర్లు ఆమె మాటల్లోనే... సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సిటీతో ఎన్నో అందమైన జ్ఞాపకాలున్నాయి. సిటీలో నాన్న బోనీ కపూర్ సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు ఎక్కువగా వచ్చాను. ఇక్కడ షూటింగ్ అయిపోగానే నేరుగా తిరుపతి వెళ్లడం అలవాటు. ప్రస్తుతం ఇక్కడ సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఎంతో మార్పు వచ్చింది. విశిష్టమైన సంస్కృతి ఇక్కడి ప్రత్యేకత. ఇంతటి అనుబంధం ఉన్న నగరానికి చాలా కాలం తరువాత వచ్చి టాప్ ఫ్యాషన్ డిజైనర్ అమిత్ అగర్వాల్‌తో కలిసి బ్లెండర్స్ ప్రైడ్ గ్లాస్ వేర్ ఫ్యాషన్ టూర్లో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చింది. దేశమంతా దక్షిణాది వైపే చూస్తోంది... ప్రస్తుతం దేశమంతా దక్షిణాది సినిమాల వైపే చూస్తుంది. నా వారసత్వపు మూలాలు దక్షిణాదిలోనే ఉన్నాయి. అందుకే నేనెక్కడున్నా, ఏ సినిమాలు చేస్తున్నా దక్షిణాది అమ్మాయినని గర్వంగా చెప్పుకుంటాను. అమ్మ తెలుగులో మరుపురాని సినిమాల్లో నటించి ఇక్కడ ఆరాధ్యనటి అయింది. నాకు కూడా టాలీవుడ్లో మంచి ప్రాజెక్ట్ చేయాలనుంది. మంచి కథలకు, దర్శకులకు ఇక్కడ కొదవలేదు. ఎప్పుడో చెప్పలేను కానీ ఖచ్చితంగా చేస్తాను. దక్షిణాది సినిమాలు, ఇక్కడి సంస్కృతి గురించి ఎక్కడైనా గొప్పగా విన్నప్పుడు గర్వంగా అనిపిస్తుంది. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నా... సినిమాల వల్ల మాత్రమే వచ్చే గౌరవం, నమ్మకం చాలా ప్రత్యేకమైనవి.ఒక సినిమాతో మరో సినిమాను పోల్చలేం. దేనికదే ప్రత్యేకతను కలిగిఉంటాయి. కళపైన మక్కువ, నిరంతర కృషి, అంకితభావం మనల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయని గట్టిగా నమ్ముతాను. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న నా తదుపరి సినిమా మిస్టర్ అండ్ మిస్సెస్ మహీ చాలా ప్రత్యేకమైనది. ఈ సినిమాలో పాత్రను ఛాలెంజింగ్‌గా చేస్తున్నాను. దీని కోసం క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ క్రమంలో నా రెండు భుజాలకు గాయాలు కూడా అయ్యాయి. చదవండి: (Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది) అమ్మే ఫ్యాషన్ గురు.. వ్యక్తిగతంగా ఎలాంటి ఫ్యాషన్ అనుకరించాలి, ఏ విధమైన దుస్తులు ధరించాలనే విషయాల్లో సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను. అమ్మకు ఫ్యాషన్పైన మంచి పట్టుండేది. నా సోదరి ఖుషీనీ, నన్ను అందంగా తయారు చేయడంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేది. అధునాతన ఫ్యాషన్ పైన ఎన్నో సలహాలను అందించేది. నా చర్మం చాలా సున్నితమైనది, అందుకే దానికి తగిన ఫ్యాబ్రిక్ మాత్రమే వాడుతాను. సింథటిక్కు దూరంగా ఉంటాను. ప్రస్తుతం ఏదైనా సలహా తీసుకోవాలన్నా, ఏదైనా పంచుకోవాలన్నా చెల్లి ఖుషీకే ప్రాధాన్యతనిస్తాను. -
Janhvi Kapoor: ఆ విషయం మనసుకు బాధ కలిగిస్తోంది
దివంగత అతిలోక సుందరి శ్రీదేవి, బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌లో పెద్ద కూతురు జాన్వీ కపూర్ అనే విషయం తెలిసిందే. శ్రీదేవి వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ తడక్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా.. అనుకున్న స్థాయిలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోలేక పోయింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటించిన కొన్ని మంచి కథా చిత్రాలు థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల కావడంతో ఆమెతో పాటు అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తన గ్లామరస్ ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ జాన్వీ కపూర్ మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంది. ఇటీవల రూ.70 కోట్లతో కొత్త ఇల్లు కొనుగోలు చేసిందనే ప్రచారం హోరెత్తుతోంది. మరో పక్క ఈ బ్యూటీ దక్షిణాదిలో అడుగు పెట్టాలని ఆశిస్తున్నా, అలాంటి అవకాశం సెట్ అవ్వడం లేదు. కాగా తాజా ఆమె మాట్లాడుతూ.. వారసత్వ ముద్ర వేయడం తనకు భారంగానే అనిపిస్తోందన్నారు. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తనను సినీ వారసురాలనే ప్రచారం చేయడం మనసుకు బాధ కలిగిస్తోందన్నారు. కరణ్ జోహార్ మంచి కథా చిత్రాలను నిర్మిస్తున్నారని, తన సంస్థ చిత్రాల్లో నటించడం అదృష్టంగా జాన్వీ కపూర్ పేర్కొంది. చదవండి: (Kamal Haasan: అప్పట్లో ప్రమాదం జరిగితే..) -
Valimai Pre Release Event: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
కరోనా ఎఫెక్ట్.. మరో భారీ బడ్జెట్ చిత్రం వాయిదా
Ajith Kumar Valimai Postponed Due To Covid-19, Boney Kapoor Confirms: ఈ సంక్రాంతికి సందడి చేస్తాయనుకున్న స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ వంటి సినిమాలు వాయిదా పడగా.. తాజాగా అజిత్ ‘వలీమై’ కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ప్రకటించారు. అజిత్ హీరోగా హెచ్.వినోద్ దర్శకత్వంలో ‘వలీమై’ తెరకెక్కింది. సంక్రాంతికి జనవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమాను కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు, దర్శకుడు ఎవరంటే.. వలిమై నిర్మాత బోణి కపూర్ ట్వీట్ చేస్తూ.. రోజురోజు కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చింది. ‘ప్రేక్షకులు, అభిమానులు మా సంతోషానికి కారణం. క్లిష్ట పరిస్థితుల్లో వారు చూపిన సహకారం, ఎల్లలు లేని ప్రేమాభిమానాలు వల్లే ఈ డ్రీమ్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాహంగా థియేటర్స్‌లో సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రేక్షకుల భద్రత కూడా ముఖ్యమే. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే.. దీంతో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకూ మన చిత్రం ‘వలీమై’ విడుదలను వాయిదా వేస్తున్నాం. వ్యాక్సిన్ వేయించుకోండి. మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే మళ్లీ థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. కాగా భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్ సరసన బాలీవుడ్ నటి హ్యూమాఖురేషి నటిస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. We thank our Distributors in India and across the globe for standing with us at this time. #Valimai #StaySafe#AjithKumar #HVinoth @thisisysr @BayViewProjOffl @ZeeStudios_ @sureshchandraa @ActorKartikeya #NiravShah @humasqureshi @RajAyyappamv @bani_j #Kathir @dhilipaction pic.twitter.com/l4rWF1Xw3Z — Boney Kapoor (@BoneyKapoor) January 6, 2022 -
24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్
మరో మూడు రోజుల్లో (మార్చి, 6) జాన్వీ కపూర్‌కి 23ఏళ్లు నిండుతాయి. 24లోకి అడుగుపెడతారు. మరి.. వేడుకలు భారీ ఎత్తున ఉంటాయా? అంటే.. ఇంటిపట్టున ఖాళీగా ఉంటే ఉండి ఉంటాయేమో. పుట్టినరోజు నాడు జాన్వీ షూటింగ్‌తో బిజీగా ఉంటారు. ఆ విషయం గురించి జాన్వీ మాట్లాడుతూ – ‘‘ప్రస్తుతం ‘గుడ్‌లక్ జెర్రీ’ షూటింగ్ చేస్తున్నాను. ఈ లొకేషన్లోనే నా బర్త్‌డే జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి మా నాన్న (నిర్మాత బోనీకపూర్) గారు లొకేషన్‌కి వస్తారనుకుంటున్నాను. ఆ విషయం అలా ఉంచితే ఇలా షూటింగ్ స్పాట్లో బర్త్‌డే చేసుకునే అవకాశం రావడం నాకు మంచి ఫీల్‌ని ఇస్తోంది. పని మధ్యలో వేడుక చేసుకోవడం అంటే ఆ థ్రిల్ వేరు’’ అన్నారు. గత ఏడాది మీ బర్త్‌డే ఎలా జరిగింది? అంటే.. ‘‘2020ని నా జీవితంలోంచి తీసేశాను. గతేడాది కరోనా మనల్ని ఏ వేడుకా చేసుకోనివ్వలేదు. అందుకే ఇప్పుడు నేను 24లోకి అడుగుపెడుతున్నప్పటికీ 23వ బర్త్‌డేని చేసుకుంటాను. కరోనా వల్ల ఓ ఏడాదంతా వేస్ట్ అయిపోయింది. ఆరేడు నెలలు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. లాక్డౌన్ తర్వాత సెప్టెంబర్ నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను’’ అన్నారు. జాన్వీ నటించిన తాజా చిత్రం ‘రూహీ’ ఈ నెల 11న రిలీజ్ కానుంది. చదవండి: సక్సెస్ అయితేనే మాట్లాడతారు: సందీప్ కిషన్ మా సీఎం అభ్యర్థి కమలహాసన్ -
హీరో అజిత్‌కి ఏమైంది? షూటింగ్ ఫోటో వైరల్
హైదరాబాద్ : తమిళ స్టార్ అజిత్ నటిస్తున్న వలిమై చిత్రంలోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మరింది. షూటింగ్లో భాగంగా కుటంబంతో కలిసి దిగినట్లుగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఫోటోలో అజిత్ కనిపిస్తున్న తీరు ఆయన అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఫోటో కాస్త అస్పష్టంగా ఉండటంతో వెంటనే క్లారిటీగా ఉన్న ఫోటోను రిలీజ్ చేయాల్సిందిగా అజిత్ అభిమానులు చిత్ర బృందాన్ని కోరారు. ఈ లేటెస్ట్ ఫోటోకి సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వాల్సిందిగా విఙ్ఞప్తి చేస్తున్నారు. హెచ్.వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది. (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా? ) ఈ ఏడాది మార్చిలోనే షూటింగ్ ప్రారంభమైనా కరోనా కారణంగా బ్రేక్ పడింది. తిరిగి ఎనిమిది నెలల అనంతరం అన్ని జాగ్రత్తల నడుమ శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. శంకర్ రాజా ఈ చితత్రానికి సంగీతం అందిస్తుండగా బోనికపూర్ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్డేట్స్కి సంబంధించి ఫ్యాన్స్ నుంచి వస్తున్న వినతులపై బోనీ స్పందించారు. వలిమై సినిమా సెట్లో అజిత్ గాయపడ్డాడని, అయినప్పటికీ షూటింగ్ ఆలస్యం చేయకుండా షాట్ పూర్తిచేశాడని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అప్డేట్ ప్రకటిస్తామని, అప్పటిదాకా వేచి ఉండాల్సిందిగా అజిత్ ఫ్యాన్స్‌ను కోరారు. నీరవ్ షా సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. (జాంబిరెడ్డి ట్రైలర్ రిలీజ్ చేయనున్న ప్రభాస్ ) -
‘హ్యాపీ బర్త్‌డే మై ఫన్నీయర్ వెర్షన్’
ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తన సోదరుడు, నటుడు సంజయ్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇవాళ (అక్టోబర్ 17) సంజయ్ 55వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌తో కలిసి చేసిన బూమారాంగ్ వీడియోను అనిల్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: మహేశ్ వర్సెస్ అనిల్) ‘నా ప్రియమైన సోదరుడు, మై ఫన్నీయర్ వెర్షన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే సంజయ్. లవ్ యూ’ అంటూ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న రాత్రి జరిగిన సంజయ్ బర్త్‌డే పార్టీకి సంబంధించిన పలు ఫొటోలను ఆయన భార్య మహీప్ కపూర్ పలు ఫొటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే హస్భెండ్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోల్లో బోణికపూర్, అర్జున్ కపూర్, మోహిత్, సందీప్ మార్వాలు ఉన్నారు. అది చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్ కపూర్) To the younger, brighter, fun-ner version of me... Happy Birthday #SanjayKapoor! When the situation allows, let's get away for a family vacation 🤗 Have a great day brother! Love you! pic.twitter.com/k7FZax4rsy — Anil Kapoor (@AnilKapoor) October 17, 2020 -
డబుల్ ధమాకా
‘అజ్ఞాతవాసి’ (2018) తర్వాత పవన్ కల్యాణ్ మేకప్ వేసుకుని మూవీ కెమెరా ముందుకు రాలేదు. ఆయన సినిమా విడుదలై కూడా రెండేళ్లు పూర్తయింది. తన అభిమానులకు ఆ లోటును తీర్చేందుకు డబుల్ ధమాకా ఇవ్వాలని ఫిక్స్ అయినట్లున్నారు. ఒకేసారి రెండు సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఆల్రెడీ హిందీ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నారు. ‘దిల్’ రాజు, బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ చిత్రం వేసవిలో విడుదల అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఇది సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఎ.యం. రత్నం నిర్మించనున్న ఓ పీరియాడికల్ మూవీకి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమా ఈ నెల 27న ప్రారంభం అవుతుందని సమాచారం. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. -
చిన్ననాటి ఫోటో పంచుకున్న నటుడు
ప్రముఖ బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్ సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. తన అభిమనులను అలరిస్తూ ఉంటారు. రిషీ.. విలక్షణమైన పాత్రలతో పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా రిషీ తన చిన్ననాటి ఫోటోను ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో ఉన్నవారంతా తన పుట్టిన రోజు వేడుకల్లో ఉన్న సోదరులు.. బోని కపూర్, అనిల్ కపూర్, అదిత్య కపూర్, టూటూ శర్మలుగా పేర్కొన్నారు. వీరంతా పుట్టిన రోజు వేడుకల్లో కూల్‌డ్రింక్ కోకాకోలా తాగుతున్నట్టు కనిపిస్తున్నారు. రిషీ కొంటెగా తన పక్కన ఉన్న సోదరున్ని కొడుతున్నట్టు, అతని చేతిలో ఏదో ఉంటే.. లాక్కోడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఈ ఫోటోకి ‘ఒరిజినల్ కోకా కోలా ప్రకటనలో.. బోని కపూర్, ఆదిత్య కపూర్, రిషికపూర్, టూటూ శర్మలతోపాటు, క్యూట్ అనిల్ కపూర్’ ఉన్నారంటూ రిషీ కామెంట్ పెట్టారు. Original “Coca Cola” advertisement. Boney Kapoor,Aditya Kapoor, Rishi Kapoor,Tutu Sharma and that cute brat Anil Kapoor( photo courtesy Khalid Mohammed) pic.twitter.com/RXIEUxCAlp — Rishi Kapoor (@chintskap) November 13, 2019 రిషీ కపూర్ పోస్ట్ చేసిన ఈ ఫోటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అద్భుతం రిషీజీ.. ఇది అరుదైన ఫోటో, ఇలాంటివి మరికొన్ని ఫోటోలు పోస్ట్ చేయండి’ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ‘మీరు చాలా ముద్దుగా ఉన్నారు. కొన్ని సార్లు మా అల్లుడిని ‘రిషీ కపూర్’ అని పిలుచుకుంటాము’ అని మరో అభిమాని కామెంట్ చేశారు. Premiere of Doosara Aadmi. pic.twitter.com/kzyhqZtg5S — Rishi Kapoor (@chintskap) October 14, 2019 రిషీ కపూర్ తాను నటించిన ‘దూస్రా ఆద్మీ’ విడుదలై 42 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆ సినిమాకి సంబంధించిన అలనాటి ఓ ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఆ ఫోటోకి ‘ప్రీమియర్ ఆఫ్ దూస్రా ఆద్మీ’ అని కామెంట్ పెట్టారు. ఈ ఫోటోలో రిషీ కపూర్, యాశ్‌చోప్రా, దర్శకుడు రమోశ్ తల్వార్ ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఈ సినిమా 1977 అక్టోబర్14న విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు 11 నెలల తర్వాత రిషీ కపూర్ కేన్సర్ చికిత్స పూర్తి చేసుకొని న్యూయార్క్ నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. -
గరిటె తిప్పుతున్న బోనీకపూర్.. వెనుక జాన్వీ..
బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్‌కు తన తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ అంటే ఎనలేని ప్రేమ. తండ్రే తన బలమని చెప్తుంది జాన్వీ. అయితే నాన్నకూచి అయిన జాన్వీ బోనీని ఎంతగానో మిస్ అవుతుందట. ఈ మేరకు కొన్ని అందమైన జ్ఞాపకాలను మిగిల్చిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో భాగంగా.. నటనలో శిక్షణ తీసుకుంటున్న మూడో కుమార్తె ఖుషీతో కలిసి బోనీకపూర్ న్యూయార్క్‌లో ఉంటున్నారు. వీరిద్దరూ అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ దిగిన ఫొటోలను జాన్వీ అభిమానులతో పంచుకుంది. నాన్న పక్కన తను లేనన్న బాధతో మిస్ అవుతున్నానంటూ క్యాప్షన్ జోడించింంది. దీంతోపాటు చంఢీఘడ్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి పంజాబీ ఆహారాన్ని ఆస్వాదిస్తున్న ఫొటోను పంచుకుంది. అన్నింటికన్నా మించి తండ్రితో కలిసి దిగిన చిన్ననాటి ఫొటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో తండ్రి బోనీకపూర్ వంటగదిలో గరిటె తిప్పుతుంటే వెనక నుంచి జాన్వీ, ఖుషీ, వీరి స్నేహితురాలు అతన్ని హత్తుకున్నారు. ఈ ఫొటో చూసినవారంతా వారి మధ్య ఉన్న ప్రేమకు ఫిదా అవుతున్నారు. కాగా సోమవారం 64వ పడిలోకి అడుగుపెట్టిన తండ్రికి జాన్వీ కపూర్ భావోద్వేగ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. ధడక్ సినిమాతో తెరంగ్రేటం చేసిన జాన్వీ ప్రస్తుతం ‘దోస్తానా 2’ షూటింగ్లో బిజీగా ఉంది. (చదవండి: తండ్రికి జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్టు) -
తండ్రికి జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్టు
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నేటితో 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు శుభకాంక్షలు తెలిపారు. కాగా, దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన తండ్రికి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఆమె భావోద్వేగ ఇన్‌స్టా పోస్టు అన్నిటిలో ప్రత్యేకంగా నిలిచింది. ‘హ్యాపీ బర్త్ డే పప్పా, నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతుంటావు. ఇంత ఎనర్జీ ఎలా సాధ్యమని. దానికి కారణం మీరే. మీరే నా బలం పప్పా. ప్రతిరోజూ, ప్రతిక్షణం మిమ్మల్ని చూసే ఎలా ఉండాలో నేర్చుకుంటాను. ప్రతి క్షణం మీరు మాపై కురిపించే ప్రేమ, మీరు కొన్నిసార్లు ఇబ్బందులకు గురైనా.. తిరిగి అంతకు రెట్టింపు వేగంతో మరింత శక్తిమంతంగా పుంజుకోవడం.. మీరు కృంగిపోతున్న సమయంలో కూడా మేం పడిపోకుండా మీ మాటలతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తావు.. ఈ లోకంలో నీ కంటే ఉత్తమమైన వ్యక్తిని చూడలేదు. లవ్ యూ పప్పా’. అంటూ జాన్వీ పోస్ట్ సాగింది. అలాగే ‘నా ప్రతి విషయంలో స్నేహితుడిలా సలహాలు ఇస్తూ... నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ఎల్లప్పుడు వెన్నంటే ఉండే మీరు ఉత్తమమైనా తండ్రే కాదు.. ఓ మంచి స్నేహితుడు కూడా.. ఐ లవ్ యూ డాడీ’ అంటూ హృదయాన్ని తాకే సందేశంతో బోనీ కపూర్‌కు జాన్వీ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. View this post on Instagram Happy Birthday Papa ❤️ you always ask me where I get my energy from papa and I get it from you. Seeing you wake up and doing what you love with more passion every single day, seeing you fall but get up even stronger, seeing you broken but giving us and everyone else strength when they need it. You’re the best man I’ll ever know. You inspire me, encourage me, you’ve always been the best dad but now you’re my best friend. I love you. I’m going to make you so proud. You deserve all the happiness in the world and I hope and pray this year is full of just that in abundance for you. A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Nov 10, 2019 at 3:02pm PST -
హాలీవుడ్ నటుడితో పోటీపడుతున్న కఫూర్ ఫ్యామిలీ
ఢిల్లీ : బోనీ కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ నటుడు జార్జ్ క్లూనీ పాత్రకు గట్టి పోటీ ఇస్తున్నారట ! అదేంటి.. కపూర్ ఫ్యామిలీ హాలీవుడ్ సినిమాలో నటించడంమేంటని అనుకుంటున్నారా.. అయితే ఈ వార్తను మొత్తం చదివితే విషయం మీకే అర్థమవుతుంది. జార్జ్ క్లూనీ 2009లో తాను నటించిన 'అప్ ఇన్‌ది ఎయిర్' సినిమాలో చివరి వరకు తన ఇంట్లో కన్నా విమాన ప్రయాణాల్లోనే ఎక్కువగా కనిపిస్తాడు. అదే సంఘటన గురువారం కపూర్ ఫ్యామిలీలోనూ చోటుచేసుకుంది. గురువారం కపూర్ ఫ్యామిలీ ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమవుతూ విమానంలో ప్రయాణం చేశారు. ఇదే విషయాన్ని తాజాగా అన్షులాకపూర్ వారి కుటుంబసభ్యులు వాట్సప్ గ్రూప్‌లో చేసిన చాట్‌ను స్క్రీన్‌షాట్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో తన ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్‌లో ఎవరు ఎక్కడ ఉన్నారని చేసిన సంభాషణను పంచుకున్నారు. ప్రస్తుతం దోస్తానా 2 షూటింగ్లో బిజీగా ఉన్న జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్, సోదరుడు అర్జున్ కపూర్లకు తాను అమృత్‌సర్‌లో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు మెసేజ్ చేశారు. అదే విధంగా అన్షులా కపూర్ కూడా ' నేను ఇప్పుడే ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరాను' అంటూ మెసేజ్ పెట్టారు. ఇదంతా గమనించిన బోనీ కపూర్ తాను కూడా ఇప్పుడే చెన్నెనుంచి ముంబయికి బయలుదేరడానికి ఎయిర్పోర్ట్ లాంజ్‌లో వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో అన్షులా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ' ఓ మైగాడ్ ! ఏంటో ఈరోజు అందరం విమానాల్లోనే ప్రయాణం చేస్తున్నామా' అంటూ సంతోషం వ్యక్తం చేసింది. వీరి సంభాషణను స్ర్కీన్ షాట్ రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'మాకు డాడ్ కిడ్స్ అనే పేరుతో వాట్సప్ గ్రూఫ్ ఒకటి ఉంది. ఆ గ్రూపులో నాతో పాటు అన్షులా, అర్జున్ కపూర్, ఖుషీ కపూర్, మా నాన్న సభ్యులుగా ఉన్నాము. మేము ప్రతీ విషయాన్ని ఒక మొమొరీగా గుర్తుంచుకునేందుకు ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటామని' మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో జాన్వీ కపూర్ వెల్లడించారు. -
సెంటిమెంట్‌ను వదలని అజిత్
తమిళసినిమా: సెంటిమెంట్ అనేది అన్ని రంగాల్లోని వారికి ఉంటుంది. అయితే సినిమా వాళ్లకు కాస్ల ఎక్కువ అంటారు. మరి నటుడు అజిత్‌కు అలాంటి సెంటిమెంట్ ఉందో, లేదో గానీ, ఇటీవల ఆయన చిత్రాల పేర్లను చూస్తుంటే ఆయనికీ సెంటిమెంట్ ఉందని భావించాల్సి వస్తోంది. అజిత్ నటించిన వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం చిత్రాల టైటిల్స్ అన్నీ వీ తోనే ప్రారంభమయ్యాయి. మంచి విజయాలను అందుకున్నాయి. కాగా తన కొత్త చిత్ర టైటిల్ వీతోనే మొదలవడం విశేషం. అవును విశ్వాసం, నేర్కొండపార్వై వంటి సంచలన విజయం సాధించిన చిత్రాల తరువాత అజిత్ నటిస్తున్న తాజా చిత్రం శుక్రవారం సాయంత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇది నేర్కొండ పార్వై చిత్ర నిర్మాత బోనీకపూర్, దర్శకుడు హెచ్.వినోద్, నటుడు అజిత్ కాంబినేషన్లోనే రూపొందనుండడం విశేషం. నేర్కొండ పార్వై చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నిర్మాత, నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ వెంటనే మరో చిత్రం చేయడం, అదీ అజిత్ హీరోగానే నిర్మించడం విశేషం. ఇకపోతే ఇది నటుడు అజిత్‌కు 60వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయన పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇందులో ఆయనకు జంటగా నటి నయనతార నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.అయితే ఈ విషయాన్ని చిత్ర వర్గాలు ప్రకటించలేదు. కానీ చిత్ర టైటిల్ మాత్రం ప్రారంభం రోజునే వెల్ల డించడం మరో విశేషం. ఈ చిత్రానికి వలిమై అనే టైటిల్‌ను నిర్ణయించారు. వలిమై అంటే బాధ అని అర్థం. కాగా అజిత్ చిత్ర టైటిల్ కోసం ఆయన అభిమానులు నిర్మాణం చివరి వరకూ ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఈ సారి ముందుగానే ప్రకటించడంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీనికి నీరవ్‌షా ఛాయాగ్రహణం, యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వలిమై చిత్ర షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి 2020 సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు ప్రణాళికను రచించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. -
మళ్లీ జంటగా..
బిల్లా, ఏగన్, విశ్వాసం.. ఈ మూడు చిత్రాల్లోనూ జంటగా నటించారు అజిత్, నయనతార. ‘బెస్ట్ పెయిర్’ అని కూడా అనిపించుకున్నారు. ఇప్పుడు నాలుగోసారి ఈ జంట తెరపై కనిపించే అవకాశం ఉందని సమాచారం. అజిత్ 60వ సినిమా త్వరలో ఆరంభం కానుంది. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార అయితే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. నయనతారను సంప్రదించారని కూడా సమాచారం. మరి.. అజిత్ 60లో నయనతార ఉంటారా? లేక వేరే కథానాయిక నటిస్తారా? జస్ట్ కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. -
మధుర జ్ఞాపకాన్ని షేర్ చేసిన జాన్వీ
ఒకే ఒక్క సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు అతిలోక సుందరి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ కపూర్. ధడక్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే తన సినిమాలకు, కుటుంబానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటారు జాన్వీ. ఈ క్రమంలో శనివారం జాన్వీ తన కుటుంబానికి చెందిన గడిపిన మధుర జ్ఞాపకాలను మరోసారి తన అభిమానులతో పంచుకున్నారు. తన తల్లి శ్రీదేవి, తండ్రి బోనీ కపూర్ ఇద్దరు కలిసి ఉన్న ఒకప్పటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలో శ్రీదేవి.. భర్త బోనీకపూర్ బుగ్గపై ప్రేమతో ముద్దు పెడుతూ కన్పిస్తున్నారు. కాగా వివిధ భాషల్లో నటించిన శ్రీదేవి ప్రతీ పాత్రలో ఒదిగిపోయి అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన సంగతి తెలిసిందే. వెండితెరపై చాలాకాలం ఓ వెలుగు వెలిగిన ఈ అందాల తార... ఇంగ్లీష్ వింగ్లీష్ సినిమా సెంకడ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారు. అయితే దురదృష్టవశాత్తు 2018 ఫిబ్రవరి 24న దుబాయిలోని ఓ హోటల్లో శ్రీదేవి అనూహ్యంగా మరణించిన విషయం తెలిసిందే. -
సెలవుల్లోనూ వర్కవుట్
‘‘ఎక్సర్సైజ్లకు సెలవు ఇవ్వకండి.. బద్దకించకుండా వర్కవుట్లు చేయండి.. చక్కగా ఉండండి’’ అంటున్నారు జాన్వీ కపూర్. ‘ధడక్’ చిత్రంతో కథానాయిక అయిన జాన్వీ వరుసగా సినిమాలు సైన్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఎంతసేపూ పని అంటే బోరే కదా.. అందుకే తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో కలిసి విహార యాత్ర ప్లాన్ చేసుకున్నారు. ఈ ముగ్గురూ న్యూయార్క్ చెక్కేశారు. చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. షూటింగ్‌లకైతే సెలవు చెప్పారు కానీ వ్యాయామాలకు మాత్రం ‘నో హాలిడే’ అన్నారు జాన్వీ. వెకేషన్లో కూడా వర్కవుట్లు చేస్తున్నారు. న్యూయార్క్‌లోని జిమ్‌లో వర్కవుట్లు చేస్తున్న ఓ వీడియోను జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫిట్నెస్ మీద ఈ బ్యూటీకి ఎంత శ్రద్ధో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శ్రీదేవి కూడా అంతే. ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. 50 ఏళ్ల వయసులోనూ మంచి శరీరాకృతితో ఉండేవారామె. కూతురికి కూడా తల్లిలా ఫిట్నెస్ అంటే చాలా ఇంట్రస్ట్ అని చెప్పొచ్చు. ఇక సినిమాల విషయానికొస్తే, తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితం ఆధారంగా రూపొందిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్’లో టైటిల్ రోల్ చేశారు జాన్వీ. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇక వెకేషన్ నుంచి ముంబై తిరిగి రాగానే ‘దోస్తానా 2’ షూటింగ్లో పాల్గొంటారు. -
డీల్ ఓకే
తెలుగులో అగ్రనిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. హిందీలో బోనీ కపూర్‌కి ఆ పేరు ఉంది. ఈ ఇద్దరూ కలిసి తెలుగు ‘ఎఫ్ 2’ని హిందీలో నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో íసినిమా నిర్మించడానికి డీల్ ఓకే చేశారు. గత ఏడాది హిందీలో విడుదలైన ‘బదాయి హో’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు. ఈ సినిమా దక్షిణాది హక్కులను బోనీ కపూర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని తాజా సమచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజుతో కలిసి నిర్మిస్తారు బోనీ. ఈ సినిమాలో హీరో పాత్రకోసం సంప్రదింపులు మొదలుపెట్టిందట టీమ్. నాగచైతన్యను హీరోగా అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది. -
ఖుషీ కపూర్‌ని సాగనంపుతూ.. బోనీ ఉద్వేగం
అతిలోక సుందరి, దివంగత బాలీవుడ్ నటి శ్రీదేవి కుటుంబానికి సంబంధించిన ప్రతీవార్త వైరల్‌గా మారుతుంది. ముఖ్యంగా శ్రీదేవి ముద్దుల కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లకు సంబంధించిన వార్తలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తికనబరుస్తుంటారు. శ్రీదేవి మరణం తరువాత వీరికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తండ్రి బోనీ కపూర్ కూడా తరుచూ కుమార్తెలతో కలిసి పబ్లిక్ ఫంక్షన్స్‌కు వస్తుండటంతో మీడియా వారికి కావాల్సినంత కవరేజ్ ఇస్తోంది. ఇప్పటికే జాన్వీ వెండితెర అరంగేట్రం ఘనంగా జరిగింది. ఆమె లుక్స్, నటనకు అభిమానులు మంచి మార్కులే వేశారు. తాజాగా జాన్వీ చెల్లెలు, ఖుషీ కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా నటనలో శిక్షణ పొందేందుకు విదేశాలకు పయనమయ్యారు. అయితే చిన్న కూతురుని విదేశాలకు సాగనంపుతూ తండ్రి బోనీ కపూర్ ఉద్వేగానికి లోనయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆమెకు సెండాఫ్ ఇస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఖుషీ న్యూయార్క్ ఫిలిం అకాడమిలో యాక్టింగ్ కోర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. ఆమెకు వీడ్కోలు పలికేందుకు బోనీ తో పాటు.. ఆయన తమ్ముడి( సంజయ్ కపూర్) భార్య మహీప్ కపూర్, వారి కూతురు షానయా కపూర్లు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో వీరంతా కలిసి దిగిన సెల్పీ ఫోటోను మహీప్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కాగా ఖుషీ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘న్యూయార్క్ వెళ్లి యాక్టింగ్ నేర్చుకొని.. ఆ తర్వాత తనకు నచ్చిన వృత్తిని ఎంచుకుంటాని’ తెలిపారు. ఇటీవల జాన్వీ, ఖుషీలు సింగపూర్‌లో ఏర్పాటు చేసిన తన తల్లి శ్రీదేవి మైనపు బొమ్మను సందర్శించి, ఆ బొమ్మను తాకి ఉద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఖుషీ గతంలో మోడలింగ్ వైపు వెళ్తుందని బోని తెలిపారు. కానీ ప్రస్తుతం ఖుషీ మోడలింగ్ కంటే యాక్టింగ్పైనే ఎక్కువగా ఆసక్తి చూపుతోందని తెలుస్తోంది. ఇప్పటికే బోని పెద్ద కుమార్తె జాన్వి కపూర్, కొడుకు అర్జున్ కపూర్లు సినిమాలతో బిజీగా ఉన్నారు. అర్జున్ కపూర్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న‘పానిపట్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్.. గుంజన్ సక్సెస్ బయోపిక్‌లో నటిస్తున్నారు. -
‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’
బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ 2005లో నటించిన బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘నో ఎంట్రీ’. ఈ సినిమా విడుదలై సోమవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అనిల్ కపూర్ ఆ చిత్రంలో పాపులర్ సరదా సన్నివేశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సన్నివేశంలో అనిల్, ఫర్దీన్ ఖాన్‌కు పాజిటివ్‌గా ఉండమని సలహా ఇస్తుంటాడు.‘నా రక్తంలో సానుకూలత ప్రవహిస్తోంది, ఎందుకంటే నో ఎంట్రీ సినిమాకు 14 ఏళ్లు’ అనే క్యాప్షన్‌తో అనిల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో దీన్ని పోస్ట్ చేశాడు. దర్శకుడు అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఈ చిత్రంలో అనిల్ కపూర్, సల్మాన్ ఖాన్, ఫర్దీన్ ఖాన్లు హీరోలగా నటించగా.. బిపాస బసు, లారా దత్త, ఇషా డియోల్‌లు హీరోయిన్లుగా నటించారు. అదే విధంగా ఈ సినిమా నిర్మాత బోని కపూర్ కూడా ‘2005లో అత్యంత ఘన విజయం సాధించిన ‘నో ఎంట్రీ’కి నేటితో 14 ఏళ్లు! తొందరల్లోనే మనందరం ‘నో ఎంట్రీ2’ తో మళ్లీ కలవబోతున్నందుకు సంతోషం’ అంటూ తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘నో ఎంట్రీ2’ డైరెక్టర్ అనీస్ బాజ్మీకి, చిత్ర బృందానికి బోనీ ధన్యవాదాలు తెలిపాడు. ‘నో ఎంట్రీ’ని తెరకెక్కించిన దర్శకుడు అనీస్ బాజ్మీనే దాని సీక్వెల్‌ను కూడా తెరకెక్కించనున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. B-eing positive runs in my blood 😂 #14YearsOfNoEntry @BazmeeAnees pic.twitter.com/jGSOx9Kl39 — Anil Kapoor (@AnilKapoor) August 27, 2019 -
‘ఆరేళ్లు పెద్దవాడు...అస్సలు చర్చించను’
తనకు తల్లైనా, తండ్రైనా అన్నీ అన్నయ్యేనని బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆపన్నులకు హస్తం అందించేందుకు అన్షులా ఇటీవలే ‘ఫ్యాన్‌కైండ్’ అనే ఆన్లైన్ ఫండ్‌రైజింగ్ వెంచర్‌ను ప్రారంభించారు. చారిటీ కార్యక్రమాల గురించి చర్చించుకునేందుకు సెలబ్రిటీలు, సామాన్యుల మధ్య ‘ఫ్యాన్‌కైండ్’ వారధిగా ఉంటుంది. ఈ క్రమంలో ఓ మీడియా సమావేశానికి హాజరైన ఆమెకు తన అన్న అర్జున్ కపూర్ గురించి వివిధ ప్రశ్నలు ఎదురయ్యాయి. అన్నింటికీ ఓపికగా సమాధానం ఇచ్చిన అన్షులా.. అర్జున్ రిలేషన్షిప్ స్టేటస్ గురించి అడగగానే ఒకింత అసహానికి గురయ్యారు. మలైకాతో అర్జున్ను ముడిపెట్టి మాట్లాడటం తనకు ఇబ్బంది కలిగిస్తుందని పేర్కొన్నారు. వారిద్దరి గురించి వస్తున్న వదంతుల గురించి తానేమీ మాట్లాడదలచుకోవడం లేదని చెప్పారు. తన కంటే ఆరేళ్లు పెద్దవాడు, తండ్రిలా చూసుకునే అన్నతో ఇటువంటి విషయాలు చర్చించనని చెప్పుకొచ్చారు. కాగా అర్జున్ కపూర్, అన్షులా.. నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య మోనా పిల్లలు అన్న సంగతి తెలిసిందే. శ్రీదేవితో ప్రేమలో పడిన తర్వాత మోనాకు విడాకులిచ్చిన బోనీ.. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి అర్జున్, అతడి చెల్లి అన్షులా తండ్రికి దూరంగానే ఉన్నారు. అయితే శ్రీదేవి మరణానంతరం తండ్రి, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలతో కలిసి పోయిన అర్జున్.. ప్రతీ విషయంలోనూ వారికి అండగా నిలుస్తున్నాడు. ఇక అర్జున్ కపూర్- మలైకా అరోరా త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. -
జాన్వీకపూర్‌తో దోస్తీ..
సినిమా: చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులారిటీని సంపాందించుకున్న నటి కీర్తీసురేశ్. మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసినా, కోలీవుడ్, టాలీవుడ్లోనే ఎక్కువ పేరు తెచ్చుకుంది. తమిళంలో తొలి చిత్రం ఇదు ఎన్న మాయం చిత్రం ఆశించిన విజయాన్ని అందించకపోయినా, ఆ తరువాత రజనీమురుగన్, రెమో చిత్రాలు మంచి విజయాన్ని అందించాయి. దీంతో విజయ్, విశాల్, విక్రమ్, ధనుష్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సొంతం చేసుకున్న కీర్తీసురేశ్ తన తల్లి కోరికను తీర్చేసింది. ఆమె తల్లి మేనక చాలా కాలం క్రితం రజనీకాంత్‌కు జంటగా నెట్రికన్ను చిత్రంలో నటించింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకోలేకపోయింది. అలా తన తల్లి సాధించలేనిది కీర్తీసురేశ్ సాధించిందనే చెప్పాలి. ఇక తెలుగులో నేను శైలజా వంటి కొన్ని హిట్ చిత్రాల్లో నటించినా మహానటి చిత్రం నటిగా కీర్తీసురేశ్ స్థాయిని ఒక్క సారిగా పెంచేసింది. ఇలా తమిళం, తెలుగు స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఒక్కసారిగా తెరమరుగైపోయింది. కారణం బాలీవుడ్ మోహమే నంటున్నారు సినీ వర్గాలు. హిందీలో నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం కోసం కసరత్తులు చేసి చాలా స్లిమ్‌గా తయారైంది. ఇంకా చెప్పాలంటే మేకప్ లేకుండా ఇది కీర్తీనా అని ఆశ్చర్యపడేంతగా సన్నపడింది. మరో విషయం ఏమిటంటే ఇటీవల ఒక తెలుగు చిత్రాన్ని తిరష్కరించిందనే ప్రచారం జోరందకుంది. కారణం కథా పాత్ర నచ్చలేదని సాకు చెబుతున్నా, హిందీలో నిలదొక్కుకోవాలన్న ఆశతోనే కీర్తీసురేశ్ దక్షిణాది చిత్రాలపై ఆసక్తి కనబరచడం లేదంటున్నారు సినీ వర్గాలు. అంతే కాదు శ్రీదేవి కూతురు జాన్వీకపూర్‌తో బాగా దోస్తీ కుదిరిందట. ఎక్కువగా ముంబైలోనే మకాం పెడుతుందనే ప్రచారం జరుగుతోంది. తమిళంలో అసలు ఈ బ్యూటీ పేరే వినిపించడం లేదు. ఇక్కడ ఒక్క అవకాశం కూడా లేదు. హిందీ చిత్రం పూర్తి అయ్యే వరకూ దక్షిణాది వైపు దృష్టి సారించే అవకాశం ఉండదనుకుంటా. అక్కడ అటూ ఇటూ అయితే ఆ తరువాత ఇక్కడ కీర్తీసురేశ్‌ను పట్టించుకుంటారా అన్నది ఆలోచించాల్సిన విషయమే. -
కల్కీ కిక్
స్పెషల్ సాంగ్స్ మాస్ ఆడియన్స్‌కు స్పెషల్ కిక్ ఇస్తాయి. అందులోని డ్యాన్స్ మూమెంట్స్ అదిరిపోయేలా ఉంటే థియేటర్స్‌లో ఆడియన్స్ ఉత్సాహం ఇంకా పెరుగుతుంది. ఈ మ్యాజిక్‌నే క్రియేట్ చేయడానికి అజిత్ అండ్ టీమ్ ప్లాన్ వేసింది. బాలీవుడ్ స్పెషల్ సాంగ్స్ ఫేమ్ కల్కీ కొచ్లిన్‌తో స్పెషల్ సాంగ్‌ను షూట్ చేసింది ‘నేర్కొండ పార్వై’ టీమ్. అజిత్, శ్రద్ధాశ్రీనాథ్, అభిరామి వెంకటాచలం, ఆండ్రియా టరియాంగ్ ప్రధాన పాత్రల్లో విద్యాబాలన్ కీలక పాత్ర చేసిన చిత్రం ‘నేర్కొండ పార్వై’. బోనీ కపూర్ నిర్మించారు. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’ చిత్రానికి ఇది తమిళ రీమేక్. ఈ సినిమాలో కల్కీతో ఓ స్పెషల్ సాంగ్ చిత్రీకరించారు. ‘‘ఇదొక పెప్పీ సాంగ్. ఇందులో క్యాప్ అండ్ హిప్పీ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కల్కీనే కరెక్ట్ అనిపించింది. ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేశారు’’ అన్నారు బోనీ. ఈ సినిమాలో అజిత్ భార్యగా విద్యాబాలన్ నటించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వేసవిలో రిలీజ్ కానుంది. -
మా బలం నువ్వే..లవ్ యూ : జాన్వీ కపూర్
అర్జున్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అన్నయ్య అర్జున్ కపూర్, సోదరిలు అన్షులా, ఖుషీలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన జాన్వీ...’ మా ధైర్యానికి కారణం నువ్వే.. లవ్ యూ.. హ్యాపీ బర్త్‌డే అర్జున్ అన్నయ్య’ అంటూ విషెస్ తెలిపారు. శ్రీదేవి మరణానంతరం ఆ బాధ నుంచి కోలుకునేందుకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్లు తమ తండ్రి బోనీ కపూర్, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు ప్రతీ విషయంలో అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. జాన్వీ కూడా.. ఒక ఇంటర్వ్యూలో ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్ కపూర్, సోదరి అన్షులా కపూర్ తమని చాలా బాగా చూసుకుంటున్నారంటూ’ చెప్పారు. ప్రస్తుతం బోనీ కపూర్ పిల్లలు నలుగురూ ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు అండగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. You are the reason for our strength. Love you, happy birthday Arjun bhaiya ❤️ A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jun 25, 2018 at 12:49pm PDT -
అమ్మ కోరిక అదే : హీరో
లెజెండరీ నటి శ్రీదేవి మరణానంతరం తొలిసారి అర్జున్ కపూర్ తన తల్లి మోనా శౌరీ కపూర్ గురించి స్పందించారు. సవతి తల్లి మరణానంతరం.. ఆ బాధ నుంచి కోలుకునేందుకు అర్జున్ కపూర్, అన్షులా కపూర్లు తమ తండ్రి బోనీకపూర్, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు ప్రతీ విషయంలో అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీదేవి చనిపోయినపుడు షూటింగ్స్ క్యాన్సిల్ చేసుకొని మరీ కొడుకుగా, అన్నగా బాధ్యతలు నిర్వర్తించారు అర్జున్ కపూర్. ప్రస్తుతం బోనీ కపూర్ పిల్లలు నలుగురు ఒకరిపై ఒకరు ప్రేమాభిమానాలు కురిపించుకుంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ కూడా ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్ కపూర్, సోదరి అన్షులా కపూర్ తమని చాలా బాగా చూసుకుంటున్నారని’ చెప్పారు. అయితే అర్జున్, అన్షులా గురించి ప్రస్తావిస్తూ ఓ నెటిజన్.. ‘ అర్జున్, అన్షులా తల్లి మోనా శౌరీ పెంపకం చాలా గొప్పది. అందుకే వారు కష్టకాలంలో తమ తండ్రికి, సోదరిలకు అండగా నిలిచారు’ అంటూ ట్వీట్ చేశారు. అభిమాని ట్వీట్‌కు స్పందించిన అర్జున్ కపూర్.. ‘నేను, నా సోదరి అన్షులా మా జీవితంలోని ప్రతీ క్షణంలో మా అమ్మ మాతో ఉన్నట్టుగానే భావిస్తాం. మేము ఎల్లప్పుడూ మా తండ్రి పక్కనే ఉండాలని ఆమె కోరుకునేది. అలాగే జాన్వీ, ఖుషీలకు తోడుగా ఉండడం మరీ అంత గొప్ప విషయమేమీ కాదు. మా అమ్మ గురించి ఇంత మంచిగా మాట్లాడిన మీకు కృతఙ్ఞతలు. ఆమె మిమ్మల్ని దీవిస్తుంది’ అంటూ ఉద్వేగపూరిత ట్వీట్ చేశారు. Hey @aakanksha3131 , me & @anshulakapoor represent our mother every single second we live...she would expect us to have been standing next to our father no matter what n be there for Janhvi & Khushi... thank you for ur kind words bout our mother...as she would say god bless u... https://t.co/xOBQgDE0pP — Arjun Kapoor (@arjunk26) June 4, 2018