మా బలం నువ్వే..లవ్‌ యూ : జాన్వీ కపూర్‌ | Janhvi Kapoor Wishing Arjun Kapoor On His Birthday | Sakshi
Sakshi News home page

మా బలం నువ్వే..లవ్‌ యూ : జాన్వీ కపూర్‌

Published Tue, Jun 26 2018 3:09 PM | Last Updated on Tue, Jun 26 2018 7:37 PM

Janhvi Kapoor Wishing Arjun Kapoor On His Birthday - Sakshi

ఖుషీ, అన్షులా, అర్జున్‌ కపూర్‌లతో జాన్వీ కపూర్‌ (ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటో)

అర్జున్‌ కపూర్‌ పుట్టిన రోజు సందర్భంగా జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. అన్నయ్య అర్జున్‌ కపూర్‌, సోదరిలు అన్షులా, ఖుషీలతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసిన జాన్వీ...’ ​మా ధైర్యానికి కారణం నువ్వే.. లవ్‌ యూ.. హ్యాపీ బర్త్‌డే అర్జున్‌ అన్నయ్య’ అంటూ విషెస్‌ తెలిపారు.

శ్రీదేవి మరణానంతరం ఆ బాధ నుంచి కోలుకునేందుకు అర్జున్‌ కపూర్‌, అన్షులా కపూర్‌లు తమ తండ్రి బోనీ కపూర్‌, చెల్లెళ్లు జాన్వీ, ఖుషీలకు ప్రతీ విషయంలో అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. జాన్వీ కూడా.. ఒక ఇంటర్వ్యూలో ‘అమ్మ మరణించిన తర్వాత మా కుటుంబమంతా తిరిగి ఒక్కటయ్యింది. అన్నయ్య అర్జున్‌ కపూర్‌, సోదరి అన్షులా కపూర్‌ తమని చాలా బాగా చూసుకుంటున్నారంటూ’  చెప్పారు. ప్రస్తుతం బోనీ కపూర్‌ పిల్లలు నలుగురూ ప్రతీ విషయంలో ఒకరికి ఒకరు అండగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

You are the reason for our strength. Love you, happy birthday Arjun bhaiya ❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement