బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ నేటితో 64వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు శుభకాంక్షలు తెలిపారు. కాగా, దివంగత నటి శ్రీదేవి, బోనీ కపూర్ పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ తన తండ్రికి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఆమె భావోద్వేగ ఇన్‌స్టా పోస్టు అన్నిటిలో ప్రత్యేకంగా నిలిచింది. ‘హ్యాపీ బర్త్ డే పప్పా, నువ్వు నన్ను ఎప్పుడూ అడుగుతుంటావు. ఇంత ఎనర్జీ ఎలా సాధ్యమని. దానికి కారణం మీరే. మీరే నా బలం పప్పా. ప్రతిరోజూ, ప్రతిక్షణం మిమ్మల్ని చూసే ఎలా ఉండాలో నేర్చుకుంటాను.
ప్రతి క్షణం మీరు మాపై కురిపించే ప్రేమ, మీరు కొన్నిసార్లు ఇబ్బందులకు గురైనా.. తిరిగి అంతకు రెట్టింపు వేగంతో మరింత శక్తిమంతంగా పుంజుకోవడం.. మీరు కృంగిపోతున్న సమయంలో కూడా మేం పడిపోకుండా మీ మాటలతో బలాన్ని, ధైర్యాన్ని ఇస్తావు.. ఈ లోకంలో నీ కంటే ఉత్తమమైన వ్యక్తిని చూడలేదు. లవ్ యూ పప్పా’. అంటూ జాన్వీ పోస్ట్ సాగింది. అలాగే ‘నా ప్రతి విషయంలో స్నేహితుడిలా సలహాలు ఇస్తూ... నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ, ఎల్లప్పుడు వెన్నంటే ఉండే మీరు ఉత్తమమైనా తండ్రే కాదు.. ఓ మంచి స్నేహితుడు కూడా.. ఐ లవ్ యూ డాడీ’ అంటూ హృదయాన్ని తాకే సందేశంతో బోనీ కపూర్‌కు జాన్వీ పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment