Covid 19: Ajith Kumar Valimai Movie Postponed Due To Coronavirus - Sakshi
Sakshi News home page

Ajith Valimai Movie: కరోనా ఎఫెక్ట్‌.. మరో భారీ బడ్జెట్‌ చిత్రం వాయిదా

Published Fri, Jan 7 2022 8:58 AM | Last Updated on Sat, Jan 29 2022 10:40 AM

Ajith Kumar Valimai Movie Postponed Due To Coronavirus - Sakshi

Ajith Kumar Valimai Postponed Due To Covid-19, Boney Kapoor Confirms: ఈ సంక్రాంతికి సందడి చేస్తాయనుకున్న స్టార్‌ హీరోలు, భారీ బడ్జెట్‌ చిత్రాలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌, రాధేశ్యామ్‌, భీమ్లానాయక్‌ వంటి సినిమాలు వాయిదా పడగా.. తాజాగా అజిత్‌ ‘వలీమై’ కూడా వాయిదా పడింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. అజిత్‌ హీరోగా హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో ‘వలీమై’ తెరకెక్కింది. సంక్రాంతికి జనవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమాను కరోనా నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

చదవండి: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు, దర్శకుడు ఎవరంటే..

వలిమై నిర్మాత బోణి కపూర్‌ ట్వీట్‌ చేస్తూ.. రోజురోజు కరోనా, ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని చెప్పుకొచ్చింది. ‘ప్రేక్షకులు, అభిమానులు మా సంతోషానికి కారణం. క్లిష్ట పరిస్థితుల్లో వారు చూపిన సహకారం, ఎల్లలు లేని ప్రేమాభిమానాలు వల్లే ఈ డ్రీమ్‌ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశాం. వాళ్లంతా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాహంగా థియేటర్స్‌లో సినిమా చూడాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రేక్షకుల భద్రత కూడా ముఖ్యమే. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.

చదవండి: ‘పుష్ప’ ఓటీటీ రిలీజ్‌కు అమెజాన్‌ ఒప్పందం ఎంతో తెలుసా? షాకవ్వాల్సిందే..

దీంతో ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి.ఈ నేపథ్యంలో పరిస్థితులు చక్కబడే వరకూ మన చిత్రం ‘వలీమై’ విడుదలను వాయిదా వేస్తున్నాం. వ్యాక్సిన్‌ వేయించుకోండి. మాస్క్‌ ధరించండి. జాగ్రత్తగా ఉండండి. త్వరలోనే మళ్లీ థియేటర్స్‌లో కలుద్దాం’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా భారీ బడ్జెట్‌తో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో అజిత్‌ సరసన బాలీవుడ్‌ నటి హ్యూమాఖురేషి నటిస్తోంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement