రాజా సాబ్‌ వాయిదా? | Prabhas Rajasaab gets postponed | Sakshi
Sakshi News home page

రాజా సాబ్‌ వాయిదా?

Published Sun, Jan 12 2025 2:49 AM | Last Updated on Sun, Jan 12 2025 2:49 AM

Prabhas Rajasaab gets postponed

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ప్రస్తుత చిత్రాల్లో ‘రాజా సాబ్‌’ ఒకటి. ఈ హారర్‌ కామెడీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ‘రాజా సాబ్‌’ సినిమాను ఏప్రిల్‌ 10న రిలీజ్‌ చేయనున్నట్లుగా, చిత్రయూనిట్‌ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కావడం లేదని, కొత్త విడుదల తేదీపై త్వరలోనే చిత్రయూనిట్‌ ఓ ప్రకటన చేయనుందని తెలిసింది. ఈ సినిమాకు తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ సంక్రాంతి సందర్భంగా ‘రాజా సాబ్‌’ సినిమాకు చెందిన ఓ అప్‌డేట్‌ని ఇవ్వడానికి యూనిట్‌ సన్నాహాలు చేస్తోందట. బహుశా ఈ మూవీ నుంచి కొత్త పోస్టర్‌ రావొచ్చని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement