
శ్రీదేవి, బోని కపూర్ (పాత ఫొటో)
ముంబై : అందానికి నిర్వచనం.. అభినయానికి చిరునామా.. శ్రీదేవి. ప్రేక్షకుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆ దేవకన్య జీవితం ఆధారంగా.. ఆమె భర్త బోనీ కపూర్ డాక్యుమెంటరీ రూపొందించేందుకు సిద్ధమయ్యారట. శ్రీదేవి బయోపిక్ కోసం ‘శ్రీ, శ్రీదేవి, శ్రీ మామ్’ అనే మూడు టైటిళ్లను కూడా ఆయన రిజిస్టర్ చేయించారని ఓ జాతీయ మీడియా పేర్కొంది.
అంతేకాకుండా శ్రీదేవి నటించిన చల్‌బాజ్, రూప్ కీ రాణీ చోరోంకా రాజా, జాన్‌బాజ్, మిస్టర్ ఇండియా సినిమా పేర్లను కూడా బోనీ కపూర్ రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. ఈ డాక్యుమెంటరీ తెరక్కెక్కించేందుకు డైరెక్టర్ శేఖర్ కపూర్‌ను బోనీ సంప్రదించారట. అయితే ఈ విషయంపై బోనీ కపూర్ నుంచి అధికారక ప్రకటన రావాల్సివుంది.
కొద్దిరోజుల క్రితం వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ శ్రీదేవి బయోపిక్ తీస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. అయితే దీనిపై స్పందించిన ఆర్జీవీ.. ఆమె జీవితంపై డాక్యుమెంటరీ తీయటం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment