
తెలుగులో అగ్రనిర్మాతల్లో ‘దిల్’ రాజు ఒకరు. హిందీలో బోనీ కపూర్‌కి ఆ పేరు ఉంది. ఈ ఇద్దరూ కలిసి తెలుగు ‘ఎఫ్ 2’ని హిందీలో నిర్మించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో íసినిమా నిర్మించడానికి డీల్ ఓకే చేశారు. గత ఏడాది హిందీలో విడుదలైన ‘బదాయి హో’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించారు.
ఈ సినిమా దక్షిణాది హక్కులను బోనీ కపూర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు రీమేక్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని తాజా సమచారం. ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజుతో కలిసి నిర్మిస్తారు బోనీ. ఈ సినిమాలో హీరో పాత్రకోసం సంప్రదింపులు మొదలుపెట్టిందట టీమ్. నాగచైతన్యను హీరోగా అనుకుంటున్నారనే వార్త ప్రచారంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment