శ్రీదేవికి కేన్స్‌ ఘన నివాళి | Sridevi To Be Honoured At Cannes | Sakshi
Sakshi News home page

శ్రీదేవికి కేన్స్‌ ఘన నివాళి

May 12 2018 7:22 PM | Updated on May 12 2018 8:19 PM

Sridevi To Be Honoured At Cannes - Sakshi

శ్రీదేవి (ఫైల్‌ ఫొటో)

లెజండరీ నటి, స్వర్గీయ శ్రీదేవికి కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఘన నివాళి అర్పించనుంది. ఈనెల 16న లే మెజెస్టిక్‌ బీచ్‌ ఇందుకు వేదిక కానుంది. శ్రీదేవికి సంస్మరణార్థం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో.. ఆమె అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాల్లోని విజువల్స్‌ను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌తో పాటు, ఆమె ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీ కపూర్‌లు హాజరవనున్నారు.

ఈ విషయాన్ని బోనీ కపూర్‌ ధ్రువీకరించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ..  ఐదు దశాబ్దాల పాటు తన అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన శ్రీదేవి ప్రతిభను ప్రపంచం గుర్తించినందుకు తాను సంతోషపడతానన్నారు. సినిమా రంగానికి  చేసిన సేవలకు గుర్తింపుగా శ్రీదేవికి ఈ పేరు ప్రఖ్యాతులు లభించాయని పేర్కొన్నారు. ఆమె భౌతికంగా తమ మధ్య లేకపోయడం బాధ​కు గురిచేస్తున్నా.. ఆమె అద్భుత నటన ద్వారా అందరి మనసులలో చోటు సంపాదించుకోవడం ఆనందాన్నిస్తుందన్నారు. మరణానంతరం జాతీయ ఉత్తమ నటిగా అవార్డు గెలుచుకున్న శ్రీదేవికి.. ప్రస్తుతం కేన్స్‌ నివాళి అర్పించడం ద్వారా మరోసారి ఆమె ప్రతిభకు గుర్తింపు దక్కినట్లు భావిస్తున్నాని ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement