Ajith Valimai Movie Leaked Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

అప్‌డేట్‌ ఇవ్వాల్సిందిగా చిత్ర బృందానికి వినతి

Published Thu, Dec 31 2020 1:28 PM | Last Updated on Thu, Dec 31 2020 2:29 PM

Ajiths Leaked Pic From Valimai Viral In  Social media - Sakshi

హైదరాబాద్‌ : తమిళ స్టార్‌ అజిత్‌ నటిస్తున్న వలిమై చిత్రంలోని ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మరింది. షూటింగ్‌లో భాగంగా కుటంబంతో కలిసి దిగినట్లుగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఫోటోలో అజిత్‌ కనిపిస్తున్న తీరు ఆయన అభిమానులను ఆందోళన కలిగిస్తుంది. ఈ ఫోటో కాస్త అస్పష్టంగా ఉండటంతో వెంటనే  క్లారిటీగా ఉన్న ఫోటోను రిలీజ్‌ చేయాల్సిందిగా అజిత్‌ అభిమానులు చిత్ర బృందాన్ని కోరారు. ఈ లేటెస్ట్‌ ఫోటోకి సంబంధించి ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వాల్సిందిగా విఙ్ఞప్తి చేస్తున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుంది.  (అజిత్‌తో ఉన్నది ఎవరో తెలుసా? )

ఈ ఏడాది మార్చిలోనే  షూటింగ్‌ ప్రారంభమైనా కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. తిరిగి ఎనిమిది నెలల అనంతరం అన్ని జాగ్రత్తల నడుమ శరవేగంగా షూటింగ్‌ జరుగుతుంది. శంకర్ రాజా ఈ చితత్రానికి సంగీతం అందిస్తుండగా బోనికపూర్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా అప్‌డేట్స్‌కి సంబంధించి ఫ్యాన్స్‌ నుంచి వస్తున్న వినతులపై బోనీ స్పందించారు. వలిమై సినిమా సెట్‌లో అజిత్‌ గాయపడ్డాడని, అయినప్పటికీ షూటింగ్‌ ఆలస్యం చేయ​కుండా షాట్‌ పూర్తిచేశాడని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే అప్‌డేట్‌ ప్రకటిస్తామని, అప్పటిదాకా వేచి ఉండాల్సిందిగా అజిత్‌ ఫ్యాన్స్‌ను కోరారు. నీరవ్‌ షా సినిమాటోగ్రఫి అందించిన ఈ సినిమాలో హుమా ఖురేషి, కార్తికేయ గుమ్మకొండ, యోగి బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. (జాంబిరెడ్డి ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్న ప్రభాస్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement