ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తన సోదరుడు, నటుడు సంజయ్ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఇవాళ (అక్టోబర్ 17) సంజయ్ 55వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన పుట్టిన రోజు వేడుకను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంజయ్‌తో కలిసి చేసిన బూమారాంగ్ వీడియోను అనిల్ షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. (చదవండి: మహేశ్ వర్సెస్ అనిల్)
‘నా ప్రియమైన సోదరుడు, మై ఫన్నీయర్ వెర్షన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే సంజయ్. లవ్ యూ’ అంటూ తన సోదరుడికి శుభాకాంక్షలు తెలిపాడు. నిన్న రాత్రి జరిగిన సంజయ్ బర్త్‌డే పార్టీకి సంబంధించిన పలు ఫొటోలను ఆయన భార్య మహీప్ కపూర్ పలు ఫొటోలను షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌డే హస్భెండ్ అంటూ షేర్ చేసిన ఈ ఫొటోల్లో బోణికపూర్, అర్జున్ కపూర్, మోహిత్, సందీప్ మార్వాలు ఉన్నారు. అది చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంజయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత సందర్శించా: అనిల్ కపూర్)
To the younger, brighter, fun-ner version of me... Happy Birthday #SanjayKapoor!
— Anil Kapoor (@AnilKapoor) October 17, 2020
When the situation allows, let's get away for a family vacation 🤗 Have a great day brother! Love you! pic.twitter.com/k7FZax4rsy
Comments
Please login to add a commentAdd a comment