టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా సరే హీరోయిన్‌గా రాణించాలంటే అందంతో పాటు ప్రతిభ కూడా చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా డ్యాన్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి. తమలోని డ్యాన్స్ స్కిల్స్‌కు పదును పెట్టుకోవడానికి.. మరింత మెరుగ్గా రాణించడానికి హీరోయిన్‌లు, అప్‌కమింగ్ యాక్టర్స్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా బెల్లీ డ్యాన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇప్పటికే పలువురు హీరోయిన్‌లు తమ బెల్లీ డ్యాన్స్ కోచింగ్ సెషన్‌లు, ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రశంసలు పొందుతుండగా.. తాజాగా ఈ జాబితాలోకి సంజయ్ కపూర్ కుమార్తె, అప్ కమింగ్ హీరోయిన్ షనయా కపూర్ చేరారు. ప్రస్తుతం ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పలువురు షనయా డ్యాన్స్ స్కిల్స్‌ని ప్రశంసించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా చేసిన కామెంట్ మాత్రం తెగ నవ్విస్తోంది. ఆ వివరాలు..
షనయా కపూర్ బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘మేం డ్యాన్స్ ఎలా నేర్చుకుంటామంటే ప్రాక్టీస్ సెషన్స్ విత్ బెస్ట్ సంజన ముత్రేజా అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు షనయా కపూర్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై బిగ్ బీ మనవరాలు నవ్య నవేలీ నందా కాస్త వెరైటీగా కామెంట్ చేశారు. ‘‘నీ డ్యాన్స్ చూస్తే.. నాకు కడుపునొప్పి వస్తుంది’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు నవ్య నవేలీ.
షనయా కపూర్ త్వరలో ధర్మ ప్రొడక్షన్స్ ప్రాజెక్టుతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆమె కరణ్ జోహార్ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (డీసీఏ) లో చేరారు. ఈ క్రమంలో మార్చిలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన ఆమె ఇలా రాసుకొచ్చారు: "ఈ రోజు చాలా కృతజ్ఞతతో హృదయపూర్వకంగా మేల్కొన్నాను! ఇక్కడ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ కుటుంబంతో ఒక గొప్ప ప్రయాణం ప్రారంభం కాబోతుంది. ఈ జూలై నాటికి నా మొదటి సినిమాను ప్రారంభిచబోతున్నాను’’ అని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment