Samantha posted a video of playing tug of war with her friends family - Sakshi
Sakshi News home page

Samantha: వీకెండ్‌ ఇలా అద్భుతంగా గడిచింది, వీడియో షేర్‌ చేసిన సామ్‌

Oct 19 2021 7:41 PM | Updated on Oct 20 2021 11:50 AM

Samantha Shares Video of She Playing Tug Of War With Her Friend Family - Sakshi

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్‌ మీడియాలో వరుసగా పోస్ట్స్‌ షేర్‌ చేస్తోంది. దీంతో ఆమె పోస్టులు సోషల్‌ మీడియా చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు బాధతో కూడిన, మూవీ ప్రమోషన్స్‌కు సంబంధించిన పోస్ట్స్‌ షేర్‌ చేసిన సామ్‌ తాజాగా ఓ ఫన్ని వీడియోను పంచుకుంది. తన స్నేహితురాలు, డిజైనర్‌, మోడల్‌ శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి టగ్‌ ఆఫ్‌ వార్‌ గేమ్‌ ఆడిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

చదవండి: విడాకుల అనంతరం దర్శకులకు కొత్త కండిషన్స్‌ పెడుతోన్న సామ్‌!

ఈ సందర్భంగా సామ్‌ ‘బ్యూటీఫుల్, క్రేజీ, ఫన్, ఈ వీకెండ్‌ అందంగా నా బెస్టీ శిల్పారెడ్డితో గడిచింది’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అలాగే ఓ గమనిక అంటూ ‘ఫిట్‌నెస్‌ అంటే పడిచచ్చే, పోటీతత్వానికి మారుపేరులా నిలిచే ఫ్యామిలీతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడకూడదు. మనం ఏ మాత్రం నెగ్గలేం సరికదా, మనకు దెబ్బలు కూడా తగులుతాయి’ అంటూ రాసుకొచ్చింది. కాగా విడాకులు అనంతరం సామ్‌ సంతోషంగా షేర్‌ చేసుకున్న మొదటి వీడియో ఇది. అయితే నాగ చైతన్యతో విడిపోయిన బాధ, ఒత్తిడిలో ఉన్న సమంతను దాని నుంచి బయట పడేసేందుకు శిల్పారెడ్డి సాయం చేస్తుందని, అప్పటి నుంచి సామ్‌కు ప్రతి విషయంలో తోడుగా నిలుస్తోందని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

చదవండి: విడాకుల తర్వాత సమంతకు మరో క్రేజీ ఆఫర్‌.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?

కాగా ఈ వీడియోలో తన స్నేహితురాలైన శిల్పారెడ్డి, సమంత ఒకవైపు ఉండి తాడు లాగుతుండగా, మరోవైపు నుంచి ల్పారెడ్డి భర్త, కుమారుడు తాడు లాగుతున్నారు. ఈ టగ్‌ ఆఫ్‌ వార్‌లో ఎంతో ఉత్సహంగా పాల్గొన్న సామ్‌, శిల్పాలు చివరికి ఒడిపోతారు. తాడు లాగే క్రమంలో సామ్‌ నెల మీద పడి బిగ్గరగా నవ్వుతూ కనిపించింది. ఈ వీడియోను చూసిన సమంత ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాం’ అంటూ తన పోస్ట్‌కు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement