Navya Naveli Nanda
-
స్టార్ హీరో మనవరాలు డేటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా గురించి బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. నవేలి గతేడాది 'వాట్ ది హెల్' అనే పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె లింగ సమానత్వం కోసం పోరాడుతున్నారు. కొత్తగా ఆమె పేరుతోనే నవేలి అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ షోలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తున్నారు. అయితే తాజాగా నవేలి నందాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. (: ఇది చదవండి: ఆ క్షణాలు అద్భుతం.. ఉపాసన ట్వీట్ వైరల్!) బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో నవ్య నవేలి నందాతో డేటింగ్లో ఉందంటూ బీటౌన్‌లో గాసిప్స్ గుప్పమంటున్నారు. ఈ జంట బుధవారం రాత్రి ముంబయిలోని ఓ థియేటర్ వద్ద జంటగా వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా.. నవేలి నందా అమితాబ్ -జయా బచ్చన్ కూతురు శ్వేతా బచ్చన్ కుమార్తె. సిద్ధాంత్ చతుర్వేది.. గల్లీ బాయ్ చిత్రంలో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. సిద్ధాంత్ చతుర్వేది చివరిసారిగా కత్రినా కైఫ్, ఇషాన్ ఖట్టర్‌లతో హారర్-కామెడీ చిత్రం ఫోన్ భూత్‌లో కనిపించారు. మరోవైపు ఆదర్శ్ గౌరవ్, అనన్య పాండేతో పాటు ఖో గయే హమ్ కహాన్, మాళవిక మోహనన్‌తో కలిసి యాక్షన్-థ్రిల్లర్ యుధ్రాతో సిద్ధాంత్ నటిస్తున్నారు. ( ఇది చదవండి: స్టార్ హీరోయిన్ కూతురు ఆడుకుంటున్న బ్యాగు ధరెంతో తెలుసా?) View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) -
సీరియస్ విషయాలే కాస్త సరదాగా!
పాడ్‌కాస్ట్‌లో కడుపుబ్బా నవ్వించే జోక్స్ వినవచ్చు. కమ్మని సంగీతం వినొచ్చు... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! అయితే మహిళల ఆధ్వర్యంలోని కొన్ని పాడ్‌కాస్ట్‌లు మాత్రం ఎన్నో విషయాలను నీళ్లు నమలకుండా చర్చిస్తున్నాయి. మన గురించి, సమాజం గురించి ఆలోచించడానికి అవసరమైన ప్రేరణ ఇస్తున్నాయి... సీరియస్ విషయాలను సీరియస్‌గానే మాట్లాడుకోవాలనే నిబంధన ఏమీ లేదు. నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా కూడా మాట్లాడవచ్చు. ఈ పాయింట్ దగ్గరే విజయం సాధించింది నవ్య నవేలీ నందా. నవ్య పాడ్‌కాస్ట్ ‘వాట్ ది హెల్ నవ్య’ శ్రోతలకు దగ్గర కావడానికి కారణం ‘సీరియస్ విషయాలైనా సరే కాస్త సరదాగా మాట్లాడుకుందాం’ అనే కాన్సెప్ట్. ఈ పాడ్‌కాస్ట్‌కి సంబంధించిన ఒక కార్యక్రమంలో మూడు తరాలకు చెందిన నవ్య నందా, శ్వేతా నందా, జయబచ్చన్లు జీవితానికి సంబంధించిన భిన్నమైన కోణాల గురించి మాట్లాడారు. అయితే వారేమీ ఉపదేశం ఇచ్చినట్లు, ఉపన్యాసాలు ఇచ్చినట్లు ఉండదు. సరదాగా మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. ఇరుగుపొరుగుతో సహజంగా సంభాషిస్తున్నట్లుగానే ఉంటుంది. ‘నేను నవ్య అమ్మను మాట్లాడుతున్నాను. ఒక సరదా విషయం మీకు చెప్పుకోవాలని ఉంది’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది శ్వేతా నందా. ‘నేను నవ్య నానీని. మీకు కొన్ని రహస్యాలు చెప్పాలని ఉంది’ అని ఊరిస్తుంది జయబచ్చన్. ‘త్రీ లేడీస్’ ‘త్రీ జెనరేషన్స్’ ‘త్రీ పర్స్పెక్టివ్స్’ అంటూ వచ్చిన ప్రోమో ఆకట్టుకొని ఆసక్తి పెంచింది. వ్యాపారం అనేది అనుకున్నంత సులువు కాదు. ఎంత దిగ్గజ వ్యాపారికైనా అడుగడుగునా పరీక్షలు ఎదురవుతుంటాయి. వాటిలో ఏ మేరకు ఉత్తీర్ణత సాధించారనేదానిపైనే వారి విజయం ఆధారపడి ఉంటుంది. ‘నో సుగర్ కోట్’ పాడ్‌కాస్ట్ ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సవాళ్లు, పోరాటస్ఫూర్తి, అనుసరించాల్సిన వ్యూహాలు...ఇలా ఎన్నో విషయాల గురించి చర్చిస్తుంది పూజా దింగ్రా. ఔత్సాహిక ఎంటర్ప్రెన్యూర్లతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణించాలనుకునేవారిని ఆకట్టుకుంటున్న పాడ్‌కాస్ట్ ఇది. చెఫ్‌గా మంచి పేరు తెచ్చుకున్న పూజా సీజన్వన్లో ఎంతో మంది సక్సెస్ఫుల్ చెఫ్‌లు, ఫుడ్రైటర్స్ను ఇంటర్వ్యూ చేసింది. ‘నల్లేరుపై నడక అనేది వాస్తవం కాదు. భ్రమ. ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే’ అంటోంది పూజా. మానసిక ఆరోగ్యంలాంటి సీరియస్ విషయాలతో పాటు బ్యాచ్‌లర్ పార్టీలాంటి తేలికపాటి విషయాల గురించి మాట్లాడటానికి ‘రియల్ టాక్ విత్ స్మృతి నొటాని’ పాడ్‌కాస్ట్ వేదిక అవుతుంది. స్మృతి మాట్లాడుతుంటే అప్పుడే పరిచయమైన ఫ్రెండ్ గలగలమని మాట్లాడుతున్నట్లుగానే ఉంటుంది. సోషల్ మీడియా ధోరణుల గురించి కూడా తనదైన శైలిలో వ్యాఖ్యానిస్తుంటుంది స్మృతి. ‘ఫ్యాట్.సో?’ ....పేరు ద్వారానే తన పాడ్‌కాస్ట్ లక్ష్యం ఏమిటో తెలియజేశారు పల్లవినాథ్, అమేయ నాగరాజ్. స్థూలకాయం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు, ఆత్మన్యూనతకు గురయ్యే వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ఆత్మవిశ్వాసం నింపి ముందుకు నడిపిస్తుంది ఈ పాడ్‌కాస్ట్. ‘మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఆత్మవిశ్వాసం దగ్గరవుతుంది. అదొక ఆయుధం అవుతుంది. అద్భుతమైన విజయాలు సాధించడానికి ఇంధనం అవుతుంది’....ఇలాంటి మాటలు ఎన్నో ‘ఫ్యాట్.సో’లో వినిపిస్తాయి. -
పెళ్లి కాకుండా తల్లయినా ఎలాంటి అభ్యంతరం లేదు.. ఆమెపై జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ సీనియర్ నటి, అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల వాట్ ది హెల్ నవ్య పాడ్‌కాస్ట్ ఎపిసోడ్లో పాల్గొన్న ఆమె ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలపై స్పందించారు. ఈ సందర్భంగా తన మనవరాలికి ఓ అదిరిపోయే సలహా కూడా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుత సమాజంలో ఆధునిక పోకడల ప్రకారం తన మనవరాలు నవ్య నవేలి నందా పెళ్లి కాకుండా తల్లయినా ఫర్వాలేదని.. తనకేలాంటి అభ్యంతరం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. జయా బచ్చన్ మాట్లాడుతూ.. 'ఈ తరానికి నేను ఇచ్చే సూచన ఏమిటంటే... నేను చాలా వైద్యపరమైన మార్పులు చాలా చూశాను. ఎలాంటి ఎమోషన్స్ లేకుండానే రొమాన్స్ చేసుకుంటున్నారు. నవ్య మీరు మీ బెస్ట్ ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోవాలని నేను అనుకుంటున్నా. నీకు మంచి స్నేహితుడు ఉండి.. నిన్ను ఇష్టపడి బిడ్డను కలిగి ఉండాలనుకుంటే.. ఈ సమాజంతో పనిలేదు. పెళ్లి కాకుండానే బిడ్డ ఉంటే నాకు ఎలాంటి సమస్య లేదు.' అంటూ మనవరాలు నవ్య నవేలి నందకు సలహా ఇచ్చింది. ఈ ఎపిసోడ్లో అమితాబ్ బచ్చన్‌తో తన పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని జయా బచ్చన్ పంచుకున్నారు. మేం మొదట అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నామని.. అయితే జంజీర్ సక్సెస్ తర్వాత వెకేషన్‌కు వెళ్లే ముందు పెళ్లి చేసుకోవాలని వారి తల్లిదండ్రులు సూచించారని ఆమె చెప్పారు. అందుకే జూన్‌లో పెళ్లి జరిగిందని తెలిపారు. -
హీరోతో బిగ్‌బీ మనవరాలు చెట్టాపట్టాల్, డేటింగ్ అనేసరికి కవరింగ్
బిగ్‌బీ మనవరాలు నవ్య నవేలీ నంద, హీరో సిద్దాంత్ చతుర్వేది లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. సిద్దాంత్ ఓ వైట్ బ్రిడ్జి మీద పుస్తకం చదువుతున్నట్లుగా పోజిచ్చాడు. అటు నవ్య కూడా రాత్రి సమయంలో వైట్ బ్రిడ్జి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇద్దరి ఫొటోల్లో తెల్లటి బ్రిడ్జి కామన్‌గా ఉండటంతో నవ్య, సిద్దాంత్ కలిసే ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా సిద్దాంత్ పోస్ట్‌కు మండుతున్న సూర్యుడి ఎమోజీతో రిప్లై ఇచ్చిన నవ్య తర్వాత దాన్ని డిలీట్ చేసింది. అయినప్పటికీ ఫ్యాన్స్ మాత్రం రిషికేష్‌కు వెళ్లిన వీళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారని చెప్పకనే చెప్పారని అభిప్రాయపడుతున్నారు. కాగా హీరో సిద్దాంత్ చివరగా గెహ్రియాన్ సినిమాలో నటించాడు. ఇందులో దీపికా పదుకొణెతో పాటు నవ్య క్లోజ్ ఫ్రెండ్ అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) View this post on Instagram A post shared by Siddhant Chaturvedi (@siddhantchaturvedi) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_301238179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: జగత్ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది ఆర్ఆర్ఆర్ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే! -
బిగ్ బీ మనవడి బర్త్ డే.. అభిషేక్ బచ్చన్ ఎలా విష్ చేసాడో తెలుసా
Abhishek Bachchan Wishes To Agastya Nanda On His Birthday: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా మంగళవారం (నవంబర్ 23)న 21వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అగస్త్యకు అతని సోదరి నవ్య నవేలి, మేనమామ అభిషేక్ బచ్చన్ బర్త్ డే విషెస్ తెలిపారు. పూజలో కూర్చున్న అగస్త్య చిన్ననాటి ఫొటోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు అభిషేక్ బచ్చన్. అందులో '21వ హ్యాపీ బర్త్ డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్, బాధ్యాయుతమైన మనిషిగా ఎదగాలని కోరుకుంటున్నా. ఇప్పుడు నువ్వు అధికారికంగా పెద్దవాడివి. దయచేసి ఇకనైనా ఈ మామ బట్టలు, షూ వేసుకోకు. నీవే సొంతగా కొనుక్కో. లవ్ యూ'. అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ ' 21 ఏళ్లుగా నువ్ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు'. రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్ కూడా తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఖుషీ కపూర్, సుహానా ఖాన్‌లతో జోయా అక్తర్ తర్వాతి చిత్రంలో అగస్త్య సినిమాల్లోకి అడుగుపెడతాడని గతంలో పుకార్లు వచ్చాయి. సెప్టెంబర్‌లో జోయా కార్యాలయం బయట ఈ ముగ్గురు కనిపించడం గమనార్హం. View this post on Instagram A post shared by Navya Naveli Nanda (@navyananda) View this post on Instagram A post shared by S (@shwetabachchan) -
ఆ నటుడితో పీకల్లోతు ప్రేమలో బిగ్‌బి మనవరాలు!
Navya Naveli Nanda Serious Relation With Gully Boy Actor Siddhant Chaturvedi : బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ప్రేమ వ్యవహరం మరోసారి వార్తల్లో నిలిచింది. నవ్య సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమెకు సంబంధించిన విషయాలు తరచూ వార్తల్లోకెక్కుతుంటాయి. ఇప్పటికే ఆమె బాలీవుడ్ యువ నటుడు మీజాన్ జాఫేరీ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇక దీనిపై మీజాన్ తండ్రి జావేద్ స్పందిస్తూ వాళ్లు మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతోన్న మరో బాలీవుడ్ ప్రేమ జంట అలాగే మీజాన్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నవ్వ, తాను మంచి స్నేహితులమంటూ వారిద్దరి రిలేషన్‌పై వస్తున్న వార్తలను ఖండించాడు. దీంతో ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పడింది. ఈ నేపథ్యంలో నవ్వ మరో నటుడితో ప్రేమలో ఉన్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. ‘గల్లీబాయ్’ సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధాంత్ చతుర్వేది-నవ్యలు పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారని, ఇద్దరు సీరియస్ రిలేషన్లో ఉన్నట్లు బి-టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేగాక వీరిద్దరూ కలిసి సీక్రెట్‌గా ప్రేమ వ్యవహరం నడిపిస్తున్నట్లు సన్నిహితుల నుంచి సమాచారం. చదవండి: నా కొడుకువైనందుకు గర్వంగా ఉంది: అమితాబ్ కాగా నవ్య తాను సినిమాల్లో నటించనని స్పష్టం చేస్తూ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తన ఫ్యామిలీ బిజినెస్‌తో పాటు మహిళా ఆరోగ్యానికి సంబంధించిన ఓ ఫౌండేషన్‌లో మెంబర్‌గా వ్యవహరిస్తోంది. ఇక సిద్దాంత్ చతుర్వేది ‘గల్లీబాయ్’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులకు ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు ‘బంటీ అండ్ బాబ్లీ 2’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
‘నీ డ్యాన్స్ చూస్తే నాకు కడుపునొప్పి వస్తుంది’
టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్.. ఇలా ఏ వుడ్ అయినా సరే హీరోయిన్గా రాణించాలంటే అందంతో పాటు ప్రతిభ కూడా చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా డ్యాన్స్ కచ్చితంగా వచ్చి ఉండాలి. తమలోని డ్యాన్స్ స్కిల్స్‌కు పదును పెట్టుకోవడానికి.. మరింత మెరుగ్గా రాణించడానికి హీరోయిన్లు, అప్‌కమింగ్ యాక్టర్స్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటారు. ప్రస్తుతం చాలా మంది ఎక్కువగా బెల్లీ డ్యాన్స్‌కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ బెల్లీ డ్యాన్స్ కోచింగ్ సెషన్లు, ప్రదర్శనకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రశంసలు పొందుతుండగా.. తాజాగా ఈ జాబితాలోకి సంజయ్ కపూర్ కుమార్తె, అప్ కమింగ్ హీరోయిన్ షనయా కపూర్ చేరారు. ప్రస్తుతం ఈమె చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. పలువురు షనయా డ్యాన్స్ స్కిల్స్‌ని ప్రశంసించగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా చేసిన కామెంట్ మాత్రం తెగ నవ్విస్తోంది. ఆ వివరాలు.. షనయా కపూర్ బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘‘మేం డ్యాన్స్ ఎలా నేర్చుకుంటామంటే ప్రాక్టీస్ సెషన్స్ విత్ బెస్ట్ సంజన ముత్రేజా అనే క్యాప్షన్‌తో వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజనులు షనయా కపూర్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనిపై బిగ్ బీ మనవరాలు నవ్య నవేలీ నందా కాస్త వెరైటీగా కామెంట్ చేశారు. ‘‘నీ డ్యాన్స్ చూస్తే.. నాకు కడుపునొప్పి వస్తుంది’’ అంటూ ఫన్నీ కామెంట్ చేశారు నవ్య నవేలీ. షనయా కపూర్ త్వరలో ధర్మ ప్రొడక్షన్స్ ప్రాజెక్టుతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆమె కరణ్ జోహార్ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ (డీసీఏ) లో చేరారు. ఈ క్రమంలో మార్చిలో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన ఆమె ఇలా రాసుకొచ్చారు: "ఈ రోజు చాలా కృతజ్ఞతతో హృదయపూర్వకంగా మేల్కొన్నాను! ఇక్కడ ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీ కుటుంబంతో ఒక గొప్ప ప్రయాణం ప్రారంభం కాబోతుంది. ఈ జూలై నాటికి నా మొదటి సినిమాను ప్రారంభిచబోతున్నాను’’ అని ప్రకటించారు. -
బిగ్‌బీ మనవరాలితో ప్రేమ.. ఆ చూపులు నా వల్ల కావడం లేదు!
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా, బాలీవుడ్ యువ నటుడు మీజాన్ జాఫేరీ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ మధ్య మీజాన్ తండ్రి జావేద్ స్పందిస్తూ వాళ్లు మంచి స్నేహితులు మాత్రమే అని క్లారిటీ ఇచ్చాడు. అయినా మీడియా మాత్రం వారిని ప్రేమపక్షులుగా అభివర్ణించింది. దీంతో తాజాగా మీజాన్.. నవ్యతో తనకున్న అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. "చాలాకాలంగా నవ్య నవేలీ గురించి నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. నిజంగా, నిజాయితీగా చెప్తున్నా.. ఆమె, నేను మంచి స్నేహితులం మాత్రమే. కానీ నా గురించి మాట్లాడిన ప్రతిసారి ఆమె పేరు ప్రస్తావిస్తున్నారు. ఇది అన్యాయం. ఆమె వ్యక్తిగత జీవితం వేరు. నవ్య నాకు మాత్రమే కాదు, నా సోదరికి కూడా బెస్ట్ ఫ్రెండ్. అయినా ఇలాంటి సమయంలో వేరొకరి గురించి ఇలా ఇష్టమొచ్చినట్లుగా కథనాలు అల్లేయడం ఏమీ బాగోలేదు. దీనివల్ల నేను నా ఇంట్లోకి అడుగు పెడుతున్నప్పుడు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. గడప లోపలకు అడుగు పెట్టగానే మా పేరెంట్స్.. ఏంటిదంతా? అన్నట్లుగా ఓ లుక్కిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు అని ఓ నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి జారుకుంటున్నాను. అయినా నేను ప్రస్తుతం ఎవరితోనూ రిలేషన్లో లేను" అని మీజాన్ స్పష్టం చేశాడు. చదవండి: యువ నటుడితో నవ్య నవేలీ ప్రేమ!: స్పందించిన నటుడు -
జీన్స్ వద్దన్న సీఎం! బరాబర్ వేస్తానంటున్న బిగ్‌బీ మనవరాలు
అమ్మాయిల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిరిగిపోయిన జీన్స్ వేసుకుని ఎక్స్పోజింగ్ చేయడం, వాటిని ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం దురదృష్టకరమని, ఇది సంస్కృతిని దెబ్బ తీయడమేనని పేర్కొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా పోటీపడి మరి స్కిన్ షో చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా మీరు చెప్పాలా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ సైతం సీఎం వ్యాఖ్యలపై ఒంటికాలిన దిగ్గున లేచింది. "మా వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలను మార్చుకోండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు మమ్మల్ని మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి" అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. అంతే కాదు తను జీన్స్ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ "నేను సగర్వంగా ఈ జీన్స్‌ను ధరిస్తాను" అని చెప్పుకొచ్చింది. చదవండి: చిరిగిన జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు -
ఆ నటుడితో బిగ్‌బీ మనవరాలు ప్రేమాయణం.. స్పందించిన తండ్రి
బాలీవడ్ సూపర్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ నందా ఈ మధ్య కాలంలో తరచు వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు, తన స్నేహితుడు మీజాన్ జాఫేరీతో నవ్య ప్రేమలో ఉన్నట్లు బి-టౌన్లో కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రిలేషన్‌పై వస్తున్న పుకార్లపై మీజాన్ తండ్రి, నటుడు జావేద్ జాఫేరీ స్పందించాడు. ఇటీవల ఓ ఇంగ్లీష్ ఛానల్‌కు ఇచ్చి ఇంటర్య్వూలో ఆయనకు నవ్య, మీజాన్ల ప్రేమ వ్యవహరంపై ప్రశ్న ఎదురైంది. ఇక దీనికి ఆయన సమాధానం ఇస్తూ.. నవ్య, మీజాన్‌లు కేవలం స్నేహితులు మాత్రమేనని స్పష్టం చేశాడు. ‘నా కూతురు, నవ్య మంచి స్నేహితురాలు. స్కూలింగ్ నుంచి వారిద్దరూ కలిసే పెరిగారు. ఈ క్రమంలో మీజాన్, నవ్యలు కూడా మంచి స్నేహితులయ్యారు. వారిద్దరికి కొంతమంది కామన్ ఫెండ్స్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారంత అప్పుడప్పుడు కలిసి పార్టీలు, షికార్లకు వెళ్లడం చేస్తుంటారు. అది చూసి కొంతమంది వాళ్ల మధ్య రిలేషన్ ఉన్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారు. ఎందుకంటే ప్రజలకు వినోదం కావాలి. అందుకే మంచి ఫ్రెండ్స్ మధ్య కూడా ఎదో ఉందని పుకార్లు సృష్టించి వారి గురించి చర్చించుకుంటూ వినోదాన్ని పొందుతారు. ఇక చెప్పాలంటే సారా అలీఖాన్, నా కొడుకు(మీజాన్) కూడా ఒకే స్కూల్లో చదువుకున్నారు. వారిద్దరూ కూడా మంచి స్నేహితులే. కలిసి పార్టీలు, విందులకు వెళుతుంటారు. తెల్లవారు జామును 3 గంటల వరకు వారు పార్టీలంటూ బయట తిరుగుతుంటారు. అంటే ఇక అని వారిమధ్య కూడా ఎదో రిలేషన్ ఉన్నట్టా’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే గత నెల నవ్య ఓ రెస్టారెంట్లో కుర్చొని ఉన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తన పోస్టుపై మీజాన్ ‘వావ్ ఈ ఫొటో ఎవరూ తీశారు. చాలా బాగుంది. ఐ వండర్’ అంటూ కామెంటు పెట్టాడు.. దీనికి నవ్య మీజాన్జీ అనే నా పర్సనల్ ఫొటోగ్రాఫర్ అంటూ సమాధానం ఇచ్చింది. ఇక అది చూసి అందరూ వీరిమద్య ఎదో ఉందంటూ గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారు. కాగా మీజాన్ సంజయ్ లీలా బన్సాలీ ప్రోడక్షన్ నిర్మించిన మలాల్ మూవీతో బాలీవుడ్ ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హంగామా-2లో కూడా నటించాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీలో నటి శిల్పా శెట్టి, పరెష్ రావల్. పునిత్ సుభాష్‌లు కీలక పాత్రలు పోషించారు. ఇక న్యూయార్క్‌లోని ఫోర్థామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నవ్య గతేడాది ‘ఆరా హెల్త్’ పేరిట ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను పప్రారంభించింది. అంతేగాక అప్పుడప్పుడు వివిధ ఆరోగ్య సమస్యలకు గల కారణాలపై పలు ఆన్లైన్ ప్లాట్‌ఫ్లాంలో చర్చిస్తుంటుంది. (చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్!) (మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు) (వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు) -
ట్రోలింగ్: బిగ్‌బీ మనవరాలి ఘాటు రిప్లై
లింగ సమానత్వం మీద స్పీచ్ ఇచ్చింది బిగ్‌బీ అమితాబ్ ప్రియ మనవరాలు నవ్య నవేలీ నందా. అమితాబ్ కుమార్తె శ్వేత, అల్లుడు నిఖిల్ల కుమార్తె అయిన నవ్య తన కుటుంబంలో మహిళంలదరూ ఏదో ఒక పని చేసేవాళ్లేనని చెప్పుకొచ్చింది. అయితే ఓ నెటిజన్ మాత్రం "అయినా మీ అమ్మకు ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు కదా?" అంటూ నవ్వుతూ వెటకారంగా కామెంట్ పెట్టాడు. అంతే, నవ్యకు ఒళ్లు మండిపోయింది. అసలే ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని ఈక్వాలిటీ కోసం పోరాడుతున్న నవ్య తన అమ్మను చులకన చేసి మాట్లాడితే తట్టుకోలేకపోయింది. 'ఆమె ఒక రచయిత, డిజైనర్, భార్య, అమ్మ' అని అతడికి రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఓ సుదీర్ఘ పోస్టును ఇన్‌స్టా స్టోరీలో యాడ్ చేసింది. "తల్లిగా, భార్యగా ఉండటం ఫుల్‌టైమ్ జాబ్ వంటిదే. ఇంటి పనులను భుజాన వేసుకునే మహిళలను చులకనగా చూడకండి. ఒక తరాన్ని పెంచడంలో వాళ్ల పాత్ర కీలకమైనది. అలాంటివారికి సపోర్ట్‌గా నిలబడండే తప్ప అవమానించకండి" అని హితవు పలికింది. దీంతో నోటి దురుసుతో అడ్డదిడ్డంగా కామెంట్ చేసిన సదరు నెటిజన్ తలవంచుకోక తప్పలేదు. కాగా న్యూయార్క్‌లోని ఫోర్థామ్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నవ్య గతేడాది ‘ఆరా హెల్త్’ పేరిట ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను పప్రారంభించింది. చదవండి: భార్య వేధింపులు.. బాలీవుడ్ నటుడు ఆత్మహత్య సుశాంత్ కేసు: ఓ సోదరికి బెయిల్.. మరొకరికి షాక్ -
మానసిక సమస్యలలో అమితాబ్ మనవరాలు
అమితాబ్ మనవరాలు 23 ఏళ్ల నవ్య నవేలి నందా తీవ్రమైన యాంగ్జయిటీతో బాధ పడుతున్నట్టు చెప్పింది. అమితాబ్ కుమార్తె శ్వేత, అల్లుడు నిఖిల్ల కుమార్తె అయిన నవ్య నవేలీ గత సంవత్సరమే న్యూయార్క్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని వచ్చింది. ఈమెకు అగస్త్య అనే తమ్ముడు ఉన్నాడు. ఇటీవల నవ్య నవేలి తన సహ భాగస్వామ్యంతో ‘ఆరా’ అనే హెల్త్ పోర్టల్‌ను ప్రారంభించింది. దాని కోసమని విడుదల చేసిన వీడియోలో తన మానసిక సమస్య గురించి, దానికి తీసుకుంటున్న వైద్యం గురించి మాట్లాడింది. ‘గతంలో నేను చాలా నెగెటివ్ మనుషుల మధ్య ఉండేదాన్ని. వారెప్పుడు నెగెటివిటీనే మాట్లాడేవాళ్లు. కారణాలు తెలియదు నేను చాలాసార్లు మానసికంగా లోలోపల అడుగు వరకూ చాలా దెబ్బ తిన్నాను. తీవ్రమైన యాంగ్జయిటీ నన్ను వేధించేది. ఇంట్లో ఉన్న బయట ఉన్నా ఒక అటాక్లాగా వచ్చేది. ఆ సమయంలో దానిని కంట్రోల్ చేయడం సాధ్యమయ్యేది కాదు. బయటి విషయాలు ఏవో ఒకటి ట్రిగర్ చేయడం వల్ల అలా జరుగుతుంది అనుకునేదాన్ని. ఒక్కోసారి ఏ కారణం లేకపోయినా అలాగే జరిగేది. ఇది చాలా భరింపలేని విషయం’ అందామె. ‘మొదట్లో నేను దీని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు అనుకున్నాను. కాని మాట్లాడితేనే సగం పరిష్కారం. అలాగై వైద్య సహాయం తీసుకోవడం మరో సగం పరిష్కారం. కొందరు తమ మానసిక సమస్యకు సహాయం అవసరం అని చాలా ఆలస్యంగా తెలుసుకుంటారు. యాంగ్జయిటీకి మూలం బయట ఉండదు. ఎనభై శాతం మన బుర్రలోనే ఉంటుంది. అక్కడి నుంచే యాంగ్జయిటీ మొదలవుతుంది. మొదట మన మనసును, శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మన ఎమోషన్స్‌ను అర్థం చేసుకునే కొద్దీ ఈ సమస్య నుంచి బయటపడతాం’ అందామె. ‘యాంగ్జయిటీ నుంచి బయటపడటానికి థెరపిస్ట్‌ను కలుస్తున్నాను. వారానికి ఒక గంట అతనితో మాట్లాడుతున్నాను. మాట్లాడేకొద్దీ నాకు ధైర్యం వస్తోంది. యాంగ్జయిటీ నన్నేమీ చేయదనే నమ్మకం కలుగుతోంది. అలాగే మన చుట్టు మనల్ని కంఫర్ట్‌గా సంతోషంగా ఉంచే మనుషులుండేలా చూసుకోవాలని కూడా తెలుసుకున్నాను’ అని చెప్పిందామె. అమితాబ్ ప్రియమైన మనవరాలు నవ్య. ఆమె యుక్త వయసుకు రాగానే స్త్రీ ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలను గురించి, సంఘపరమైన సవాళ్ల గురించి మాట్లాడుతూ అమితాబ్ ఆమెకు రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఒక పురోగామి విషయంగా చెప్పుకున్నారు. మానసిక సమస్యలకు స్త్రీ పొందాల్సిన వైద్య సహాయాన్ని ఈ వీడియో నొక్కి చెబుతోంది. నవ్య నవేలి నందా; తల్లి శ్వేతతో నవ్య -
వ్యాపార సంస్థను ప్రారంభించిన బిగ్‌బీ మనవరాలు
ముంబై: ఇటీవల పట్టభద్రురాలైన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా ఇంతలోనే స్వంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించారు. నవ్వ నవేలి నందా బిగ్‌బీ తనయురాలు శ్వేత బచ్చన్ నందా కూతురు. ఆమె న్యూయార్స్‌లోని ఫోర్థామ్‌యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇటీవల పట్టా పొందారు. ‘ఆరా హెల్త్’ ఆన్లైన్ హెల్త్‌కేర్ పోర్టల్‌ను ప్రారంభించినట్లు ఆరాహెల్త్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో నవ్య షేర్ చేశారు. ‘ఆరాహెల్త్’ అనేది మహిళ సాధికారితకు తోడ్పాటు అందించే వేదికని పేర్కొన్నారు. కాగా, నవ్య ప్రారంభించిన ఈ కొత్త వెంచర్లో ఆమెతోపాటు సభ్యులుగా అహిల్యా, మెహతా, మల్లికా సాహ్నీ, ప్రజ్ఞ సాబూలు ఉన్నారు. ‘మేము ఒక సాధారణ సమస్యను పరిష్కరించడానికి కలిసి వచ్చిన స్వతంత్ర యువతులం. మా విభిన్న నేపథ్యాలు, భవాలు కలిగి ఇతర మహిళలను శక్తివంతం చేయడంలో సహాయపడటానికి మాకు స్ఫూర్తినిచ్చాయి’ అంటూ ఆరాహెల్త్ అధికారిక ఇన్‌స్టా పేజీలో షేర్ చేశారు. ఇక నవ్య కొత్త వెంచర్‌ను ఆమె తల్లి శ్వేతా బచ్చన్ ప్రమోట్ చేస్తూ.. ‘ధైర్యవంతమైన యువతులు... ఇప్పటి నుంచి ఎప్పటికీ’ అంటూ కామెంట్ పెట్టారు. View this post on Instagram We are young and independent women who have come together to solve a common problem that has not been given the attention it deserves. Our different backgrounds and experiences have inspired us to help empower other women! Ahilya Mehta @ahilyamehta Mallika Sahney @mallika414 Navya Nanda @navyananda Pragya Saboo @pragyasaboo A post shared by Aara Health (@aarahealth) on May 11, 2020 at 6:36am PDT గత వారం శ్వేతా బచ్చన్ నవ్వ గ్రాడ్యూయేషన్ కంప్లీట్ చేసిన సందర్భంగా ముంబైలోని తమ జల్సా నివాసంలో పార్టీ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను శ్వేతా పంచుకున్నారు. ‘2020 క్లాస్.. ఈ ఏడాది నవ్వ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పట్టభద్రురాలైంది. ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసన ప్రతి ఒక్కరికీ ఒక వేడుక రాదు కాబట్టి మేము నవ్వను ప్రత్యేకంగా ఉంచాలని నిర్ణయించుకున్నాము. ఐ లవ్ యూ బేబీ. నిన్ను చూసిన గర్వపడుతున్నాను’ అంటూ షేర్ చేశారు. -
ఆనందంలో బచ్చన్ ఫ్యామిలీ
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నందా పట్టభద్రురాలైంది. న్యూయార్క్‌లోని ఫోర్డ్‌హమ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. మనువరాలు పట్టభద్రరాలైన సందర్భంగా బిగ్‌బీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు. "నవ్య..ప్రతీ విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు గ్రాడ్యుయేషన్ డే. లాక్డౌన్ కారణంగా ఈవెంట్ క్యాన్సల్ అయిపోయింది. కానీ బాధపడకు. నిన్ను సంతోషపెట్టేందుకు మేమందరం నీతో పాటే ఉన్నాం. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాం. గాడ్ బ్లస్ యూ నవ్య "..అంటూ పోస్ట్ చేశారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్ ) View this post on Instagram Grand daughter Navya .. the most important day in the life of a young student - Graduation Day .. ! She graduated from College in New York, but ceremony and presence got cancelled because of Corona and lockdown .. she could not go .. we too had all planned to be with her on this important occasion .. BUT .. she though wanted to wear that Graduation gown and Cap .. so staff stitched her an impromptu gown and cap .. and she wore it and celebrated at home in Jalsa .. So proud of you NAVYA .. god bless .. such a positive and happy attitude .. LOVE YOU💕💕💕💕 A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on May 6, 2020 at 7:22am PDT దీంతో పలువరు ప్రముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. ఇక మేనకోడలు గ్రాడ్యుయేట్ కావడం పట్ల అభిషేక్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేశారు. కంగ్రాట్స్ నవ్య అంటూ పోస్ట్ చేశారు. ఇక లాక్డౌన్ కారణంగా గ్రాడ్యేయేషన్ వేడుకకు వెళ్లలేని కారణంగా మనువరాలు నవ్య కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్‌లో నవ్య ఫోటోలకు ఫోజులిస్తూ ఆనందంగా కనిపించింది. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నిఖిల్ నందా, శ్వేతా బచ్చన్ నందా మొదటి సంతానమే నవ్య నందా. -
‘నా కూతురుకి ఆ పరిస్థితి రాకూడదనే’
ప్రస్తుతం బాలీవుడ్లో వారసులు హవా కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తన కూతుర్ని మాత్రం సినిమాల్లోకి పంపించనంటున్నారు శ్వేతా బచ్చన్ నందా. సోదరుడు అభిషేక్ బచ్చన్‌తో కలిసి ‘కాఫీ విత్ కరణ్ షో’కు హాజరయ్యారు శ్వేతా బచ్చన్. ఈ సందర్భంగా తన కూతురు నవ్య గురించి మాట్లాడుతూ.. ‘తనకు ఈ రంగం అంటే చాలా ఇష్టం, గౌరవం ఉండి.. సొంతంగా రాణించగలను అనే ధైర్యం ఉంటే ఫర్వాలేదు. అలాకాకుండా కేవలం కొందరు ప్రముఖ వ్యక్తుల కుటుంబానికి చెందిన మనిషిగా తాను ఈ రంగంలోకి వస్తే మాత్రం చాలా బాధపడాల్సి వస్తుంది. దాని బదులు మరో కెరీర్‌ను ఎంచుకోవడమే ఉత్తమం’ అని అన్నారు. శ్వేత మాట్లాడుతూ.. ‘ఈ రంగం పట్ల నవ్యకు ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు ఇంకా తెలియదు. తను సిని రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు’ అన్నారు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పారు శ్వేత. ‘మా కుటుంబంలో తొలి తరం అంతా సినిమాల్లోనే ఉన్నారు. రెండో తరంలో మా అన్నయ్య, వదిన కూడా సినిమాల్లోనే ఉన్నారు. సినిమాలు సరిగా ఆడనప్పుడు వారే పడే బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. సినిమా స్టార్ అవ్వడం వల్ల జనాలు మా కుటుంబ సభ్యులు గురించి ఎలా మాట్లాడతారో నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను’ అన్నారు. ‘ముఖ్యంగా అభి గురించి. అమితాబ్ బచ్చన్ కొడుకు అయినందువల్లే చాలా ఇజీగా సినిమాల్లోకి వచ్చాడు. అంతే తప్ప అతని ప్రయత్నం ఏం లేదు అంటూ తన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. నేను కూడా తనను సోషల్ మీడియాలో ఫాలో అవుతుంటాను. అక్కడ జనాలు తన గురించి మాట్లాడే మాటలు చూసి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. నా కూతురికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుడదనే ఉద్దేశంతోనే తనను సినిమాల్లోకి పంపించకూడదని అనునుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు శ్వేత. -
అమితాబ్ మనవరాలి డాన్స్ చూశారా?
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నంద తెరంగ్రేటం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఆమె పాపులర్ అయింది. తన స్నేహితులతో కలిసి ఆమె పార్టీలు చేసుకుంటున్న ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆమె షేర్ చేసిన వీడియో అభిమానులను అలరిస్తోంది. ఉత్సాహంగా డాన్స్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. నవ్య ఫ్రెండ్ తీసిన ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీనికి 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 19 ఏళ్ల నవ్య త్వరలోనే బాలీవుడ్లో తెరంగ్రేటం చేయనుందని అంతకుముందు వార్తలు వచ్చాయి. వీటిని అమితాబ్ బచ్చన్ తోసిపుచ్చారు. చదువు పూర్తయ్యే దాకా ఆమె సినిమాల్లోకి రాదని ప్రకటించారు. తాజాగా నవ్య పోస్ట్ చేసిన వీడియోతో మళ్లీ గాసిప్స్ మొదలయ్యాయి.