ఆనందంలో బ‌చ్చ‌న్ ఫ్యామిలీ | Amitabh Bachhan Celebrates Grand Daughter Navya Graduation Day | Sakshi

అత్యంత ముఖ్య‌మైన రోజు : అమితాబ్ బ‌చ్చ‌న్

May 7 2020 12:02 PM | Updated on May 7 2020 1:11 PM

Amitabh Bachhan Celebrates Grand Daughter Navya  Graduation Day - Sakshi

బిగ్‌బీ అమితాబ్ బచ్చ‌న్ మ‌నువ‌రాలు న‌వ్య న‌వేలి నందా ప‌ట్ట‌భ‌ద్రురాలైంది. న్యూయార్క్‌లోని ఫోర్డ్‌హమ్ విశ్వ‌విద్యాల‌యం నుంచి గ్రాడ్యుయేట్ పూర్తిచేసింది. ఈ విష‌యాన్ని అమితాబ్ బ‌చ్చ‌న్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వెల్ల‌డించారు. మ‌నువ‌రాలు ప‌ట్ట‌భ‌ద్ర‌రాలైన సంద‌ర్భంగా బిగ్‌బీ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. త‌న సంతోషాన్ని వ్య‌క్త‌ప‌రుస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్టులు పెట్టారు. "న‌వ్య‌..ప్ర‌తీ విద్యార్థి జీవితంలో అత్యంత ముఖ్య‌మైన రోజు గ్రాడ్యుయేష‌న్ డే. లాక్‌డౌన్ కార‌ణంగా  ఈవెంట్ క్యాన్స‌ల్ అయిపోయింది. కానీ బాధ‌ప‌డ‌కు. నిన్ను సంతోష‌పెట్టేందుకు మేమంద‌రం నీతో పాటే ఉన్నాం. నిన్ను చూసి  చాలా గ‌ర్వ‌ప‌డుతున్నాం. గాడ్ బ్ల‌స్ యూ న‌వ్య‌ "..అంటూ పోస్ట్ చేశారు. (రెండు రోజుల పని ఒక రోజులోనే పూర్తి: అమితాబ్ )

దీంతో ప‌లువ‌రు ప్ర‌ముఖులతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇక మేన‌కోడ‌లు గ్రాడ్యుయేట్ కావ‌డం ప‌ట్ల అభిషేక్ బ‌చ్చ‌న్ ఆనందం వ్య‌క్తం చేశారు. కంగ్రాట్స్ న‌వ్య అంటూ పోస్ట్ చేశారు. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా గ్రాడ్యేయేష‌న్ వేడుక‌కు వెళ్ల‌లేని కార‌ణంగా మ‌నువ‌రాలు న‌వ్య కోసం ప్ర‌త్యేకంగా డిజైన్ చేయించిన డ్రెస్‌లో న‌వ్య ఫోటోల‌కు ఫోజులిస్తూ ఆనందంగా క‌నిపించింది. ఢిల్లీకి చెందిన వ్యాపార‌వేత్త నిఖిల్ నందా, శ్వేతా బ‌చ్చ‌న్ నందా మొద‌టి సంతాన‌మే న‌వ్య నందా. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement