మొన్న తనయుడు.. ఇప్పుడు తండ్రి.. అడ్వాన్స్‌గా రూ.4 కోట్లు! | Amitabh Bachchan Bought 3 Office Units Worth Rs 60 Cr In Mumbai | Sakshi
Sakshi News home page

అద్దె ద్వారా సంపాద.. మరోసారి కమర్షియల్‌ ప్రాపర్టీ కొన్న అమితాబ్‌

Published Wed, Jun 26 2024 2:46 PM | Last Updated on Wed, Jun 26 2024 3:41 PM

Amitabh Bachchan Bought 3 Office Units Worth Rs 60 Cr In Mumbai

బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఇటీవలే కొత్త ఫ్లాట్లు కొన్నాడు. ముంబైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆరు ఫ్లాట్స్‌ కొనుగోలు చేశాడు. వీటి కోసం దాదాపు రూ.15 కోట్లు ఖర్చు చేశాడు. తాజాగా ఈయన తండ్రి, బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం ఆఫీసు పెట్టుకునేందుకు పనికివచ్చే మూడు కమర్షియల్‌ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ముంబైలోని వీరసావర్కర్‌ సిగ్నేచర్‌ భవంతిలోనే ఈ ఆఫీస్‌ స్పేస్‌ ఉందట! దీని మొత్తం విలువ రూ.60 కోట్లు కాగా.. వీటికోసం బిగ్‌ బీ ఇప్పటికే సుమారు రూ.4 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు తెలుస్తోంది. ఇలా కమర్షియల్‌ ప్రాపర్టీ కొనడం అమితాబ్‌కు కొత్తేం కాదు. గతంలోనూ ఇదే సిగ్నేచర్‌ బిల్డింగ్‌లో నాలుగు ఆఫీస్‌ స్పేస్‌లను కొని గతేడాది అద్దెకు ఇచ్చాడు. కేవలం అద్దె ద్వారానే ఏడాదికి రూ.2.07 కోట్లు సంపాదిస్తున్నాడు.

సినిమాల విషయానికి వస్తే.. బిగ్‌బీ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మూవీ రేపు (జూన్‌ 26న) విడుదల కానుంది. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి!

చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా ప్రత్యేకతలు.. మీకు ఇవి తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement