 
													డార్లింగ్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ 'కల్కి' రిలీజ్‌కి రెడీ. మరికొన్ని గంటల్లో థియేటర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఎందుకంటే మూవీపై అంచనాలు మామూలుగా లేవు. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తొలిరోజు వసూళ్లలో రికార్డులు బద్దలవ్వొచ్చని మాట్లాడుకుంటున్నారు. అయితే మీకు 'కల్కి' గురించి విశేషాలు ఎన్ని తెలుసు? ఇంతకీ 'కల్కి' ఎప్పుడు మొదలైంది అనేది ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్ 'కల్కి' విశేషాలు
- డార్లింగ్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ 'కల్కి'. 
- జూన్ 27న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడు. 

- ప్రపంచవ్యాప్తంగా 10 వేలకు పైగా స్క్రీన్లలో 'కల్కి' రిలీజ్ అవుతోంది. 
- తెలుగులో 1600కి పైగా.. మిగతా భాషలన్నీ కలిపి 4000కి పైగా స్క్రీన్లలో రిలీజ్ 
- ఓవర్సీస్‌లో 4500కి పైగా స్క్రీన్స్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. 
- మన దగ్గరతో పాటు ఓవర్సీస్‌లోనూ కనివినీ ఎరుగని రీతిలో టికెట్స్ బుక్. 
- రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్ రేట్లు, అదనపు షోలు భారీ ఎత్తున అనుమతి. 
- 'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, కమల్, దీపిక, దిశా పటానీ, శోభన లాంటి స్టార్స్ నటించారు. 
- విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ కూడా ఉన్నారని టాక్. 

- వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. 
- ఫిబ్రవరి 2020న 'ప్రాజెక్ట్ కె' పేరుతో ఈ సినిమాని అనౌన్స్ చేశారు. 
- అదే ఏడాది కరోనా రావడంతో దాదాపు ఏడాది వాయిదా పడింది. 
- 2021 జూలై నుంచి మార్చి 2024 వరకు షూటింగ్ జరిగింది. 
- ఈ ఏడాది మే 9నే రిలీజ్ చేస్తామని ప్రకటన. కానీ ఎన్నికల కారణంగా జూన్ 27కి వాయిదా. 
- క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి 2898 AD వరకు విస్తరించే కథనే 'కల్కి' 
- మహాభారతం సంఘటనలతో పాటు వర్తమాన, భవిష్యత్‌ని ఇందులో చూపించబోతున్నారు. 

- ఇకపోతే 'కల్కి' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.370 కోట్ల వరకు జరిగిందని సమాచారం. 
- తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.168 కోట్లు కాగా.. కర్ణాటక 25, తమిళనాడు 16, కేరళ 6, హిందీ ప్లస్ నార్త్ కలిపి రూ.85 కోట్లు! 
- ప్రభాస్ గత సినిమా 'సలార్' తొలిరోజు కలెక్షన్స్ రూ.178 కోట్లు. 
- దీన్ని సులభంగా 'కల్కి' అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు జోస్యం. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
