ట్రోలింగ్‌: బిగ్‌బీ మనవరాలి ఘాటు రిప్లై | Viral: Navya Naveli Nanda Responds To Troll On Her Mother Shweta Bachchan | Sakshi
Sakshi News home page

బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్‌!

Published Wed, Feb 17 2021 11:18 AM | Last Updated on Wed, Feb 17 2021 1:13 PM

Viral: Navya Naveli Nanda Responds To Troll On Her Mother Shweta Bachchan - Sakshi

లింగ సమానత్వం మీద స్పీచ్‌ ఇచ్చింది బిగ్‌బీ అమితాబ్‌ ప్రియ మనవరాలు నవ్య నవేలీ నందా. అమితాబ్‌ కుమార్తె శ్వేత, అల్లుడు నిఖిల్‌ల కుమార్తె అయిన నవ్య తన కుటుంబంలో మహిళంలదరూ ఏదో ఒక పని చేసేవాళ్లేనని చెప్పుకొచ్చింది. అయితే ఓ నెటిజన్‌ మాత్రం "అయినా మీ అమ్మకు ఉద్యోగం సద్యోగం ఏమీ లేదు కదా?" అంటూ నవ్వుతూ వెటకారంగా కామెంట్‌ పెట్టాడు. అంతే, నవ్యకు ఒళ్లు మండిపోయింది. అసలే ఆడవాళ్లు ఎందులోనూ తక్కువ కాదని ఈక్వాలిటీ కోసం పోరాడుతున్న నవ్య తన అమ్మను చులకన చేసి మాట్లాడితే తట్టుకోలేకపోయింది. 'ఆమె ఒక రచయిత, డిజైనర్‌, భార్య, అమ్మ' అని అతడికి రిప్లై ఇచ్చింది. అంతటితో ఆగకుండా ఓ సుదీర్ఘ పోస్టును ఇన్‌స్టా స్టోరీలో యాడ్‌ చేసింది.

"తల్లిగా, భార్యగా ఉండటం ఫుల్‌టైమ్‌ జాబ్‌ వంటిదే. ఇంటి పనులను భుజాన వేసుకునే మహిళలను చులకనగా చూడకండి. ఒక తరాన్ని పెంచడంలో వాళ్ల పాత్ర కీలకమైనది. అలాంటివారికి సపోర్ట్‌గా నిలబడండే తప్ప అవమానించకండి" అని హితవు పలికింది. దీంతో నోటి దురుసుతో అడ్డదిడ్డంగా కామెంట్‌ చేసిన సదరు నెటిజన్‌ తలవంచుకోక తప్పలేదు. కాగా న్యూయార్క్‌లోని ఫోర్థామ్ ‌యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నవ్య గతేడాది ‘ఆరా హెల్త్‌’ పేరిట ఆన్‌లైన్‌ హెల్త్‌కేర్‌ పోర్టల్‌ను పప్రారంభించింది.

చదవండి: భార్య వేధింపులు.. బాలీవుడ్‌ నటుడు ఆత్మహత్య

సుశాంత్‌ కేసు: ఓ సోదరికి బెయిల్‌.. మరొకరికి షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement