Navya Nanda Naveli, Siddhant Chaturvedi Post Sparks Dating Rumours - Sakshi
Sakshi News home page

Navya Nanda: హీరోతో డేటింగ్‌, కామెంట్‌ డిలీట్‌ చేసిన బిగ్‌బీ మనవరాలు

Published Fri, Apr 22 2022 9:32 AM | Last Updated on Fri, Apr 22 2022 10:13 AM

Navya Nanda Naveli, Siddhant Chaturvedi Post Sparks Dating Rumours - Sakshi

బిగ్‌బీ మనవరాలు నవ్య నవేలీ నంద, హీరో సిద్దాంత్‌ చతుర్వేది లవ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టులతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. సిద్దాంత్‌ ఓ వైట్‌ బ్రిడ్జి మీద పుస్తకం చదువుతున్నట్లుగా పోజిచ్చాడు. అటు నవ్య కూడా రాత్రి సమయంలో వైట్‌ బ్రిడ్జి మీద కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఇద్దరి ఫొటోల్లో తెల్లటి బ్రిడ్జి కామన్‌గా ఉండటంతో నవ్య, సిద్దాంత్‌ కలిసే ఉన్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. పైగా సిద్దాంత్‌ పోస్ట్‌కు మండుతున్న సూర్యుడి ఎమోజీతో రిప్లై ఇచ్చిన నవ్య తర్వాత దాన్ని డిలీట్‌ చేసింది. అయినప్పటికీ ఫ్యాన్స్‌ మాత్రం రిషికేష్‌కు వెళ్లిన వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని చెప్పకనే చెప్పారని అభిప్రాయపడుతున్నారు. కాగా హీరో సిద్దాంత్‌ చివరగా గెహ్రియాన్‌ సినిమాలో నటించాడు. ఇందులో దీపికా పదుకొణెతో పాటు నవ్య క్లోజ్‌ ఫ్రెండ్‌ అనన్య పాండే ప్రధాన పాత్రల్లో నటించారు.

చదవండి: జగత్‌ కథ చెప్పిన రోజే ఈ సినిమా అందరి హృదయాలకి దగ్గరవుతుందనిపించింది

ఆర్‌ఆర్‌ఆర్‌ ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement